కౌంటర్‌ దాఖలు చేయండి | File counter | Sakshi
Sakshi News home page

కౌంటర్‌ దాఖలు చేయండి

Nov 1 2017 2:10 AM | Updated on Apr 7 2019 3:47 PM

File counter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ నిర్వహించతలపెట్టిన ‘కొలువుల కొట్లాట’ కార్యక్రమా నికి అనుమతి నిరాకరించడానికి గల కారణాలతో కౌంటర్‌ దాఖ లు చేయాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరా బాద్‌లో ఏవైనా రాజకీయ, సామాజిక, మతపరమైన కార్యక్రమాలకు అనుమతి నిరా కరించారా? నిరాకరించి ఉంటే ఎన్నింటికి అనుమతులు ఇవ్వలేదు.. వేటి ఆధారంగా నిరాకరించారో ఆ రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

తదుపరి విచారణను నవం బర్‌ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొలువుల కొట్లాట పేరుతో నిర్వహిం చతలపెట్టిన బహిరంగ సభకు అనుమతి కోసం తాము పెట్టుకున్న దరఖా స్తులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదం డరాం హైకోర్టులో పిటిషన్‌ దాఖ లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ మంగళవారం మరోసారి విచారణ జరిపారు.

ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) శరత్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ, కొలువుల కొట్లాట కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించారని తెలిపారు. కోర్టు అనుమతివ్వకపోయినా కార్యక్రమాన్ని నిర్వ హిస్తామని కోదండరాం చెప్పినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. కోదండరాం తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాద నలు వినిపిస్తూ, కోర్టు అనుమతిచ్చే వరకు వేచిచూస్తామని కోదండరాం చెప్పారే తప్ప మరో రకంగా కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement