ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు మం డలాల్లో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురి సింది.
ఆదిలాబాద్‌టౌన్/నిర్మల్ రూరల్: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు మం డలాల్లో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురి సింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో కొన్ని ప్రాంతాల్లో రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాం తాల్లోని ఇళ్లల్లోకి వరదనీరు చేరడంతో సరుకులన్నీ తడిసిపోయాయి. పంట చేలల్లో వర్షపు నీరు కారణంగా ఇటీవల విత్తుకున్న పత్తి, సోయా విత్తనాలు కొట్టుకుపోయాయి.
పెంబి మండలం పల్కేరువాగు పొంగి పొర్లడంతో మండలానికి రాకపోకలు తెగిపోయాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్‌వాసి పున్నం శంకరవ్వ(55), వెంకటవ్వ, పద్మ సమీపంలోని చెరువులో బట్టలు ఉతుక్కొని వస్తుండగా పిడుగు పడి శంకరవ్వ అక్కడికక్కడే మృతి చెందగా వెంకటవ్వ, పద్మకు గాయాల య్యాయి. నిర్మల్‌లో ఓ ఇంట్లో నిర్మాణంలో ఉన్న సెప్టిక్‌ట్యాంక్ వర్షపు నీటితో నిండగా ఆడుకుంటూ వెళ్లిన ఓ బాలుడు అందులో పడి మృతి చెందాడు.