ప్రచార రథంపై కనిపించని కిషన్‌రెడ్డి ఫొటో | Kishan reddy photo missing in bjp Rath Yatra for election campaign | Sakshi
Sakshi News home page

ప్రచార రథంపై కనిపించని కిషన్‌రెడ్డి ఫొటో

Apr 11 2014 11:55 AM | Updated on Mar 29 2019 9:24 PM

ప్రచార రథంపై కనిపించని కిషన్‌రెడ్డి ఫొటో - Sakshi

ప్రచార రథంపై కనిపించని కిషన్‌రెడ్డి ఫొటో

ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

హైదరాబాద్ : ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే దత్తాత్రేయ ప్రచార రథంపై ఆపార్టీ నేత కిషన్ రెడ్డికి చోటు దక్కలేదు.

చంద్రబాబు నాయుడు ఫోటో తప్ప బీజేపీ నేతల ఫోటోలు లేకపోవటం గమనార్హం. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నరేంద్ర మోడీ హవాతో కాంగ్రెస్ పూర్తిగా కొట్టుకుపోతుందన్నారు. బీజేపీతోనే తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. కాగా బీజేపీ, టీడీపీ పొత్తులతో ఎన్నికలకు వెళుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement