సెంటిమెంటు కాదు.. సమస్యలు చూడండి | congress mla dk aruna slams cm kcr | Sakshi
Sakshi News home page

సెంటిమెంటు కాదు.. సమస్యలు చూడండి

Oct 7 2014 12:02 PM | Updated on Mar 18 2019 8:57 PM

సెంటిమెంటు కాదు.. సమస్యలు చూడండి - Sakshi

సెంటిమెంటు కాదు.. సమస్యలు చూడండి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మండిపడ్డారు. పండుగల సెంటిమెంటుతో కాలయాపన చేయడం కాకుండా.. ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయనకు సూచించారు. ఇంతకుముందు కేసీఆర్ ఉద్యమ నేత కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యిందని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన తన తీరు మార్చుకోవాలని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత చాలా తీవ్రంగా ఉందని, దాన్ని పరిష్కరించడానికి ఆయన ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని అన్నారు. మూడేళ్ల వరకు కరెంటు కష్టాలు తప్పవని చెబుతున్న కేసీఆర్.. మరి రైతులను ఇన్నాళ్ల పాటు ఏం చేయమంటారో కూడా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement