breaking news
-
సీఎంపై నిరాధార ఆరోపణలు
సాక్షి, యాదాద్రి/సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వ్యవసాయ మా ర్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమృత్ స్కీం టెండర్లలో రూ.8,888 వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించా రు. కేటీఆర్‌కు దమ్ముంటే, ఆరోపణలు రుజువు చేస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారతుండడంతో అసహనానికి లోనై సీఎం రేవంత్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే.. ‘ఖబడ్దార్ కేటీఆర్’అని కోమటిరెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు పార్టీ వదిలిపెట్టి పోతుండడంతో దిక్కుతోచని స్థితిలో కేటీఆర్ మాట్లాడుతున్నాడన్నారు. కేటీఆర్ పదేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసి రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశాడని అందులో రూ.2 లక్షల కోట్లు ఆయనకు టుంబమే దోచుకుందని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ చచ్చిపోతోందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. దోపిడీ దొంగలకు అలాగే కనిపిస్తుంది హైదరాబాద్‌లో ఆదివారం సీఎల్పీ సమావేశం అనంతరం కూడా ఈ అంశంపై కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు లాంటి దోపిడీ దొంగలకు తమ ప్రభుత్వం కూడా అవినీతి చేసినట్లుగా కనిపిస్తుందేమోనని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులలో కేటీఆర్ వేలకోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు. సింగరేణి సంస్థలో కవిత ఏం చేసిందో త్వరలో బయటకు వస్తుందని అన్నారు. వారి దోపిడీ ప్రజలకు అర్థమైంది కనుకనే గత ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి 4,500 ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు తేలింది. వాటిల్లో కాంగ్రెస్‌కు చెందిన 190 మంది ఫోన్లు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వారిలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు సోదరులు, మిత్రులు, అనుచరులు సైతం ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్‌లో 80 శాతానికిపైగా ఎయిర్టెల్ కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్ డేటాను ధ్వంసం చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. మరోవైపు ఫోన్ టాపింగ్ వ్యవహారం దర్యాప్తులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మీడియా ఛానెల్ నిర్వాహకుడు అరువెల శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సీబీఐ అనుమతిచ్చింది. రెడ్ కార్నర్ నోటీసు కోసం హైదరాబాద్ పోలీసులు పంపిన నివేదికను సమ్మతించిన సీబీఐ.. ఇంటర్ పోల్‌కు లేఖ రాసింది.చదవండి : మీ పాలనకో దణ్ణం చంద్రబాబు -
సీఎల్పీ భేటీకి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పీఏసీ చైర్మన్‌గాంధీ, వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే లు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు హోటల్‌కు వచ్చారు.సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతోంది.లోకల్ బాడీ ఎన్నికలు,పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం,పార్టీ సభ్యత్వం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదీ చదవండి.. జమిలి ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర -
‘పొన్నం’కు అవగాహన లేదు: హరీశ్‌రావు
సాక్షి,సిద్దిపేటజిల్లా: తనను విమర్శించే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహనారాహిత్యం బయటపడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టుపై పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం వృథా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించిందని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. కాగా, శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ హరీశ్‌రావుపై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. దీనికి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఇదీ చదవండి.. హరీశ్హార్డ్వర్కర్.. మాకు సలహాలివ్వొచ్చు: పొన్నం ప్రభాకర్ -
పొంగులేటి సవాల్ స్వీకరించిన కేటీఆర్.. సీఎం కుర్చీకి ఎసరు అంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి సవాల్‌ను కేటీఆర్ స్వీకరించారు. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదాం రావాలంటూ ప్రతి సవాల్ విసిరారు. దీంతో, రాష్ట్రంలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి సవాల్‌ను స్వీకరిస్తున్నాను. చిత్తశుద్ధి ఉంటే రండి.. హైకోర్టు సీజే దగ్గరకు పోదాం. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదాం. అక్రమాలు జరగలేదని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. లేదంటే సెంట్రల్ కమిషనర్ దగ్గరకు పోదాం. రేవంత్ ముఖ్యమంత్రి పదవి ఊడగొట్టాలన్న ఆలోచన ఉన్నట్టుంది. రాజీనామా చేస్తానని పొంగులేటి ప్రగల్భాలు చేస్తున్నాడు. అమృత్ టెండర్లు రద్దు చేసి సిగ్గు తెచ్చుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీకు చిత్తశుద్ధి ఉంటే రండి.. హైకోర్టు సీజే దగ్గరకు పోదాం. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదాం.- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/Dzl4ZsziiD— BRS Party (@BRSparty) September 22, 2024 కేటీఆర్ ఆరోపణలపై అంతకుముందు మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం. నిరూపించలేకపోతే కేటీఆర్ రాజీనామా చేస్తారా? ఈ ప్రభుత్వం కేవలం రూ.3,516 కోట్ల పనులకే టెండర్లు పిలిచింది. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పేరు మీద రూ.39వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారు. ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలి. ఖమ్మంలో నాపై పోటీ చేసిన ఉపేందర్‌రెడ్డి అల్లుడు సృజన్‌రెడ్డి ఒకటి దక్కించుకున్నారు. టెండర్లు వేయొద్దని ఏ కంపెనీని కూడా ప్రభుత్వంలోని పెద్దలు బెదిరించలేదు. మేం పిలిచిన రీ టెండర్లలో గతంకంటే రూ.54 కోట్లు తక్కువకే బిడ్లు వచ్చాయి అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో పోలింగ్ తేదీకి ఒక్కరోజు ముందే గత ప్రభుత్వం ఈ టెండర్లను కట్టబెట్టిందని గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: కూకట్‌పల్లిలో హైడ్రా.. బీఆర్ఎస్ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత -
రూ.8,888 కోట్ల ‘అమృత్’ పనుల్లో అవినీతి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కథాచిత్రం నడుస్తోందని..అనేక కుంభకోణాలకు ఆయన కుటుంబసభ్యులే కేంద్రంగా ఉంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం ‘అమృత్’పథకం కింద రాష్ట్రానికి మంజూరు చేసిన రూ.8,888 కోట్ల పనుల్లో చోటుచేసుకున్న అవినీతే దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి బావమరిది సూదిని సృజన్‌రెడ్డికి చెందిన శోధ కన్స్ట్రక్షన్ కంపెనీకి అర్హత, నైపుణ్యం, అనుభవం, ఆర్థిక వనరులు లేకున్నా టెండర్లు కట్టబెట్టారన్నారు.ఈ అంశంపై సీఎం స్పందించాలని, అమృత్‌లో అవినీతి చోటుచేసుకుంటున్నా, బీజేపీ నాయకులు స్పందించని పక్షంలో కుమ్మక్కు అయినట్టు భావించాల్సి ఉంటుందన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, గోపీనాథ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి తెలంగాణభవన్‌లో శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... మూడు నెలల్లోనే భారీ అవినీతి ‘అధికారంలోకి వచి్చన మూడునెలల్లోనే రూ.8,888 కోట్ల భారీ అవినీతికి రేవంత్ తెర లేపారు. సీఎం పదవితోపాటు పురపాలకశాఖ బాధ్యతలు చూస్తు న్న రేవంత్ తన పదవిని దురి్వనియోగం చేశారు. ఇది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 11, 13 కింద సీఎంను ప్రాసిక్యూట్ చేయొచ్చు. గతంలో పదవీ దుర్వినియోగం ఆరోపణలపై ఎంపీగా సోని యాగాం«దీ, కర్ణాటకలో యెడియూరప్ప, మహా రాష్ట్రలో అశోక్‌చవాన్ ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేశారు.ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని బెదిరించి రూ.2 కోట్ల లాభంలో ఉన్న రేవంత్ బావమరిది కంపెనీకి జాయింట్ వెంచర్ పేరిట టెండర్లు కట్టబెట్టారు. రూ.1,137 కోట్ల కాంట్రాక్టు పనుల్లో ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ వాటా కేవలం 20 శాతం మాత్రమే. శిఖండి సంస్థను అడ్డుపెట్టుకొని సీఎం బావమరిది సృజన్‌రెడ్డి ప్రజాధనం కొల్లగొడుతున్నారు. సీఎం స్వయంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టులు కట్టబెట్టారు. టెండర్లపై పూర్తిగా గోప్యత ఇండియన్ హ్యూమన్ పైప్ కంపెనీకి టెండర్లు దక్కిన అంశానికి సంబంధించిన జీవోలను వెబ్సైట్లో పెట్టలేదు. ఈ టెండర్లలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు లేఖ రాశాం. కేంద్ర నిధులు పక్కదారి పడుతున్నా బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు. అమృత్‌లో అవినీతిపై విచారణకు ఆదేశించని పక్షంలో ఈ అవినీతిలో బీజేపీ నేతలు సంబంధం ఉందని భావించాల్సి వస్తుంది. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు సీఎం రేవంత్ సుద్దపూస అని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి చేస్తున్న అవి నీతిని ధారావాహికంగా బయట పెడతామని’ కేటీఆర్ అన్నారు. -
కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు.కేటీఆర్ చెప్పినట్లు అమృత్ స్కీమ్ కింద టెండర్లు అయినట్లు నిరూపిస్తే తాను మంత్రిగా రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు.సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఈ విషయమై శనివారం(సెప్టెంబర్21) పొంగులేటి మీడియాతో మాట్లాడారు.ఆరోపణలను నిరూపించకపోతే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చెప్పాలన్నారు.రూ.3వేల6వందల కోట్లు కాస్తా రూ.8888 కోట్లు ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అమృత్ టెండర్లను గత ప్రభుత్వమే వాళ్లు దిగిపోయే సమయంలో 3 ప్యాకేజీల కింద ఇచ్చారని చెప్పారు.ఇదీ చదవండి.. సీఎం రేవంత్ ప్రమేయంతోనే అమృత్ టెండర్లలో అవినీతి: కేటీఆర్ -
అధికారులు మాట వినడం లేదట!.. టీపీసీసీ చీఫ్‌కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అధికారులు తమ మాట వినడం లేదంటూ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్నామో.. ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల వ్యవహారాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు మహేష్‌గౌడ్ అప్పగించారు. కాగా, రేపు సాయంత్రం 4 గంటలకు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మాదాపూర్ రాడియంట్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.మరోవైపు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపడుతోంది. పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో శనివారం నుంచి జిల్లా స్థాయి సమీక్షలు ప్రారంభమయ్యాయి.ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలుజిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల స్థితిగతులు, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తీరు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ అంశాల ప్రాతిపదికగా ఈ సమీక్షలు జరుగుతాయని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో పార్టీ అన్ని స్థాయిల నాయకులు పాల్గొననున్నారు. -
27న సిద్దిపేటలో బీఆర్ఎస్ రైతుధర్నా
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో రైతన్నకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ రైతు ధర్నాకు పిలుపునిచ్చింది.రుణమాఫీ,రైతు బంధు,పంట బోనస్ కోసం రైతుధర్నా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయనుంది.సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం నాడు సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికగా రైతు ధర్నా నిర్వహించనున్నట్లు మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు.రైతు ధర్నాకు పెద్ద ఎత్తున కదిలి రావాలని రైతన్నలకు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టబోమని చ్చరించారు.రైతు ధర్నాపై హరీశ్‌రావు శనివారం(సెప్టెంబర్21) రైతులు,పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదీ చదవండి.. హరీశ్ హార్డ్‌వర్కర్..సలహాలివ్వొచ్చు: మంత్రి పొన్నం -
‘సీఎం రేవంత్ ప్రమేయంతోనే ఆ టెండర్లు.. అక్రమాల నిగ్గు తేల్చాలి’
సాక్షి, హైదరాబాద్: అమృత టెండర్లలో అక్రమాలపై నిగ్గు తేల్చాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమృత్ టెండర్లలో సీఎం కుటుంబీకులు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం బావమరిది కంపెనీకి ఎలాంటి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన రూ.1,137 కోట్ల పనులు దక్కించుకున్నారన్నారు.ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని రంగంలోకి దించి రేవంత్ కుటుంబం తాగునీటి సరఫరా పనులను దక్కించుకుంది. అమృత టెండర్లపై తక్షణం విచారణ జరిపితే అన్ని నిజాల బయటపడతాయి. ముఖ్యమంత్రి ప్రమేయంతోనే టెండర్లు జరిగాయి. తక్షణం అమృత్ పథకం టెండర్లను నిలిపివేయాలి’’ కేటీఆర్ డిమాండ్ చేశారు. -
హరీష్ హార్డ్ వర్కర్.. మాకు సలహాలు ఇవొచ్చు: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మల్లన్న సాగర్‌కు వచ్చిన నీళ్లు కాళేశ్వరం వాటరా? లేక ఎల్లంపల్లి నీళ్లా? అనేది హరీష్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఇరిగేషన్ మాజీ మంత్రిగా హరీష్.. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వొచ్చు అంటూ కామెంట్స్ చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే హరీష్ రావు హార్డ్ వర్కర్, ఆయనకు కష్టపడేతత్వం ఉంది. అబద్దాలతో ప్రజలను మేనేజ్ చేస్తామంటే కుదరదు. రాజకీయం చేయడం మా ప్రాధాన్యత కాదు. రైతులకు నీళ్లు ఇవ్వడమే మాకు ముఖ్యం. హరీష్ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి. మలన్నసాగర్‌కు వచ్చిన నీళ్లు ఎక్కడివి?. ప్రభుత్వం తరఫున హరీష్ రావును అడుగుతున్నాను. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి. కాళేశ్వరం నీళ్లా? ఎల్లంపల్లి వాటరా?.బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని మేనేజ్ చేసేందుకు హరీష్ ప్రయత్నం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రిగా ప్రభుత్వానికి ఆయన సలహాలు ఇవ్వొచ్చు. సూచనలు కూడా చేయవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే పూర్తి అయ్యింది. ఎల్లంపల్లి ప్రారంభోత్సవానికి వస్తానని కిరణ్ కుమార్ రెడ్డి అంటే.. హెలికాప్టర్ పేల్చేస్తానని చెప్పాను. ఇంజనీర్ కాని ఇంజనీర్ కేసీఆర్ నిర్వాకం వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనిరాకుండా పోయింది. కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ధ్వంసానికి కుట్ర జరిగిందని ఆనాటి అధికారులు చెప్పారు. కేసీఆర్ పాలనలోనే కాళేశ్వరం కుంగిపోయి నిష్ప్రయోజనంగా మారింది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం? -
జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబలించాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏచూరి లేకపోవడం తీరని లోటు. ఏచూరి చూపిన మార్గంలో జమిలి ఎన్నికలను అడ్డుకుంటాం.. పోరాడతాం అని అన్నారాయన. జమిలి ఎన్నికలతో అధికారం కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ మార్పులు, సవరణల విషయంలో ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. దేశ ఐక్యతను బీజేపీ దెబ్బ తీయాలని చూస్తోంది. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలి’’ అని రేవంత్ పిలుపుచ్చారు. ‘‘దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తికి సీతారాం ఏచూరి కృషి చేశారు. పేదల కోసం పాటు పడ్డారు. జీవితకాలం నమ్మిన సిద్దాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తులు అరుదు. రాహుల్‌గాంధీతో సీతారాం ఏచూరికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. దశబ్దాలపాటు పేదల సమస్యలపై సీతారాం ఏచూరి కృషి చేశారు’’ అని రేవంత్ గుర్తు చేశారు. అంతకు ముందు.. సీతారాం ఏచూరి చిత్రపటానికి కేటీఆర్, తమ్మినేని నివాళులర్పించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసి సీతారాం ఏచూరి చిరస్థాయిగా నిలిచారు. ప్రస్తుతం నేతలు పదవుల చుట్టూ పరిభ్రమిస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు సీతారాం ఏచూరి నిలబడ్డారు అన్నారు. రేవంత్ రాకముందే కేటీఆర్ ఎగ్జిట్ఒకేవేదికపై రేవంత్, కేటీఆర్ ఉంటారని తొలుత చర్చ నడిచింది. అయితే సభ ప్రారంభ సమయంలోనే కేటీఆర్ మాట్లాడి వెళ్లిపోయారు. కేటీఆర్ వెళ్లిపోయాకే సభకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అంతకు ముందు.. కోదండరాం పక్కనే కూర్చున్న కేటీఆర్ మాట కూడా మాట్లడలేదు. కేటీఆర్ తన ప్రసంగం ముగిశాక.. అప్పుడు కోదండరాం పలకరించారు. -
‘హరీష్ నామినేషన్ ఏమైంది?’.. పీఏసీ భేటీలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన పీఏసీ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలతో గందరగోళం నెలకొంది. అనంతరం, బీఆర్ఎస్ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.కాగా, పీఏసీ చైర్మన్ గాంధీ అధ్యక్షతన నేడు మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీ కృష్ణ, ఎంఐఎం నుంచి బలాల, బీజేపీ నుంచి రామరావు పవార్, బీఆర్ఎస్ నుంచి పశ్రాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, భాను ప్రసాద్ రావు, సత్యవతి రాథోడ్, ఎల్ రమణ హాజరయ్యారు.ఈ సమావేశం సందర్భంగా పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీని ఎలా నియమిస్తారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ అన్నారు. అలాగే, పీఏసీకి ఎన్ని నామినేషన్లను వచ్చాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనంతరం, సమావేశం నుంచి వాకౌట్ చేశారు.అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘మా ప్రశ్నలకు పీఏసీలో ఎటువంటి సమాధానం చెప్పడం లేదు.. అందుకే వాకౌట్ చేశాం. స్పీకర్ స్పందించడం లేదు.. అన్ని శ్రీధర్ బాబే మాట్లాడుతున్నాడు. వాళ్ల తప్పుడు పనులు మేము బయటపెడతామని భయపడుతున్నారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉంటే మా ఎల్పీ ఆఫీసుకు ఎందుకు రావడం లేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తికి పీఏసీ చైర్మన్ ఇచ్చారు.గాంధీకి మా పార్టీ నుంచి నామినేషన్ ఇవ్వలేదు. హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైంది. గాంధీ నామినేషన్ ఎలా వచ్చింది. ఆయన ఎంపిక ఎలక్షన్ ప్రకారం జరిగిందా.. సెలక్షన్ ప్రకారం జరిగిందా అనేది మాకు తెలియాలి. పీఏసీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైనది. ప్రతీ రూపాయిని ప్రజల పక్షాన పీఏసీ ఆడిట్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మా సభ్యుల సంఖ్య ప్రకారం ఐదుగురి పేర్లు ఇవ్వమన్నారు. ఐదుగురి పేర్లు ఇచ్చాం. కానీ, అందులో గాంధీ పేరు లేదు. అయినప్పటికీ గాంధీకి ఎలా పదవి ఇచ్చారు.2014లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా లేదు.. అయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. పార్లమెంట్ పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌ను చేశారు. రాహుల్ గాంధీ సూచన మేరకే ఇది జరిగింది. 2014లో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కే పీఏసీ పదవి ఇచ్చాం. 2018లో కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంఐఎంకు ఉన్నారు. 2018లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎంఐఎం కాబట్టి అక్బరుద్దీన్‌కు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చాం. 2018లో పీఏసీ చైర్మన్ శ్రీధర్ బాబు అడిగారనేది అవాస్తవం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ..‘నామినేషన్ వేయకుండానే గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారనేది మా వాదన. ఎజెండా ఏంటో ఇంకా చూడలేదు.. ఆలోపే వాకౌట్ చేశాం. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అసెంబ్లీ సెక్రటరీ నిర్ణయం తీసుకోవాలి. మొదట పార్టీ మారిన ముగ్గురిపై కేసు వేశాం. మిగతా వారిని ఇంప్లీడ్ చేస్తాం. స్పీకర్ తీర్పును న్యాయ సమీక్ష చేస్తామని హైకోర్టు చెప్పింది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ కుటుంబీకుల భారీ అవినీతి: కేటీఆర్ -
‘అమృత్ టెండర్లలో రేవంత్ కుటుంబీకుల భారీ అవినీతి’: KTR
హైదరాబాద్, సాక్షి: అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబీకులు భారీ అవినీతిని పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ నిన్న(శుక్రవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.‘‘ఈరోజు అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ ఎలాంటి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన రూ. 1137 కోట్ల పనుల దక్కించుకున్న పత్రాలు ఇవిగో.ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని రంగంలోకి దించి టెండర్లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను దక్కించుకున్న రేవంత్ రెడ్డి కుటుంబం. ఆ తర్వాత ఇదే కంపెనీతో తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ. ఇదే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు అప్పజెప్తుంది.ప్రజలకు అందుబాటులో ఉంచకుండా చీకటి వ్యవహారాన్ని నడుపుతుంది.అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన టెండర్ల పైన పూర్తిస్థాయి విచారణ జరిపి, టెండర్లు దక్కించుకున్న ప్రతి కంపెనీ వివరాలను బయటపెట్టాలి. 9 నెలలుగా రాష్ట్ర లోని అవినీతి పూరిత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రతి టెండర్ పైన విచారణ జరిపి సమీక్ష చేసి అక్రమాలు జరిగిన ప్రతి టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి టెండర్ల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.SCAM Alert - AMRUT Tenders I wrote a letter to Union Ministers Shri Manohar Lal Khattar Ji (@mlkhattar) and Shri Tokhan Sahu Ji (@tokhansahu_bjp) regarding corruption in AMRUT tendersContracts were awarded to Chief Minister Revanth Reddy's Brother-in-law, Srujan Reddy’s… pic.twitter.com/pqgz7aLBGR— KTR (@KTRBRS) September 21, 2024చదవండి: కోకాపేటపై హైడ్రా ఫోకస్.. కూల్చివేతలు షురూ -
చవకబారు విమర్శలు మానుకో కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ దవాఖానాలు, ఆరోగ్య వ్యవస్థపై చవకబారు విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి హెచ్చరించారు. ఈహెచ్ఎస్పై కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మంత్రి ఘాటుగా స్పందించారు. ఆరోగ్యశ్రీ, ఈహె చ్ఎస్, జేహెచ్ఎస్ స్కీమ్‌లను పదేళ్లు భ్రష్టు పట్టించి, ఇప్పుడు నీతులు చెబుతారా అంటూ మంత్రి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల, పేదలకు, ఉద్యోగులకు ఆ స్కీమ్ సేవలు అందకుండా పో యాయన్నారు.ఈహెచ్ఎస్ కింద ట్రీట్మెంట్ కోసం పోయిన ఉద్యోగులు, పెన్షనర్లను కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు అవమానిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు చోద్యం చూశారని విమర్శించారు. ‘‘మా వేతనాల్లో నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తాం, స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఉద్యోగు లు, పెన్షనర్లు కోరినా పట్టించుకోలేదు. పదేళ్లు మోసం చేసింది చాలదన్నట్టు, ఎన్ని కల ముందు హడావుడిగా డమ్మీ జీవో ఇచ్చి మరోసారి ఉద్యోగులను మోసం చేసే కుట్రలు చేశారు.మీ కుట్రలు, కుతంత్రాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు ఉద్యోగులు. ఇకనైనా ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాల’’ని మంత్రి హెచ్చరించారు. ‘‘మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయిన ప్యాకేజీల రివిజన్‌ను 6 నెలల్లోనే చేసి చూపించాం. కొత్తగా 163 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం’ అని మంత్రి దామోదర తన ట్వీట్లో పేర్కొన్నారు. -
అలైన్మెంట్ మార్పు వెనుక అరాచకం: మాజీ మంత్రి వేముల
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగంలో అలైన్మెంట్ మార్పుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూ దందాలకు తెరలేపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల సొంత లాభం కోసం అలైన్మెంట్ మార్చు తూ పేదల భూముల నుంచి రోడ్డును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలైన్మెంట్ మా ర్పు వెనకాల దందాలు, అరాచకాలు ఎవరి కోసం జరుగుతున్నాయో ప్రభుత్వం చెప్పాలన్నా రు.అలైన్మెంట్ మార్పుపై ప్రజలకు ఉన్న అనుమానాలను సీఎం రేవంత్ నివృత్తి చేయాలన్నా రు. పార్టీ నేతలు శుభప్రద్ పటేల్, కిషోర్, రాకేశ్‌కుమార్ తదితరులతో కలసి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రీజనల్ రింగు రోడ్డు ఉత్తరభాగం అలైన్మెంట్ ఇప్పటికే అమోదం పొందగా, గతంలోనే ఖరారు చేసిన దక్షిణ భాగం అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం లభించాల్సి ఉందన్నారు. నాలుగు చోట్ల అలైన్మెంట్ మార్పు ఫోర్త్‌సిటీ సౌలభ్యం పేరిట సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డులో 4 కిలోమీటర్లు మార్చడంతో పాత, కొత్త అలైన్మెంట్ల మధ్య 10 నుంచి 12 కిలోమీటర్లకు దూరం పెరిగిందని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఆమన్‌గల్ మండలం కుందారంలో పేదలు సా గు చేసుకుంటున్న 400 ఎకరాల భూమిని రాజవంశీయులతో బేరం చేసుకుని కాంగ్రెస్ నేతలు ‘బిగ్ బ్రదర్స్’అండతో లాక్కుంటున్నారని ఆరోపించారు. మాడుగులలో సీఎం బంధువుల భూ ముల్లో ఏం జరుగుతుందో చెప్పాలని, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు లబ్ధి జరిగేలా అలైన్మెంట్ మా రిందన్నారు. బిగ్ బ్రదర్స్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతలకు మేలు చేసేలా చేవెళ్ల మా ర్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి 5 కిలోమీటర్లు జరిపి మన్నెగూడ క్రాస్ రోడ్‌కు అలైన్మెంట్ మా ర్చారన్నారు. -
కడియం శ్రీహరికి బుద్ధి చెప్తాం: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రానున్న ఉప ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య శుక్రవారం(సెప్టెంబర్2) కేటీఆర్‌తో హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నియోజకవర్గం పార్టీలో మరింత ఉత్సాహం నింపేలా సంస్థాగతంగా మరింత బలంగా తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల కేసులో ఇటీవలే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నెల రోజుల్లో ఈ విషయంలో చర్యలు మొదలు పెట్టాలని విచారణ స్టేటస్ రిపోర్టును తమకు నివేదించాలని స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. లేదంటే సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటట్రావు, దానం నాగేందర్లపై బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఇదీ చదవండి.. రెండు నాలుకల కాంగ్రెస్.. ఇది ముమ్మాటికి మోసమే: కేటీఆర్ -
రెండు నాలుకల కాంగ్రెస్.. ఇది ముమ్మాటికీ మోసమే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు. ఇప్పుడు నేల చూపులు చూస్తున్నారంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనఅరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేల బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడుతాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయికౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండా బద్దలు కొట్టాడు. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వంమొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారు.నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా ?కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి..?420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు ?చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు..?అధికారంలోకి రాగానే మాటతప్పడమెందుకు..?ఇది ముమ్మాటికీ మోసం.. నయవంచన..తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ…నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టిపరిస్థితుల్లో క్షమించరు.గద్దెనెక్కాక గొంతుకోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు.ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదుజై కిసాన్జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనాఅరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేల బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడుతాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… pic.twitter.com/8IW6Qpp29g— KTR (@KTRBRS) September 20, 2024 ఇదే సమయంలో రైతు భరోసాపై బీఆర్ఎస్ స్పందించింది. బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా..కౌలు రైతులకు కుచ్చు టోపీ పెట్టిన రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందు - కౌలు రైతులకు నేరుగా రైతు భరోసా అని హామీ. ఎన్నికల తర్వాత-అసలు రైతుతో కౌలు రైతు మాట్లాడుకోవాలి అని చేతులు దులుపుకున్న దగాకోరు కాంగ్రెస్ సర్కార్ అంటూ సీఎం రేవంత్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. కౌలు రైతులకు కుచ్చు టోపీ పెట్టిన రేవంత్ రెడ్డిఎన్నికల ముందు - కౌలు రైతులకు నేరుగా రైతు భరోసా అని హామీ ఎన్నికల తర్వాత - అసలు రైతుతో కౌలు రైతు మాట్లాడుకోవాలి అని చేతులు దులుపుకున్న దగాకోరు కాంగ్రెస్ సర్కార్. pic.twitter.com/Q57d2Mp1KD— BRS Party (@BRSparty) September 19, 2024ఇది కూడా చదవండి: కొత్త రేషన్‌కార్డులకు అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు -
జమిలి ఎన్నికల నిర్వహణకు కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం çపనిచేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. జమిలి ఎన్నికలు నిర్వహించాల ని నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామమన్నారు. జమిలి ఎన్నికల విషయంలో కేబినెట్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చకు ప్రోత్సహించడం, జమిలి ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్రం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా త్వరలోనే దీనికి సహకరిస్తాయనే విశ్వాసం తనకుందని తెలిపారు.దేశవ్యాప్తంగా ఐదేళ్లపాటు ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నందున.. కోడ్ అమల్లో ఉండటం తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా మారాయన్నారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభల కారణంగా.. ధ్వని కాలుష్యం, ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ప్రజ లకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం కారణంగా అవుతున్న ఖర్చు రూ.4,500 కోట్ల పైమాటేనన్నారు. జమి లి ఎన్నికల ద్వారా జాతీయ అంశాలతోపాటుగా, ప్రాంతీయ సమస్యలపైనా సమానస్థాయిలో చర్చ జరుగుతుందని తెలిపారు. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో ఓటర్లలో ఎన్నికల ప్రక్రియ పట్ల నిరాసక్తత పెరిగి.. ఓటరుశాతం తగ్గటం స్పష్టంగా కనబడుతోందన్నారు. దీనికి జమిలి ఎన్నికలు ఓ పరిష్కారాన్ని చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల కారణంగా, దేశంలో ద్రవ్యోల్బణంలో 1.1% తగ్గుతుందని రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ పేర్కొందన్నారు. -
విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు తర్వాత నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ‘ఎక్స్’లో చేసిన రెండు పోస్టులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తినీ నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’అన్న బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో కొటేషన్‌ను ఆయన రాసుకొచ్చారు. అలాగే ‘మీరు విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు.ప్రతి కథకు మూడు పార్శా్వలు ఉంటాయి. మీ వైపు, నా వైపు మరియు నిజం’అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్‌ను కూడా పోస్టు చేశారు. జానీ మాస్టర్ గురించి ప్రత్యక్షంగా ఆయన ఎక్కడా ప్రస్తావించకపోయినా పరోక్షంగా మద్దతు పలికారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. జనసేన పారీ్టలో జానీ మాస్టర్ కీలకంగా వ్యవహరించడం వల్లే నాగబాబు ఇలా స్పందించారని అంటున్నారు. జానీ మాస్టర్.. తప్పు చేస్తే అంగీకరించండి: మంచు మనోజ్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, అరెస్టు నేపథ్యంలో నటుడు మంచు మనోజ్ స్పందించారు. ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టారు. ‘జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఇప్పుడు కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అన్నది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులకు నా అభినందనలు.ఈ సమాజంలో చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్.. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి. తప్పు చేసి ఉంటే దానిని అంగీకరించండి..’అని మనోజ్ పేర్కొన్నారు. ‘ఇచి్చన మాట ప్రకారం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ని వెంటనే ఏర్పాటు చేయాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ను కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. పరిశ్రమలోని మహిళలకు గొంతుగా నిలపండి. మీరు ఒంటరిగా లేరని, మీ ఆవేదన, బాధలను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. కుమార్తె, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం..’అంటూ మనోజ్ పోస్టు చేశారు. -
ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ కోరుతూ ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన రైతులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ‘రుణమాఫీ కోరుతూ చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన రైతులను బుధవారం రాత్రి నుంచే అక్రమంగా అరెస్టు చేసి దొంగలు, ఉగ్రవాదుల్లా పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణం.పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్రమంగా నిర్బంధించిన రైతులను పోలీసులు బేషరతుగా విడుదల చేయాలి. రుణమాఫీపై హామీ ఇచ్చి మోసం చేసినందునే రైతులు ఆందోళన చేస్తున్నారు. పారీ్టలతో సంబంధం లేకుండా రైతులు సంఘటితమై చేస్తున్న ఉద్యమం ఆగదు. దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదు’ అని కేటీఆర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శిశు మరణాలపై కమిటీ వేస్తాం గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు. సమస్యపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై బీఆర్ఎస్ తరపున నిజ నిర్ధారణ కమిటీ నియమిస్తామన్నారు. ఈ కమిటీ గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి, ప్రజలకు నివేదిస్తుందని చెప్పారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తాము ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వం స్వీకరించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమీక్ష చేసి వైద్యంలో నాణ్యత పెరిగేలా చూడాలన్నారు. గాంధీ ఆసుపత్రిలో అనుభవం కలిగిన వైద్యులను బదిలీ చేయడం వల్లే చికిత్సకు ఆటంకం ఏర్పడిందన్నారు. -
రేవంత్ నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘మాజీ సీఎం చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులపై సీఎం రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్యకర భాష, నేరపూరిత వ్యాఖ్య లపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. రేవంత్ వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ అధిష్టానం ద్వంద్వ వైఖరి అవల ంబిస్తోందన్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్‌కు హరీశ్‌రావు గురు వారం బహిరంగ లేఖ రాశారు. ‘కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. రాహుల్ తీవ్రవాది అంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్.. రేవంత్‌పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఢిల్లీలో ఒక నిబంధన, గల్లీలో మరో నిబంధన అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. రేవంత్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న రేవంత్‌పై కఠినచర్య లు తీసుకోవాలి’అని హరీశ్ లేఖలో డిమాండ్ చేశారు. రుణమాఫీ కోరితే నిర్బంధిస్తారా? ‘ఆంక్షలు, కంచెలు లేని ప్రభుత్వం, ప్రజాపాలన అంటూ డబ్బాకొట్టుకుంటున్న రేవంత్ ప్రభుత్వం రుణమాఫీ కోరిన రైతులను నిర్బంధిస్తోంది. ప్రజాభవన్ చుట్టూ కంచెలు, ఆంక్షలు ఎందుకు? ప్రజాభవన్‌కు రైతులు తరలివస్తుంటే సీఎం ఎందుకు భయ పడుతున్నారు? రుణమాఫీపై మాట తప్పినందుకు అది రేవంత్ ప్రభుత్వానికి ఉరితాడుగా మారుతుంది’అని హరీశ్‌రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన
హైదరాబాద్: ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. కంగనాపై చేసిన వ్యాఖ్యలకు దానం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన చేపట్టింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు దిగింది. ఈ క్రమంలోనే దానం నాగేందర్ దిష్టి బొమ్మ దహనం చేశారు బీజేపీ మహిళా మోర్చా మహిళా నేతలు. దానం చేసిన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా నేతలు మండిపడ్డారు.దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ.. ‘ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. బాధ్యతగల ఎమ్మెల్యేగా చౌకబారు వ్యాఖ్యలు తగదు. దానం నాగేందర్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.సినిమా ఇండస్ట్రీలో బోగం వేషాలు వేసే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదంటూ దానం వ్యాఖ్యానించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. -
‘బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయడం పాపమే అవుతుంది’
సాక్షి, నల్లగొండ: పార్టీ ఆఫీసు నిర్మాణం విషయంలో బీఆర్ఎస్కు ఒక న్యాయం మిగతా పార్టీలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు గులాబీ పార్టీ నేతలు. నల్లగొండలో బీఆర్ఎస్ ఆఫీసును కూల్చివేయాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు స్పందించారు. ఇది కాంగ్రెస్ కుట్రలో భాగమని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.తాజాగా నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మేము ఏ పార్టీ ఆఫీసు జోలికి వెళ్లలేదు. తెలంగాణలో ఏ పార్టీ ఆఫీసుకు అనుమతులు లేవు. నిబంధనల ప్రకారమే లీజుకు తీసుకుని అనుమతి కోసం దరఖాస్తు చేశాం. 5800 గజాల్లో పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం దరఖాస్తు పెట్టుకున్నాం. 2019లో ఆఫీసు నిర్మాణం చేపట్టి 2020లో పూర్తి చేశాం. నిర్మాణంపై మేము దరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వలేదు. ఆనాటి కమిషనర్ ఆఫీసు నిర్మించుకోమని చెప్తేనే మేము ముందుకు వెళ్లాం.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కావాలనే ఆఫీసును కూల్చేస్తా అని మాట్లాడారు. కోమటిరెడ్డికి చట్టమేమీ చుట్టం కాదు. మాకు న్యాయం జరుగుతుందనుకుంటే అన్యాయం జరిగింది. కోర్టు తీర్పుపై మరో కోర్టును ఆశ్రయిస్తాం. కోమటిరెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవు. ఆఫీసు భవనాన్ని ప్రజలు, ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగిస్తామంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ కార్యాలయం కూలిస్తే ఏం వస్తుంది. ఒకసారి కూలిస్తే అనుమతులు తీసుకుని నాలుగింతల నిర్మాణం చేస్తాం. మీలా మాకు కూల్చడం తెలియదు. నిలబెట్టడం మాత్రమే తెలుసు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఒక న్యాయం మిగతా పార్టీలకు మరో న్యాయమా?. మిగతా పార్టీల కార్యాలయాలకి కూడా అనుమతులు లేవు. వాటిని కూల్చే దమ్ము మంత్రి కోమటిరెడ్డికి ఉందా?. పార్టీ ఆఫీసును కూల్చడానికి అధికారులు కాకుండా కోమటిరెడ్డి అనుచరులు వస్తున్నారు. వారే జేసీబీలు తీసుకువస్తున్నారు. కేసీఆర్ హయాంలో నల్లగొండలో రూ.374 కోట్ల పనులు జరిగాయి. మరి వాటి సంగతేంటి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయడం పాపమే అవుతుంది. 👉మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆఫీసు విషయంలో కోర్టు తీర్పుపై పైన కోర్టుకు వెళ్తాం. కోర్టు ఆర్డర్ కాపీ రాకముందే కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా దీనిపై స్పందించాలి. దీనిపై మేము పైన కోర్టకు వెళ్లే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు.👉మరో బీఆర్ఎస్ నేత చెరుకు సధాకర్ మాట్లాడుతూ..‘బీజేపీ బుల్డోజర్ సంస్కృతిని కాంగ్రెస్ అమలు చేస్తోంది. బుల్డోజర్ సంస్కృతిని కోర్టు సమర్థించడం బాధాకరం. విదేశాలకు వెళ్లి వచ్చే లోపు కూలగొట్టాలని మంత్రి అనడం ఏంటి?. ఒక కోర్టు ఇచ్చిన తీర్పును మరో కోర్టు తప్పుబట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాంగ్రెస్‌కు విజ్ఞత ఉంటే ఇలాంటి పనులు చేయదు. కూలగొడుతాం అంటే చేతులు ముడుచుకొని కూర్చోం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును 15 రోజుల్లో కూల్చేయండి: హైకోర్టు -
‘జమిలి’తో ప్రభుత్వాలు రద్దేనా?: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాలను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. జమిలి ఎన్నికలపై పార్టీ నేతలమంతా కూర్చొని చర్చించి నిర్ణయం చెబుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బుధవారం(సెప్టెంబర్18) కేటీఆర్ తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలతో సమావేశమై మాట్లాడారు.‘కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట చేసిన మోసంపై పార్టీ బీసీ నేతల సమావేశంలో చర్చించాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసే దాకా కాంగ్రెస్‌ను నిలదీస్తాం. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించాలి.నవంబర్ 10 లోపు పూర్తి చేయని పక్షంలో బీసీల తరఫున ఎలా ముందుకు పోతామో కార్యాచరణ ప్రకటిస్తాం.అవరసరం అయితే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతాం.బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి ఎనిమిది వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టారు.బీసీ సబ్ ప్లాన్ పెట్టాలి.25 నుంచి 35 వేల కోట్లు అందులో పెట్టాలి.ఎమ్మెల్సీ మధుసూదనా చారి నేతృత్వంలో తమిళనాడు వెళ్లి బీసీ స్కీమ్‌లపై అధ్యయనం చేయాలని నిర్ణయించాం. కేవలం ఇద్దరు బీసీ మంత్రులు మాత్రమే కేబినెట్లో ఉన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలి. బీఆర్ఎస్ బీసీల కోసం కదులుతుంది’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి.. జమిలికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్