విద్యుదాఘాతంతో రైతు మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని తుంగపహాడ్ గ్రామ పంచాయతీ లావూడి తండాలో శుక్రవారం చోటు చేసుకుంది.
మిర్యాలగూడ రూరల్
విద్యుదాఘాతంతో రైతు మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని తుంగపహాడ్ గ్రామ పంచాయతీ లావూడి తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన విరాల ప్రకారం.. లావూడితండాకు చెందిన లావూడి రాములు(45) ఇదే గ్రామ పంచాయతీ శివారు తులసితండాలో బోరు బావి కింద రెండు ఎకరాల పొలం ఉంది. మోటర్‌కు విద్యుత్ సరఫరా కాకపోవడంతో ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లాడు. దానిని పరిశీలిస్తుండగా రాములుకు విద్యుత్ వైరు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.