కుమార్తెను స్కూల్‌కు పంపించేందుకు బయల్దేరిన తల్లి బయల్దేరగా... ఇద్దరూ కనిపించకుండా పోయిన సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
ఖైరతాబాద్ (హైదరాబాద్): కుమార్తెను స్కూల్‌కు పంపించేందుకు బయల్దేరిన తల్లి బయల్దేరగా... ఇద్దరూ కనిపించకుండా పోయిన సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్ డివిజన్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో నివాసముండే పి.వెంకటేశ్, పి.స్వర్ణలత(22) దంపతులకు మూడేళ్ల లక్ష్మీసంకీర్తన(3) సంతానం.
కాగా, శుక్రవారం ఉదయం 8.55 గంటలకు లక్ష్మీసంకీర్తనను ఖైరతాబాద్ మార్కెట్‌లోని చోటాబీం స్కూల్‌లో విడిచిపెట్టేందుకు సంకీర్తన కుమార్తెను తీసుకుని ఇంటినుంచి వెళ్ళింది. తిరిగి ఎంతకీ రాకపోవడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్ళల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో సాయంత్రం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.