ఎగువ నీటిని సాగర్‌కు వదలాలి | JULAKANTI letter to kcr | Sakshi
Sakshi News home page

ఎగువ నీటిని సాగర్‌కు వదలాలి

Sep 3 2017 2:22 AM | Updated on Aug 15 2018 9:40 PM

ఎగువ నీటిని సాగర్‌కు వదలాలి - Sakshi

ఎగువ నీటిని సాగర్‌కు వదలాలి

కృష్ణా నది ఎగువ నుంచి వస్తున్న నీటిని నేరుగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు విడుదల చేయాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

సీఎంకు జూలకంటి లేఖ  
సాక్షి, హైదరాబాద్‌:
కృష్ణా నది ఎగువ నుంచి వస్తున్న నీటిని నేరుగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు విడుదల చేయాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆ నీటిని సాగర్‌ ఎడమ కాల్వ ద్వారా సాగు, తాగు అవసరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు శనివారం లేఖ రాశారు.

మూడేళ్లుగా సాగర్‌కు నీటి రాక తగ్గిందని, కనీస నీటిమట్టం 510 అడుగులలోపు కూడా నీరుండని దుస్థితి ఏర్ప డిందన్నారు. ఫలితంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలతోపాటు హైదరాబాద్‌ కూడా తాగునీటికి అవస్థలు పడుతున్నాయన్నారు. జూరాల, కర్ణాటకలోని నారాయణపూర్‌ నుంచి 15 టీఎంసీలు శ్రీశైలాని కి వస్తోందని, ఆ నీటిని సాగర్‌కు విడుదల చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement