ప్రజా ఆమోదయోగ్య నిర్ణయం | Acceptable to the public | Sakshi
Sakshi News home page

ప్రజా ఆమోదయోగ్య నిర్ణయం

May 31 2015 1:21 AM | Updated on Mar 18 2019 9:02 PM

ప్రజా ఆమోదయోగ్య నిర్ణయం - Sakshi

ప్రజా ఆమోదయోగ్య నిర్ణయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ తెలంగాణ....

ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్సార్ సీపీ
తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి వెల్లడి

 
మణుగూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మణుగూరులో శనివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థారుు ముఖ్య కార్యకర్తల ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తమకు టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సమాంతర దూరంలోనే ఉంటాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మీద అవిశ్వాసం పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ అధికార పార్టీకి కొమ్ముకాసిందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడిన విషయూన్ని తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోవాలన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలో ప్రజా పరిపాలన దక్షత కలిగిన వారికే ఓటేస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనాలా? వద్దా? అనే నిర్ణయంపై నేడు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో చర్చిస్తామన్నారు. ఆయన నిర్ణయూనికి కట్టుబడి ఉంటామన్నారు. తాము ఎవరికి మద్దతు ఇవ్వాలో.. ఓటింగ్‌లో పాల్గొనాలా? వద్దా? అనే విషయూన్ని  కూడా  ఆదివారం ప్రకటిస్తామన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement