దంపతుల ఆత్మహత్యాయత్నం | Couple to commit suicide thje cause of family problems | Sakshi
Sakshi News home page

దంపతుల ఆత్మహత్యాయత్నం

Oct 2 2014 11:40 PM | Updated on Mar 28 2018 11:05 AM

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దంపతులు ఒంటికి...

జవహర్‌నగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దంపతులు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకన్న, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా రాజంపేట గ్రామానికి చెందిన పబ్బోజు హరి(40), పద్మ(34) దంపతులు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం జవహర్‌నగర్‌కు వలస వచ్చారు. వీరి కుమార్తెలు శ్రావ్య(13) సోనీ(11) స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు.కార్పెంటర్ పనిచేసే హరి నిత్యం మద్యం తాగుతూ భార్యతో గొడవపడుతున్నాడు. కుటుంబ పోషణకు డబ్బు లు ఇచ్చేవాడు కాదు.

  దీంతో పద్మ స్థానికంగా ఓ లేడిస్ టైలర్స్‌లో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. మద్యం మానేయాలని పలుమార్లు ఆమె భర్తను బతిమాలినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు ఇటీవల దంపతులకు ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ఈక్రమంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో భార్యాభర్తలు తిరిగి తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన పద్మ ఇంట్లోకి వెళ్లి కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది.

మంటల బాధ తాళలేక బయటకు పరుగులు తీసింది. భార్య ఆత్మహత్యాయత్నం చేయడంతో తాను బతికి ఫలితం లేదని భావించిన హరి కూడా అక్కడే ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చిన్న కూతురు సోనీ విషయం గమనించి గఓ బకెట్ సాయంతో తల్లిదండ్రులపై నీళ్లు పోసింది. స్థానికులు మంటలు ఆర్పి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలపాలైన దంపతులను చికి త్స నిమిత్తం 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే హరి మృతిచెందాడు. తండ్రి మృతిచెం దడం, తల్లి చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడడంతో శ్రావ్య, సోనీ లు కన్నీటిపర్యంతమయ్యారు.  కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement