కేంద్ర మంత్రికి కేటీఆర్‌ విజ్ఞప్తి | Ktr Requests Hardeep to arrange Muscat to Hyderabad flights | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రికి కేటీఆర్‌ విజ్ఞప్తి

Jun 6 2020 10:41 AM | Updated on Jun 6 2020 10:46 AM

Ktr Requests Hardeep to arrange Muscat to Hyderabad flights - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారితో ఇబ్బందిపడుతున్న కార్మికుల కోసం మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు విమానాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాలు, జీతాలు లేక అక్కడ భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు.

కరీంనగర్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ అనే కార్మికుడు మస్కట్‌లో 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అయితే మూడు నెలలుగా పని, ఆహారం, జీతాలు లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వీడియో తీసి కేటీఆర్‌కు ట్యాగ్‌ చేశాడు. భారత్‌కు వద్దామనుకుంటే హైదరాబాద్‌కు విమానాలు లేక కార్మికులు అవస్థలుపడుతున్నారని పేర్కొన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement