ఇద్దరు పిల్లలతో కాలువలోదూకిన తల్లి | mother commits suicide with two chidren | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో కాలువలోదూకిన తల్లి

Mar 31 2015 12:59 PM | Updated on Apr 4 2019 4:44 PM

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

నిజామాబాద్ :  నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా కాల్వలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరులో మంగళవారం చోటు చేసుకుంది. పంచాయతి పరిధిలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన జోడు వనజ(28) తన ఇద్దరు కూతుళ్ల(ఐదేళ్లు, ఐదు నెలలు)తో సహా పోచారం ప్రధాన కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలు వెలికి తీశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
(నాగిరెడ్డిపేట)
 

Advertisement
 
Advertisement
Advertisement