టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం | MLA Gongidi Sunitha Narrowly Escaped From Major Accident At Aleru | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

Dec 19 2019 3:35 PM | Updated on Dec 20 2019 2:05 AM

MLA Gongidi Sunitha Narrowly Escaped From Major Accident At Aleru - Sakshi

పెచ్చులు నేరుగా గొలనుకొండ సర్పంచ్‌ లక్ష్మి తలపై పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

సాక్షి, యాదగిరిగుట్ట: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు పెనుప్రమాదం తప్పింది. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పంచాయతీరాజ్‌ అతిథి గృహంలో ప్రజాప్రతినిధులతో భేటీ తర్వాత లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేయడానికి సునీత సిద్ధమయ్యారు. ఆ సమయంలో సీలింగ్‌ పైకప్పు పెచ్చులు ఊడి అక్కడే ఉన్న గ్లాస్‌ టేబుల్‌పై పెచ్చులు పడటంతో టేబుల్‌ విరిగి గ్లాస్‌ ముక్కలు తగలడంతో ఆమె మోకాళ్లు, చేతి వేలికి గాయమైంది. సునీత పక్కనే ఉన్న ఆలేరు మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఇందిర, గొలనుకొండ సర్పంచ్‌ లక్ష్మి తలలకు గాయాలయ్యాయి. వారి ని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement