అటవీ ప్రాంతంలో నలుగురు మిలిషియా సభ్యులు అరెస్ట్ | 4 militia members held in khamman district | Sakshi
Sakshi News home page

అటవీ ప్రాంతంలో నలుగురు మిలిషియా సభ్యులు అరెస్ట్

May 4 2015 11:37 AM | Updated on Sep 3 2017 1:25 AM

అటవీ ప్రాంతంలో నలుగురు మిలిషియా సభ్యులు అరెస్ట్

అటవీ ప్రాంతంలో నలుగురు మిలిషియా సభ్యులు అరెస్ట్

చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో నలుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులతో పాటు ఒక దళ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఖమ్మం(చర్ల): చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో నలుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులతో పాటు ఒక దళ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చెన్నాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసుల్ని చూసి పారిపోతుండగా వీరిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిని విచారించగా తాము మిలిషియా సభ్యులమని ఒప్పుకున్నారు.


పట్టుబడిన వారు: చెన్నాపురం గ్రామానికి చెందిన మరకం గంగ, మడివి మూడ, బక్కచింతలపాడు గ్రామానికి చెందిన బాడిక ఉంగయ్య, మడివి ఇలమయ్య లుగా నిర్ధారించగా..దళ మెంబర్ గోరుకొండ గ్రామానికి చెందిన మడవి రాములయ్యగా గుర్తించారు .

Advertisement
 
Advertisement
Advertisement