breaking news
Railway foot over bridge
-
ఇదేందయ్యా ఇదీ.. మొన్న 90 డిగ్రీల బ్రిడ్జి.. నేడు పాము మెలికల వంతెన
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వంతెనల నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఓ రైల్వే వంతెన చర్చనీయాంశం కాగా.. తాజాగా మరో వంతెన తెరపైకి వచ్చింది. భోపాల్‌లోనే పాములా మెలికలు తిరిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. సదరు వంతెనపై ప్రయాణాల కారణంగా ఎనిమిది గంటల సమయంలోనే రెండు ప్రమాదాలు జరగడంతో.. వంతెన నిర్మించిన ఇంజినీర్, బీజేపీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు వాహనదారులు.వివరాల ప్రకారం.. భోపాల్‌లోని సుభాష్‌నగర్‌లో రూ.40 కోట్లతో ఒక వంతెన నిర్మించారు. ఈ వంతెనను పాములా మెలికలు తిరిగినట్టు నిర్మించడం గమనార్హం. భోపాల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ఈ వంతెన మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ వంతెన వల్ల సుభాష్ నగర్ ప్రాంతంలో రద్దీ తగ్గినప్పటికీ దాని నిర్మాణం పలుచోట్ల మెలికలు తిరిగి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వంతెనపైకి ఎక్కిన కొన్ని సెకన్లలోనే పలుమార్లు మలుపులు తీసుకోవాల్సి వస్తుందని స్థానికులు పేర్కొన్నారు. దీనివల్ల రాత్రి సమయాల్లో, అధిక వేగంతో ప్రయాణించే వాహనదారులు మలుపుల వద్ద నియంత్రణ కోల్పోయి.. ప్రమాదాల బారినపడుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.A speeding car lost control and overturned on the Subhash Nagar Bridge in Bhopal, leaving two passengers injured.The vehicle hit the divider with such force that its front tyres detached.A live video of the dramatic accident has surfaced, highlighting the dangers of reckless… pic.twitter.com/jd1tnuBiD9— The Sentinel (@Sentinel_Assam) July 2, 2025ఇక, ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి గాలిలో పల్టీలు కొట్టింది. మరోసారి ఓ స్కూల్ వ్యాన్ డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులోని విద్యార్థులకు గాయాలయ్యాయన్నారు. దీంతో, వంతెన నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని ప్రమాదాలు జరగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకొని.. మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు ప్రభుత్వాన్ని కోరారు. వంతెనలు ఇలా నిర్మించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రాజధాని భోపాల్‌లో ఐష్బాగ్ వద్ద రూ.18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు. అయితే, అది 90 డిగ్రీల మలుపు కలిగి ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్‌ను సమర్థించుకుంది. సమీపంలో మెట్రో రైల్ స్టేషన్, భూమి కొరత దృష్ట్యా ఇలా నిర్మించడం తప్పితే మరో మార్గం లేదని వివరణ ఇచ్చింది. ఇలాంటి డిజైన్లను రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు విధించింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజినీర్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. #WATCH | Madhya Pradesh | A newly-built bridge constructed in Bhopal's Aishbagh features a 90-degree turn pic.twitter.com/M1xrJxR45e— ANI (@ANI) June 12, 2025 -
భారీ శబ్ధంతో కూలిన రైల్వే వంతెన.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ పురాతన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మధ్యలో కొంత భాగం కుప్పకూలింది. దీంతో వంతెనపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడ్డారు. కొందరు ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వివరాల ప్రకారం.. చంద్రాపూర్‌లోని బల్లార్ష రైల్వే స్టేషన్లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి మధ్య భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో బ్రిడ్జిపై ఉన్న ప్రయాణికులు కింద ఉన్న రైల్వే పట్టాలపై పడిపోయారు. దీంతో, వారందరూ గాయపడ్డారు. వంతెన కూలిపోయిన సందర్భంగా పెద్దశబ్ధం రావడంతో ప్లాట్‌ఫ్లామ్‌పైన ఉన్న ప్రయాణికులందరూ భయంతో పరుగుతీశారు. కాగా, ఈ ఘటనలో 20 గాయపడినట్టు సమాచారం. 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
రైల్వే హైటెన్షన్ వైర్లపై దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం: రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి హైటెన్షన్ వైర్ల పైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని మధిర రైల్వేస్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. కాగా, క్షతగాత్రడు శ్రీకాకుళం జిల్లా రేగడికి చెందిన వెంకటరమణగా రైల్వే పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.