పోరుబాట నడిచి...ప్రాణాలను విడిచి | maoist moves in border villages | Sakshi
Sakshi News home page

పోరుబాట నడిచి...ప్రాణాలను విడిచి

Jul 28 2014 2:41 AM | Updated on Oct 9 2018 2:47 PM

పేదల కోసం ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అమరుల గురించి ప్రభుత్వాలు కానీ, విప్లవ పార్టీలు కానీ ఆలోచించడం లేదు.

కామారెడ్డి: పేదల కోసం ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అమరుల గురించి ప్రభుత్వాలు కానీ, విప్లవ పార్టీలు కానీ ఆలోచించడం లేదు. దీంతో వారు కన్నీళ్లు దిగమింగుకుని, శ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. తమవారు గుర్తుకొచ్చినపుడు నాలుగు క న్నీళ్లు రాల్చి తమ బతుకులింతేనని నిట్టూరుస్తున్నారు. కడు బీదరికంతో అష్టకష్టాలు పడుతున్నా రు.

తినడానికి తిండి దొరక్క, ఆదుకునేవారు లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఆసరా కరువై అలమటిస్తున్నారు. ఎవరైనా ఆదుకుంటారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా’ అంటూ తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వమైనా వారి కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేయాలని పలువురు కోరుతున్నారు.

 తండ్రితో పాటే కూతురి త్యాగం
 కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన చాకలి నర్సింహులు అలియాస్ అమర్ పీపుల్స్‌వార్‌లో కామారెడ్డి ప్రాంత ఆర్గనైజర్‌గా పనిచేశారు. ఓ రోజు పోలీసులు ఇస్రోజివాడి గ్రామంపై దాడి చేశారు. అప్పుడు జరిగిన ఎన్‌కౌంట ర్‌లో నర్సింహులు చనిపోయారు. తరువాత ఆయన కూతురు మానస తండ్రి బాటలోనే అడవి దారి పట్టింది. కొంత కాలానికి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె కూడా మృతి చెందింది. దీంతో నర్సింహులు కన్నవాళ్లకు, కట్టుకున్న భార్యకూ కన్నీళ్లే మిగిలాయి. వారి జీ వితం కడుదయనీయంగా మారింది. వారితోపాటు ఇస్రోజివాడికే చెందిన, ఐలయ్య, రామస్వామి చనిపోయారు. ఇదే మండలంలోని గూడెం గ్రామానికి చెందిన బాల్‌రాజు, దామోదర్ కూడా మరణించారు.

 కష్టాల్లో మర్కల్ బాల్‌రాజు కుటుంబం
 పీపుల్స్‌వార్‌లో పని చేస్తుండగా, సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి చెందిన జూకంటి బాల్‌రాజును 1997లో గ్రామంలోనే పోలీసులు కాల్చిచంపారు. బాల్ రాజుకు ఇద్దరు భార్యలు ఉండగా, మొదటి భార్య రాధకు ఇద్దరు కొడుకులు. బీడీలు చుట్టడంతోపాటు ఉపాధి పనులకు వెళ్తోంది. రెండో భార్య లక్ష్మి అనారోగ్యంతో ఇటీవలే చనిపోయింది. ఈమెకు కూతురు దివ్య ఉండగా, ఆమె వివాహం జరిగింది. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. బాల్‌రాజు ఎన్‌కౌంటర్‌లో చనిపోయేనాటికి కుటుం బానికి ఏమీ లేని పరిస్థితి ఉండడంతో గ్రామస్థులు ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఇదే గ్రామానికి చెందిన కోక లత, నర్సింలు, రాజిరెడ్డి చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement