
టీఆర్‌ఎస్ ముఖ్య నేత కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు.
సాక్షి,సిటీబ్యూరో : టీఆర్‌ఎస్ నేత, మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం నగరంలోని ఉప్పల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ప్రారంభమయ్యే రోడ్ షో మూడున్నరకు, మల్లాపూర్ శివహోటల్, నాలుగున్నరకు ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్, ఐదున్నరకు రసూల్‌పురా ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగుతుంది. ఆరున్నరకు బాపూజీ నగర్ అశోక గార్డెన్ మీదుగా వెస్ట్ మారేడపల్లి పోలీస్టేషన్ వరకు కొనసాగుతుంది.