
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 1,196 కరో నా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,274కి చేరింది. ఇందు లో 34,323 మంది కోలుకోగా.. 11,530 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారం కరోనాతో ఏడుగురు మృతి చెందగా మరణాలు 422కి పెరిగాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్‌ఎం సీ పరిధిలో 510 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 106, మేడ్చల్‌లో 76, వరంగల్ అర్బన్‌లో 73, కరీంనగర్‌లో 87, మహబూబ్‌నగర్‌లో 50, జగిత్యాల, మహబూబాబాద్‌లో 36, నిజామాబాద్ లో 31, నాగర్‌కర్నూల్‌లో 27, భూపాలపల్లిలో 26, నల్లగొండలో 24, మెదక్‌లో 13, జనగామ, సూర్యాపేటలో 12 చొప్పున, కొత్తగూడెం, ఆదిలాబాద్, వికారాబాద్‌లో 11 చొప్పున, సంగారెడ్డి 10, ములుగు 9, పెద్దపల్లి 8, ఆసిఫాబాద్‌లో 4, ఖమ్మం, సిద్దిపేట, గద్వాల, మంచిర్యాల జిల్లాల్లో 3 చొప్పున, వరంగల్ రూరల్, నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కో కేసు ఉన్నాయి.
(చదవండి: ఎంజీఎం ఆవరణలో అమానవీయ ఘటన)