
24 గంటల కరెంటు వద్దంటున్నారు
వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నా.. కొందరు రైతులు వద్దంటున్నారని మంత్రి కె.తారక రామారావు తెలిపారు.
గోదావరి జలాలతో కాళేశ్వరం ద్వారా తెలంగాణలోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని వివరించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి, సిరిసిల్ల ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడుకుందామని, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందామని సూచించారు. నేరెళ్ల దళితులపై పోలీసులు ‘థర్డ్ డిగ్రీ’ప్రయోగించిన ఘటనపై కేటీఆర్ ఏమీ మాట్లాడలేదు. ప్రతిపక్షాలు నేరెళ్ల ఘటనపై తీవ్రంగా స్పందించినా.. కేటీఆర్ మౌనం వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.