మిషన్ ‘బ్లాంకెట్’ బాగుంది ! | Mission 'Blanket' program | Sakshi
Sakshi News home page

మిషన్ ‘బ్లాంకెట్’ బాగుంది !

Dec 5 2014 3:33 AM | Updated on Sep 2 2017 5:37 PM

చలికాలన్ని దృష్టిలో ఉంచుకుని పేద బీసీ విద్యార్థులకు రక్షణ కల్పించడానికి శ్రీకారం చుట్టిన మిషన్ ‘బ్లాంకెట్’ కార్యక్రమం బాగుందని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వెంకట్ నారాయణ, జిల్లా బీసీ సంక్షేమ సంఘాన్ని అలాగే దాతలను అభినందించారు.

ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వెంకట్‌నారాయణ
ఇందూరు : చలికాలన్ని దృష్టిలో ఉంచుకుని పేద బీసీ విద్యార్థులకు రక్షణ కల్పించడానికి శ్రీకారం చుట్టిన మిషన్ ‘బ్లాంకెట్’ కార్యక్రమం బాగుందని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వెంకట్ నారాయణ, జిల్లా బీసీ సంక్షేమ సంఘాన్ని అలాగే దాతలను అభినందించారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక నాందేవ్‌వాడ బీసీ కళాశాల బాలుర వసతిగృహ విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు.

ఈ మిషన్ ‘బ్లాంకెట్’ కార్యక్రమాన్ని చూసి స్పందించిన విద్యుత్ శాఖ ఉద్యోగులు ఈ సందర్భంగా కొనుగోలు చేసిన 140 దుప్పట్లను సీఎండీ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కన్న ఊరును విడిచిపెట్టి జిల్లా కేంద్రానికి చదువుకోవడానికి వచ్చి, వసతిగృహంలో ఉంటున్న విద్యార్థులకు చాలా కష్టాలుంటాయన్నారు. ప్రభుత్వం తరపున అందాల్సిన వస్తువులు సకాలంలో అందకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని చలి కాలంలో విద్యార్థులకు రక్షణ కల్పించడానికి దాతలు మరింత ముందుకు రావాలని కోరారు.  విద్యార్థులు  బాగా చదువుకోవాలని సూచించారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే బీసీ నాందేవ్‌వాడ వసతిగృహ విద్యార్థులకు రాజ్‌కుమార్ అనే వ్యక్తి రూ.2వేలు విలువ చేసే క్రీడాసామగ్రి విద్యార్థులకు అందజేశారు.   కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రభాకర్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు హెచ్. రేవంత్, పవర్ డిప్లామా కార్యదర్శి తోట రాజశేఖర్, రిటైర్డ్ ఎంపీడీఓ ఆంజనేయులు, ట్రాన్స్‌కో డీఈ ముక్తార్, బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement