న్యూస్‌ రీడర్లకు భాషతో పాటు సమయస్ఫూర్తి ముఖ్యం

Awards To Anchors , News Readers - Sakshi

వివేక్‌నగర్‌ : టీవీలో వార్తలు చదివేవారికి స్పష్టమైన ఉచ్ఛారణతోపాటు భాష మీద పట్టు, సమయస్ఫూర్తి ముఖ్యమని వక్తలు అన్నారు. లలిత కళా స్రవంతి ఈవీ రాజయ్య అండ్‌ సన్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభలో టీవీ న్యూస్‌ రీడర్లు, యాంకర్లకు  అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యదర్శి డి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల మానసిక ప్రశాంతతతోపాటు స్నేహ సంబంధాలు బలపడతాయన్నారు.

అవార్డులు ప్రతిభకు గుర్తింపు మాత్రమేనని అవి మరింత ప్రోత్సాహాన్నిస్తాయన్నారు. సాక్షి టీవీ న్యూస్‌ రీడర్‌ అనుశ్రీతోపాటు పలువురిని సత్కరించారు. సభలో జి.అన్నప దీక్షితులు, జి.సుజయ బాల, ఇ.విశ్వేశ్వరరావు, ఇ.శైలజ, ఎ.మహేష్‌బాబు, యం.రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ఎన్‌.రమాదేవి విష్య బృందం భరత నాట్య ప్రదర్శన ఇచ్చింది.వరంగల్‌ కు చెందిన యు.లక్ష్మణాచారి శిష్య బృందం అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top