విద్యతోనే ఉన్నత శిఖరాలు

Hero Sushanth Participate In College Fest Hyderabad - Sakshi

హైదరాబాద్‌, సుందరయ్య విజ్ఞానకేంద్రం: ప్రణాళికబద్ధంగా విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రముఖ నటుడు సుశాంత్‌ అనుమోలు అన్నారు. శుక్రవారం ఆర్టీసి కళ్యాణ మండపంలో అరోరా రామంతాపూర్‌ డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో ఆలాప్‌ పేరిట సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హాజరైన సుశాంత్‌ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి సారించకుండా అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మానవ విలువలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైన ఉందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎన్‌.రమేష్‌ బాబు, కెఎంవి గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాసన్, ప్రముఖ విద్యావేత్త బాలాజి వీరమనేని, ప్రముఖ సినీ దర్శకులు పరశురాం, సంగీత దర్శకులు వివేక్‌ సాగర్, కళాశాల వైస్‌ చైర్మన్‌ ఎన్‌.అనుదీప్, డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.మాధవి, డాక్టర్‌ మోహన్‌ కుమార్, డాక్టర్‌ పి.జనార్ధన్‌ రెడ్డి, డిపార్ట్‌మెంట్‌ అధిపతులు సతీష్‌కుమార్, దేవేందర్‌ రావు,అర్పిత, శుభప్రద తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top