విద్యుదాఘాతానికి ఒక రైతు బలయ్యాడు.
విశాఖపట్టణం: విద్యుదాఘాతానికి ఒక రైతు బలయ్యాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా చోడవరం మండలం లెక్కలవారి కల్లాలు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ముప్పిరెడ్డి అప్పారావు(40) అనే రైతు పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలంలో తెగిపడి ఉన్న కరెంట్ తీగను గమనించకుండా అందులోకి దిగాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.
(చోడవరం)