మహబూబ్‌నగర్‌లో కొలువులకు అభ్యర్థుల కొరత | Candidates Not Attended For KGBV Posts In Mahabubnagar | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌లో కొలువులకు అభ్యర్థుల కొరత

Feb 3 2020 8:16 AM | Updated on Feb 3 2020 8:17 AM

Candidates Not Attended For KGBV Posts In Mahabubnagar - Sakshi

అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న డీఆర్వో, డీఈఓ

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం దొరకడమే గగనంగా మారిన ప్రస్తుత సమయంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కౌన్సెలింగ్‌కు పిలిస్తే 60శాతం మంది కూడా హాజరుకాలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా వివిధ కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అభ్యర్థులకు 2018లో  టీచింగ్, నాన్‌టీచింగ్‌ వారికి పరీక్ష నిర్వహించారు. అందులో మెరిట్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులకు అదే సంవత్సరం చాలా మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు.

ఈ క్రమంలో ఈ విద్యాసంవత్సరంలో కేజీబీవీల్లో ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ కళాశాలల సంఖ్య రెట్టింపు చేయడంతో సిబ్బంది నియామకాలు చేపట్టారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో చేపట్టిన కౌన్సిలింగ్‌ చాలా తక్కువ మంది అభ్యర్థులు రావడంతో శనివారం మరో సారి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. కానీ అభ్యర్తుల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. కౌన్సెలింగ్‌కు హాజరుకానీ, సమాచారం పొందలేదని అభ్యర్థులు ఉద్యోగానికి మళ్లీ వస్తారా, రారా అనే అంశంపై స్పష్టత లేదు. 

216 పోస్టులకు.. 130 మంది హాజరు  
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కేజీబీవీల్లో   ఉన్న 2016 పోస్టుల్లో సీఆరీ్ట, పీజీసీఆర్టీ పోస్టులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేజీబీవీల్లో 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు జోగులాంబ గద్వాల 32, మహబూబ్‌నగర్‌ 28, నారాయణపేట 43, రంగారెడ్డి 18, వికారాబాద్‌ 10. వనపర్తి 28 పోస్టులు ఖాళీగా ఉéన్నాయి. వీటికి కేవలం 130 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యా రు.

అయితే 2018లో పరీక్ష నిర్వహించిన అనంతరం  మెరిట్‌లో ఉన్నవారికి అప్పుడు ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. తర్వాత వీరిని కూడా మెరిట్‌ ఆధారంగా తీసుకుంటారని భావించక పోవడంతో చాలా మంది ఇతర ఉద్యోగాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. 2019లో నిర్వహించి టీఆరీ్టలో చాలా మంది అభ్యర్తులకు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలుస్తుంది. వీరితో   పాటు మరింత మంది అభ్యర్థులకు    ఫోన్‌   నెంబర్‌లు కలవకపోవడం మరో సమస్యగా మారింది.  

మిగిలిన పోస్టులకు మరోసారి కౌన్సెలింగ్‌ 
ఈ నెల 1న నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 86 పోస్టులు మిగిలి పోయాయి. వీటికి ప్రభుత్వం, కలెక్టర్లతో అనుమతి వచ్చిన వెంటనే మరోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కూడా కేవలం వారం రోజుల్లోనే జరగనున్నట్లు సమాచారం. మరోసారి కౌన్సెలింగ్‌ మెరిట్‌ లిస్టులో ఉన్న అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు వస్తే వారికి మిగిలిన చివరికి మిగిలన చోటే పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులు ఈనెల 4న నియామక ఉత్తర్వులు అందజేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఇక వీటితో పాటు ఏఎన్‌ఎం, స్పెషల్‌ ఆఫీసర్ల వంటి 18 పోస్టులు కూడా త్వరలోనే మండల స్థాయి కమిటీల ద్వారా భర్తీ చేయనున్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement