‘రాజకీయాల్లోనే కుల, మత జబ్బులు’

Minister KTR participates In Ambedkar Jayanti - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల: భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చెప్పిన బోధించు, సమీకరించు, పోరాడు అనే సూత్రాన్ని పాటించే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆయన శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన అంబేద్కర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాబా సాహెబ్‌ కుల నిర్మూలన వ్యవస్థ కోసం పోరాడి.. బౌద్ధాన్ని స్వీకరించారన్నారు. అంబేద్కర్‌ అందరి వాడని.. ఆయనను కొందరి వాడిలా చేయడం జాతికి మంచిది కాదన్నారు.

దేశంలో ప్రజల మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్నా, అందరూ కలిసి ఉన్నారంటే దానికి కారణం మన రాజ్యాంగమని తెలిపారు. కుల, మత, పేద, ధనిక అనే వివక్ష లేని సమసమజాన్ని ఏర్పరచుకోవడమే అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. అన్నీ కులాలను, ప్రతీ పేదవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వాదన్నారు. అంబేద్కర్‌ ఓవర్సెస్‌ స్కాలర్‌ షిప్‌ ద్వారా 25 లక్షల రూపాయలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీసర్కార్‌ అని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే వ్యక్తుల్లో కులం, మతం అనే జబ్బులొస్తాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top