పొలంలో నీరు పెట్టేందుకని వెళ్లిన రైతు విద్యుదాఘాతంతో అసువులు బాశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా మామడ మండలంలో చోటుచేసుకుంది.
పొలంలో నీరు పెట్టేందుకని వెళ్లిన రైతు విద్యుదాఘాతంతో అసువులు బాశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా మామడ మండలంలో చోటుచేసుకుంది. కమాల్‌కోట్ గ్రామానికి చెందిన అబ్బటి రాజేశ్వర్‌రెడ్డి (44) బుధవారం రాత్రి 8 గంటల సమయంలో పొలంలో మోటారు ఆన్ చేయటానికి వెళ్లాడు. మోటారు వైరు ఒకటి తెగిపడిన విషయం గమనించని రైతు దానిని తాకటంతో షాక్‌కు గురై చనిపోయాడు. ఆయన ఇంటికి తిరిగి రాకపోయేసరికి వెతుక్కుంటూ పొలంలోకి వెళ్లిన కుటుంబ సభ్యులకు రాజేశ్వర్ రెడ్డి విగతజీవిగా కనిపించాడు. రాజేశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.