
'పక్కా సమాచారంతోనే వాయిస్ రికార్డ్'
'రేవంత్‌రెడ్డి ఉదంతాన్ని ఖండించకపోవడంతోనే చంద్రబాబు వైఖరీ తేటతెల్లమవుతోందని.. ఈ అంశంలో బాబు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమేనా' అని
వరంగల్: ఓటుకు నోటు వ్యవహారంలో 'రేవంత్‌రెడ్డి ఉదంతాన్ని ఖండించకపోవడంతోనే చంద్రబాబు వైఖరీ తేటతెల్లమవుతోందని.. ఈ అంశంలో బాబు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమేనా' అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం ఆయన హన్మకొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాబు కుట్రలను ఏపీ, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని.. టీ ప్రభుత్వానికి ఈ కేసుకు ఎలాంటి సంబంధంలేదని అంతా ఏసీబీ చూసుకుంటుందని అన్నారు. హైదరాబాద్ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కుట్రలు చేయోద్దన్నారు. పక్కా సమాచారంతోనే ఏసీబీ వాయిస్ రికార్డ్ చేసిందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తప్పు ఒప్పుకోవాలన్నారు.