రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి హైటెన్షన్ వైర్ల పైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఖమ్మం: రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి హైటెన్షన్ వైర్ల పైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని మధిర రైల్వేస్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. కాగా, క్షతగాత్రడు శ్రీకాకుళం జిల్లా రేగడికి చెందిన వెంకటరమణగా రైల్వే పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.