Minister KTR Birthday Celebrations Grandly In Australia - Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

Jul 23 2023 1:49 PM | Updated on Jul 23 2023 2:35 PM

KTR Birthday Celebrations In Australia - Sakshi

తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రివర్యులు KTR జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రా ,బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెల్‌బోర్న్‌లో సాయిరాం ఉప్పు ఆధ్వర్యం లో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేశారు . 

ఈ కార్యక్రమ అనంతరం ఏర్పాటు చేసిన వేడుకలో విశ్వామిత్ర  మంత్రి ప్రగడ  మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా తెరాస ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో బాగంగా మెల్బోర్న్ లో వినయ్ సన్నీ  ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్  కమిటి నాయకులు ప్రవీణ్ లేదెళ్ళ, వేణు నాథ్ , సాయి యాదవ్ , ఉదయ్ ,సాయి కృష్ణ కల్వకుంట్ల ,సురేష్ మండ, రాకేష్, సూర్య రావు ,అశోక్, బాలరాజు, మిస్కీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement