
సన్మానిస్తున్న విద్యార్థులు
నిర్మల్‌రూరల్ : జిల్లా కేంద్రంలోని వాసవీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఇటీవలే వేసవి సెలవుల్లో దేశవ్యాప్త సైకిల్ యాత్రను పూర్తి చేసిన ఉపాధ్యాయుడిని స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు బుధవారం ఘనంగా సన్మానించారు. పాఠశాలకు చెందిన సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు భరత్‌కుమార్ వేసవి సెలవుల్లో నిర్మల్ నుంచి బయలుదేరి ఉత్తర భారతదేశంలోని జమ్ము, గుజరాత్ తదితర రాష్ట్రాలను చుట్టి వచ్చారు.
ఈ సందర్భంగా తన యాత్ర సందర్భంగా జరిగిన అనుభవాలను ఉపాధ్యాయుడు విద్యార్థులకు వివరించారు. సైకిల్ యాత్రతో ఆరోగ్యంతో పాటు జాతీయ సమైక్యతను తెలుసుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రకాల ఆచార సంప్రదాయాలను అవగతం చేసుకోవచ్చని తెలిపారు. పాఠశాల సెక్రెటరీ జగదీశ్‌రెడ్డి, కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్ రాజేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.