ప్రారంభమైన టీఆర్ఎస్ శిక్షణా శిబిరం | KCR to Take Classes to TRS Leaders at Nagarjuna Sagar ... | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన టీఆర్ఎస్ శిక్షణా శిబిరం

May 2 2015 10:40 AM | Updated on Oct 19 2018 7:19 PM

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ విజయవిహార్ లో టీఆర్ఎస్ శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి పాలనా పగ్గాలు..

నాగార్జున సాగర్ : నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ విజయవిహార్ లో టీఆర్ఎస్ శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి పాలనా పగ్గాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గెలిచిన ప్రజా ప్రతినిధులకు మూడు రోజుల పాటు ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ శిక్షణా తరగతులను పర్యవేక్షిస్తున్నారు.  ఆయన ఎమ్మెల్యేలకు స్వయంగా పాఠాలు చెప్పనున్నారు. కాగా ప్రారంభ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ జేఎం లింగ్డో, ప్రొఫెసర్ సీహెచ్ హన్మంతరావు, ఆస్కి డైరెక్టర్ జనరల్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement