ఘట్కేసర్లో దోపిడీ దొంగలు బీభత్సం | couple looted by miscreants in rangareddy district | Sakshi
Sakshi News home page

ఘట్కేసర్లో దోపిడీ దొంగలు బీభత్సం

Nov 24 2014 8:48 AM | Updated on Jul 10 2019 7:55 PM

రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎన్ఎస్సీ నగర్ వద్ద దారికాచిన దుండగలు అటుగా

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎన్ఎస్సీ నగర్ వద్ద దారికాచిన దుండగలు   అటుగా వస్తున్న దంపతులను చితకబాది వారి వద్ద నుంచి అందినకాడికి దోచుకున్నారు. దంపతుల వద్ద నుంచి 7 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.15వేల నగదు, బైక్ అపహరించుకు వెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement