
కేసీఆర్ రెండు రోజుల ప్రచారం
ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయ మే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలో ఈ నెల 22, 26 తేదీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు నిర్ణయించారు.
- నియోజకవర్గానికి ఒక సభ
- 22, 26 తేదీల్లో జిల్లా పర్యటన
వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయ మే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలో ఈ నెల 22, 26 తేదీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు నిర్ణయించారు. నియోజకవర్గానికి ఒక సభ చొప్పున ఏర్పాటు చేసి స్వయంగా తానే హాజరయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించా రు. 22న జిల్లాలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో జరిగే సభల వివరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా 26వ తేదీన నాలుగు సెగ్మెంట్‌లలో జరిగే సభల వివరాలు వెల్లడయ్యాయి.
22న ఐదు సెగ్మెంట్‌లలో..
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో 22వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు భూపాలపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12-40 గంటలకు ములుగు, 1-30 గంటలకు మహబూబాబాద్, 2-20 గంటలకు తొర్రూరు, 3గంటలకు మరిపెడలో జరిగే సభల్లో ప్రసంగిస్తారు.
26న నాలుగు సెగ్మెంట్‌లలో..
26న మధ్యాహ్నం 3-20 గంటలకు పరకాల, సాయంత్రం 4 గంటలకు నర్సంపేట, 4-40 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్, 5-20 గంటలకు జనగామలో ఎన్నికల బహిరంగ సభలు నిర్వహించేందుకు నిర్ణయించారు. సభల్లో 30 నిమిషాల కేసీఆర్ ప్రసంగం, 10 నిమిషాల హెలికాప్టర్ ప్రయాణంగా పూర్తి కార్యక్రమాన్ని రూపొందించారు.