క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకున్నాడు.
కాగా, డబ్బులు ఇవ్వలేదని తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి భిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన సెల్‌ఫోన్‌లో ఫ్రెండ్స్‌కు బెట్టింగ్ చేయకండి ప్లీజ్.. బెట్టింగ్ కారణంగానే నేను చనిపోతు న్నాను.. మామవాళ్లు, అన్నవాళ్లు ఎవరూ బెట్టింగ్ చేయకండి.. అంటూ సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్ ద్వారా తన స్నేహితులకు పంపించాడు. మూడు రోజుల తర్వాత తల్లిదండ్రులు వాట్సాప్‌లో తన కుమారుడు క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని చనిపోయాడనే విషయం తెలుసుకున్నారు. విజయ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోన్‌కాల్స్ ఆధారంగా వారిని గుర్తించనున్నారు.