‘విద్యుత్‌ సంస్థల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి’

BCs should be given priority in power companies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ సంస్థల సాధారణ బదిలీల్లో బీసీ ఉద్యోగులను ప్రాధాన్యతా స్థానాల్లో నియమించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం కృష్ణయ్య నేతృత్వంలో విద్యుత్‌ బీసీ సంక్షేమ సంఘం నాయకులు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు.

ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో సీఎండీ, డైరెక్టర్‌ స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ తీసుకుని బీసీలను సీఎండీలుగా, డైరెక్టర్‌లుగా నియమించాలని కోరారు. ఆర్‌.కృష్ణయ్య వెంట విద్యుత్‌ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుమారస్వామి, వెంకన్నగౌడ్, యాదగిరి, చంద్రుడు, గుజ్జ కృష్ణ తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top