ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మేడాంపల్లి గ్రామంలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో ఒక రైతు మృతి చెందాడు.
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మేడాంపల్లి గ్రామంలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో ఒక రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ముహమ్మద్ రజాక్(30) అనే యువ రైతు పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటారు స్విచ్ ఆన్ చేయగా కరెంట్ షాక్ కొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన తోటి రైతులు విషయం కుటుంబ సభ్యులకు తెలిపారు.