మాదేశంలో ఇలాంటి గ్రామం లేదెందుకు..? | Gangadevipalli as an Ideal Village in Warangal | Sakshi
Sakshi News home page

మాదేశంలో ఇలాంటి గ్రామం లేదెందుకు..?

Nov 20 2014 3:14 AM | Updated on Sep 2 2017 4:45 PM

‘దేవుడా.. మా దేశంలో గంగదేవిపల్లి లాంటి దేశం లేదెందుకు.. ఇలాంటి గ్రామం మా దేశంలో ఉంటే బాగుండు.. మేం దుర్భర జీవితాలు అనుభవిస్తున్నాం..

విలపించిన సూడాన్ దేశ ప్రతినిధి
గీసుకొండ :  ‘దేవుడా.. మా దేశంలో గంగదేవి పల్లి లాంటి దేశం లేదెందుకు.. ఇలాంటి గ్రా మం మా దేశంలో ఉంటే బాగుండు.. మేం దుర్భర జీవితాలు అనుభవిస్తున్నాం.. మాలాంటి బాధలు ఎవరికీ రాకూడదు’.. అంటూ జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిని సందర్శించిన సూడాన్ దేశ ప్రతినిధి ఇబ్రహీం కన్నీరు పెట్టుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది. మండలంలోని గంగదేవిపల్లిని పది దేశాల ప్రతినిధులు బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఇక్కడి ప్రజలు సాధించిన విజయాలను తెలుసుకున్న ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. తమ దేశం లో ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని విలపించారు. ఆ తర్వాత ఆయనను సముదాయించారు. ఎన్‌ఐఆర్‌డీ ఆధ్వర్యంలో బాలవి కాస సాంఘిక సేవా సంస్థ కార్యకలాపాలను తెలుసుకోవడానికి వచ్చిన విదేశీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో గ్రామాల పరిశీలనకు వచ్చారు.
 
ప్రజల భాగస్వామ్యంతో పలు కమిటీల ద్వారా చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎరిత్రి, ఘనా, మార్కస్, మయన్మార్, సౌత్‌సూడాన్, సూడాన్, సిరియా, కజకిస్తాన్, టాంజానియా, జింబాంబ్వే దేశాల ప్రతినిధులతోపాటు ఎన్‌ఐఆర్‌డీ ప్రోగ్రాం డెరైక్టర్ పి.విజయ్‌కుమార్, బాలవికాస ప్రోగ్రాం మేనేజర్ ఎస్.సునీత, సర్పంచ్ ఇట్ల శాంతి, గ్రామాభివృద్ధి కమిటీ నాయకుడు కూసం రాజమౌళి, పంచాయతీ కార్యదర్శి విమల, పెండ్లి మల్లారెడ్డి, కూసం లింగయ్య, చల్ల మల్లయ్య, గోనె రాజయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులు మొక్కలు నాటారు.

Advertisement
Advertisement