రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్‌ఏ సుకూర్ శుక్రవారం తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దర ఖాస్తులు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్‌ఏ సుకూర్ శుక్రవారం తెలిపారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం కొత్తవి, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి సెప్టెంబర్ 10 వ తేదీ గడువు అని, అదే రీతిలో పోస్టు మెట్రిక్ కోసం దరఖాస్తు చేసుకునే వారు సెప్టెంబర్ 15న, రెన్యువల్స్ అయితే అక్టోబర్ 10వ తేదీ గడువుగా పేర్కొన్నారు. దరఖాస్తు విధానం, అర్హతలు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీఎస్‌ఎంఎఫ్‌సీ.కామ్‌లో ఉంటాయన్నారు.