రూ.500 కోసం కొడుకును చంపిన తండ్రి | father murdered his son | Sakshi
Sakshi News home page

రూ.500 కోసం కొడుకును చంపిన తండ్రి

Mar 22 2015 8:02 PM | Updated on Oct 8 2018 5:04 PM

తనను అడగకుండా జేబులో ఉన్న రూ.500లు తీసుకెళ్లాడని ఓ తండ్రి కొడుకును తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

జడ్చర్ల : తనను అడగకుండా జేబులో ఉన్న రూ.500లు తీసుకెళ్లాడని ఓ తండ్రి కొడుకును తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం...  ఇప్పలపల్లి గ్రామానికి చెందిన యాదయ్య(25)  బతుకుదెరువుకోసం హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే రెండురోజుల క్రితం ఉగాది పండుగ కోసం స్వగ్రామానికి వెళ్లాడు. కాగా స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు తండ్రి లక్ష్మయ్య జేబులో ఉన్న రూ.500ను అడగకుండా తీసుకెళ్లాడు. 

 

తాగి ఇంటికొచ్చిన కొడుకుపై తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. డబ్బులు తీసుకెళ్లడమే కాకుండా తాగి ఇంటికొస్తావా అంటూ కొడుకు యాదయ్యను పెరట్లోని చెట్టుకు కట్టేసి కొట్టాడు. దెబ్బలకు తాళలేక యాదయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఉంది.  కాగా నాగర్‌కర్నూల్ డీఎస్పీ గోవర్దన్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement