నీటి మీదప్రాణాలు.. 

Lifes Are In Danger - Sakshi

పరిమితికి మించి పర్యాటకులను ఎక్కిస్తున్న నిర్వాహకులు

పట్టించుకోని అధికారులు  

పర్ణశాల: భద్రాచలం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న రామయ్య పుణ్యక్షేత్రం పర్ణశాల.. ఇక్కడ శ్రీరామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం చేసి.. బోటు షికార్‌ చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇదే అదునుగా భావిస్తున్న ఇక్కడి బోట్ల యజమానులు పంచాయతీ శాఖ నిబంధలనకు తుంగలో తొక్కుతూ.. భక్తుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. సరదాగా గోదావరిలో విహరిద్దామని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా భావించే యాజమాన్యం బోటులో పర్యాటకులను లెక్కకు మించి ఎక్కించుకుంటున్నారు. బోటులో షికార్‌ చేసే పర్యాటకుడికి సెఫ్టీ జాకెట్‌ ఇవ్వకపోవడంతో ఎదైనా ప్రమాదం జరిగితే ప్రణాలు నీళ్ల పాలు కావాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బోటు షికార్‌ పేరుతో పర్యాటకులను గోదావరి మధ్యలోని ఇసుక దిబ్బెల వద్ద దించడంతో ఆ ప్రాంతంపై ఆవగాహన లేని పర్యాటకులు నీట మునిగి మృత్యువాత పడుతున్నారు. గతంలో ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయి. అయినా బోటు నిర్వాహకుల తీరు మారడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
నీటి మీదప్రాణాలు.. 
పర్ణశాల ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులు, పర్యాటకులు తప్పకుండా గోదావరిలో బోటు షికార్‌ చేయకుండా వెనుతిరగరు. నిండుగా వుండే గోదావరిలో విహరించేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో పర్యాటకుల ఆసక్తిని క్యాష్‌ చేసుక9ునేందుకు బోటు నిర్వాహకులు నిబంధనలకు నీళ్లు తొక్కుతున్నారు. వాస్తవానికి పాటాదారుడు పంచాయతీ నిబంధలన ప్రకారం బోట్‌ షికార్‌ నిర్వహించాలి. కాని ఇక్కడ అలా జరగడం లేదు. యాజమాన్యం నింధనలకు విదుద్ధంగా లెక్కకు మించి పర్యాటకులను బోట్లలో ఎక్కిస్తున్నారు.

పంచాయతీ నిబంధనలు ఇవీ.. 

  • బోట్‌ షికార్‌ నిర్వాహకులు పంచాయతీ నిబంధనల ప్రకారం గోదావరిలో బోటును నడపాల్సి ఉంటుంది.
  • ప్రతి బోటుకు లైసెన్స్‌ ఉండాలి.కండిషన్‌ను ప్రతిరోజు తనిఖీ చేయాలి. 
  • బోటు ఎక్కిన ప్రతి ఒక్కరికి లైవ్‌జాకెట్‌ వేయాలి.
  • పంచాయితీ అధికారులు సూచించిన
  • లెక్క ప్రకారం బోటులో పర్యాటకులను ఎక్కించుకోవాలి.  
  • బోటు గోదావరి మధ్య వరకు వెళ్లి వెనుతిరగాలి.
  • బోటు నడిపే వ్యక్తులకు దానిపై పూర్తిస్థాయిలో పట్టు ఉండేలా చూసుకోవాలి.     

  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top