'నా మీద నమ్మకంతోనే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు' | kcr believe's me as a deputy cm, says kadiyam srihari | Sakshi
Sakshi News home page

'నా మీద నమ్మకంతోనే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు'

Jan 26 2015 3:43 PM | Updated on Aug 15 2018 8:06 PM

'నా మీద నమ్మకంతోనే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు' - Sakshi

'నా మీద నమ్మకంతోనే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు'

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన మీద నమ్మకంతోనే డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారని కొత్తగా డిప్యూటీ సీఎంగా ఎన్నికైన కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన మీద నమ్మకంతోనే డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారని కొత్తగా డిప్యూటీ సీఎంగా ఎన్నికైన కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం వరంగల్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. 

వరంగల్ కు ఆయన వరాల జల్లు కురిపించారు. వరంగల్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి పారిశ్రామిక పట్టణంగా తీర్చి దిద్దుతానని తెలిపారు. ప్రజల భిక్షతోనే తనకీ పదవి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రాజకీయాలు చేయాలని, ఎన్నికల అనంతరం ప్రజలకు సేవ చేయాలని ఆయన రాజకీయ పార్టీలకు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement