మంత్రి కేటీఆర్‌కు జర్మనీ ఆహ్వానం

Minister KTR Invited To Germany For Study - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావుకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జర్మనీలో విత్తన రంగంపై అధ్యయనానికి రావాల్సిందిగా ఇండో జర్మన్ కో-ఆపరేషన్‌ ఆన్‌ సీడ్‌ సెక్టార్‌ డెవలప్‌మెంట్‌ ఆహ్వానం పంపింది. జర్మనీలోని విత్తన ఉత్పత్తి అభివృద్ధి ఇంప్లిమెంట్‌ ఏజెన్సీ ఏడీటీ ప్రాజెక్ట్‌.. కేటీఆర్‌కు లేఖ రాసింది.

ఈ నెల 25 నుంచి 27 వరకు జర్మనీలో పర్యటించి విత్తన రంగంపై అధ్యయనం చేయాలని కోరింది. విత్తనోత్పత్తి కేంద్రాల్లో పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఈ అధ్యయనం తెలంగాణలో విత్తన పార్కు ఏర్పాటుకు సహకరిస్తుందని తెలిపింది. 26న బెర్లిన్‌లో జరిగే వరల్డ్‌ ఫుడ్‌ కన్వెక‌్షన్‌కు కూబా హాజరుకావాలని కోరింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top