కేసీఆర్‌ మొండిఘటం: కేటీఆర్‌ | minister KTR prices cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ మొండిఘటం: కేటీఆర్‌

Feb 24 2017 3:12 AM | Updated on Aug 30 2019 8:24 PM

కేసీఆర్‌ మొండిఘటం: కేటీఆర్‌ - Sakshi

కేసీఆర్‌ మొండిఘటం: కేటీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొండిఘటమని, చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

సిరిసిల్ల రూరల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొండిఘటమని, చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అలాంటి కేసీఆర్‌.. ప్రతిపక్షాల కాకమ్మ కథలకు, బెదిరింపులకు భయపడబోరని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో గురువారం మంత్రి పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కష్టపడుతున్నారని, కృష్ణా, గోదావరి నీళ్లు తెచ్చి కోటి ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రయత్నిస్తుంటే కొందరు కావాలని అడ్డుపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయమని, ప్రజల బాగుకోసం ఏమైనా చేస్తారని స్పష్టం చేశారు. అనుకున్న సమయానికి ముందే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement