
సత్య నాదెళ్లకు మాతృ వియోగం
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి (85) శనివారం మృతి చెందారు.
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి (85) శనివారం మృతి చెందారు. బంజారాహిల్స్ సాగర్‌సొసైటీలో నివాసం ఉంటున్న ప్రభావతి(85) శనివారం సాయంత్రం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం బంధువులు ఆమెను అంబులెన్స్‌లో శేర్లింగంపల్లిలోని సిటిజన్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గంమధ్యలోనే ఆమె కన్నుమూసినట్లు తెలిసింది.
కుమారుడు సత్య నాదెళ్ల కూడా అమెరికా నుంచి హైదరాబాద్ బయలుదేరినట్లు తెలిసింది. కాగా ప్రభావతి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సత్య కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు టీడీపీ మీడియా విభాగం కన్వీనర్ ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.