ఆదివారాలూ ఆధార్ సేవలు

మాదాపూర్‌లో ప్రత్యేక కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డులో మార్పుల కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆఫ్‌లైన్‌లో నిరంతర సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూఐడీఏఐ ఆధ్వర్యంలో నగరంలోని మాదాపూర్‌లో ప్రత్యేక కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కేంద్రం ఆదివారం కూడా పనిచేస్తుంది.
భారత ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేసే ఈ కేంద్రాన్ని మాదాపూర్ విఠల్‌రావునగర్‌లోని రిలయన్స్ సైబర్‌విల్లే ప్లాట్ నంబర్ 17–24 లలో ప్రారంభించారు. యూఐడీఏఐ వెబ్‌సైట్ uidai.gov.in ద్వారా ప్రజలు ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకొని ఈ కేంద్రంలో తమకు కావాల్సిన సేవలను పొందవచ్చని ఆధార్ రాష్ట్ర డిప్యుటీ సెక్రటరీ గడ్డం వేణుగోపాలరెడ్డి తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి