ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఇరవైచింతల గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది.
ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఇరవైచింతల గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. గురువారం వేకువజామున నుంచి కనపడిన వారినంతా తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలు అయ్యాయి. మరో 4 గేదెలను కూడా కరిచింది. స్థానికులు పిచ్చికుక్కను పట్టుకుని చంపేశారు. గాయపడిన వారికి ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.