breaking news
-
అభివృద్ధి కోసమే ‘జమిలి’: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: దేశ అభివృద్ధి కోసమే జమిలి ఎన్నికలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం( సెప్టెంబర్18) ఆమోదం తెలిపిన సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘జమిలితో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. దేశంలో నిత్యం ఏదో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశ అభివృద్ధికి కొంత ఆటంకం ఏర్పడుతోంది. దేశ అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాలు కొంత మందికి నచ్చవు.జమిలి ఎన్నికలు అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది.పార్లమెంట్లో జమిలి బిల్లు ప్రవేశ పెడతారు. అప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది.ప్రతిపక్షాలకు ఏదైనా అభ్యంతరం ఉంటే పార్లమెంట్లో జరిగే చర్చలో చెప్పొచ్చు’అని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి..కేసీఆర్,కేటీఆర్ వదిలిపెట్టినా..నేను వదిలిపెట్టను: బాల్కసుమన్ -
కేసీఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను: బాల్కసుమన్
సాక్షి,హైదరాబాద్:ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చర్చకు రావొద్దనే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు. బుధవారం(సెప్టెంబర్18) సుమన్ మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి, కుటుంబ పాలన, దందాలు నడుస్తున్నాయని విమర్శించారు.‘హైడ్రా పేరుతో భయపెట్టి వసూళ్ల దందా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్.తమ్మడి కుంట ఎఫ్టీఎల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టిన సిపాయి హిమాయత్ సాగర్‌లో ఉన్న ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూల్చడంలేదు. నాగార్జునను 400 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వనందుకే కూల్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌజ్‌లను కూల్చరు. ప్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. ప్రజా పాలన నడుస్తలేదు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతున్నారు. రేవంత్ టీమ్‌లో ఉండి ఫేక్ న్యూస్‌లు పెడుతున్న వారిని, అధికారులను కెసిఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా నేను వదిలి పెట్టను’ అని సుమన్ ఫైర్ అయ్యారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును 15 రోజుల్లో కూల్చేయండి: హైకోర్టు -
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పీవీ నర్సింహరావు ప్రధానమంత్రి అయ్యాక పారిశ్రామిక విధానంలో అనేక మార్పులు తెచ్చారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచంతో మనం పోటీ పడేలా విధివిధానాలు మార్చారని తెలిపారు. నేడు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే పీవీ, మన్మోహన్సింగ్యే కారణమని అతన్నారు.ఎమ్ఎస్ఎమ్ఈ పాలసీ-2024ను సీఎం రేవత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మత్రులు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సృష్టించేందుకే ఈ కార్యక్రమమని తెలిపారు. పాలసీ లేకుంటే ఏ ప్రభుత్వం నడవదని.. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎమ్ఎస్ఎమ్ఈ పాలసీ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. వ్యాపార విస్తరణను మరింత సరళీ కృతం చేసేందుకు ఈ కొత్త పాలసీ ఉపయోగపడుతుందన్నారు.గత ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటీవల్ హామీలను మేము నెరవేరుస్తామని సీఎం వెల్లడించారు. చిన్న గ్రామాలుగ ఉన్న మాదాపూర్, కొండాపూర్ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందాయని.. ఐటీ, ఫార్మీ రంగాల్లో మనం దూసుకుపోతున్నామన్నారు. మంచి పనులు ఎవరూ చేసినా కొనసాగిస్తాం. అందులో సందేహం లేదని తెలిపారు. పట్టాలు పొందిన విద్యార్ధులకు ఉద్యోగాలు రావడం లేదు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు.. నైపుణ్యాలు ఉండటం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. టాటా ఇండస్ట్రీస్‌తో మాట్లాడి రూ, 2400 కోట్లు ఐటీఐలను అభివృద్ధి చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రాను వీసీగా నియమించాం. సాంకేతిక నైపుణ్యం లోపించిన వారికి ఉద్యోగాలు రావడం లేదు. యువతలో సాంకేతిక నైపుణ్యం పెంచితే ఉద్యోగాలు వస్తాయి. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. వ్యవసాయాన్ని ఎవరూ వదలద్దు. వ్యవసాయం మన సంస్కృతి. రైతులను రుణాల నుంచి విముక్తి కల్పించాం. గతంలో కృష్ణా గుంటూరులో ఒక ఎకరం అమ్మితే హైదరాబాద్‌లో 10 ఎకరాలు వచ్చేవి. ఇప్పుడు హైదరాబాద్‌లో 1 ఎకరం అమ్మితే గుంటూరులో 100 ఎకరాలు కొనొచ్చు. మూసీ అంటే మురికి కూపం కాదు అని నిరూపిస్తాం. మూసీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. విద్యార్ధులకు బట్టలు కూటే బాధ్యత కూడా మహిళలకే ఇచ్చాం’ అని తెలిపారు. -
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. మహిళా కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. భారీగా కాంగ్రెస్‌నేతలు చేరుకోని బీజేపీ ఆఫీసు ముట్టడికి యత్నించటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ఆఫీసు ఎదుట మహిళా కాంగ్రెస్ నేతలు బైఠాయించి బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రాహుల్ గాంధీకి బీజేపీ నేతలు క్షమాపలు చేప్పాలని డిమాండ్ చేశారు.గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత..రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ధర్నా చేట్టారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.చదవండి: రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమన్న కాంగ్రెస్ -
కంప్యూటర్లను కనిపెట్టడంలో సీఎం రేవంత్ బిజీ: కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కంప్యూటర్లను కనిపెట్టడం, మళ్లీ వాటిని ఆవిష్కరించడంలో రేవంత్ బిజీగా ఉన్నారని విమర్శలు గుప్పించారు. దీంతో పాటు ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై ఉన్నారని కేటీఆర్ సెటైర్లు వేశారు. అయితే సీఎం తన విధులను విస్మరిస్తున్నారని.. ఎవరైనా ఒక్కరు ఈ ‘పాలమూరు బిడ్డ’కు గుర్తు చేయాలన్నారు..ఇటీవల సెప్టెంబర్3న సంభవించిన వరదలకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులోని వట్టెం పంపు హౌస్ నీట మునిగినప్పటికీ సీఎం రేవంత్ ఇప్పటి వరకు స్పందించలేదు. వరద నీటికి బాహుబలి మోటార్లు నీట మునిగాయి. ఇప్పటి వరకు కేవలం ఒక మీటర్ నీటిని మాత్రమే తొలగించారు.. మరో 18 మీటర్ల నీటిని అలానే ఉంచారు. ఆ నీటిని కూడా త్వరగా తొలగించాలి. తెలంగాణకు ముఖ్యమైన, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులను ఎందుకు ధ్వంసం చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.While CM Revanth Reddy was busy discovering and rediscovering the origins of computers and while he is busy boarding flights to appease Delhi bosses, someone should remind him this ‘Palamuru Bidda’ that he is vastly ignoring his duties! The recent flooding at the Vattem pump… pic.twitter.com/grdpwyN8t9— KTR (@KTRBRS) September 18, 2024 -
అప్పులే చెబుతారా..? అభివృద్ధి లేదా..?
మెదక్ మున్సిపాలిటీ: రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రస్తావించకుండా అప్పుల గురించి పదేపదే మాట్లా డుతూ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మెదక్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. 16వ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్ధాలను వల్లెవేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని, ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడటం రాష్ట్ర భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేయడమేనని పేర్కొన్నారు. రూ.6.85 లక్షల కోట్ల అప్పుందనే తప్పుడు ప్రచారాన్ని ఇంకెన్ని రోజులు చేస్తారని హరీశ్ ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమాల కోసం నెట్‌గా చేసిన అప్పు రూ.4,26,499 కోట్లు మాత్రమేనని అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ వివరించానని తెలిపారు. తెచి్చన అప్పులను మూలధనంగా మార్చి, ఎన్ని ఆస్తులు, ఎంత సంపద సృష్టించామో లెక్కలతో సహా చెప్పామన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశంలోనే తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని హరీశ్ ప్రశ్నించారు.‘రాష్ట్రం దివాలా తీసిందన్న మీ మాటలు విని పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా? రాజకీయ కక్షల కోసం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారా? భావి తరాలకు శిక్ష వేస్తారా?’అని హరీశ్‌రావు నిలదీశారు. రాష్ట్ర ప్రతిష్టను కాపాడటం అంటే విదేశాలకు వెళ్లి ఇక్కడి డొల్ల కంపెనీల్లో బోగస్ పెట్టుబడులు పెట్టినంత సులువు కాదని ఎద్దేవా చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే తెలంగాణ, మీ పాలనలో టాప్ పది స్థానంలో కూడా స్థానం దక్కించుకోలేకపోయిందని మండిపడ్డారు. -
హైదరాబాద్ విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర పోరాటం, హైదరాబాద్ విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. మంగళవారం గాం«దీభవన్‌లో ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులరి్పంచారు. అనంతరం మహేశ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ విలీనంలో పాత్ర లేని బీజేపీ.. కాంగ్రెస్ పారీ్టకి నీతులు చెప్పాల్సిన అవసరంలేదని హితవు పలికారు.స్వాతంత్య్రానంతరం అన్ని సంస్థానాలను దేశంలో అంతర్భాగం చేయాలని అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్‌ను ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కోరారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు బీజేపీతో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేశారని, జనసంఘ్, బీజేపీల ఆచూకీ ఎక్కడా లేదన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకించడం బీఆర్ఎస్కు తగదని మహేశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీ కుటుంబాన్ని కించపరచడం బీఆర్ఎస్ నీతిమాలిన చర్యలకు పరాకాష్టఅని విరుచుకుపడ్డారు.తొమ్మిదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన వెంటనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకలి్పంచామని చెప్పారు. హైదరాబాద్ విలీన దినం సందర్భంగా కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని మహేశ్ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, టీజీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టీపీసీసీ నేతలు బొల్లు కిషన్, మత్స వరలక్షి్మ, కోట్ల శ్రీనివాస్, మిద్దెల జితేందర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అసలు పాలనే లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి అధికారంలోకి వచి్చంది మొదలుకొని తొమ్మిది నెలలుగా తమ అధినేత కేసీఆర్‌ను దూషించడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చరిత్ర తెలియని కొందరు సెపె్టంబర్ 17ను రాజకీయాల కోసం వక్రీకరించారన్నారు. రాష్ట్రంలో అసలు పాలనే లేదని, అయినా సెపె్టంబర్ 17ను సీఎం రేవంత్ ప్రజాపాలన దినోత్సవం పేరిట జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తరలిస్తాం.. ‘తెలంగాణ తల్లి ఆత్మను అవమానిస్తూ సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెట్టావు. ఇన్నిరోజులు సోనియాగాం«దీ, రాహుల్‌ను తిట్టిన రేవంత్ ఇప్పుడు దానిని కప్పి పుచ్చుకునేందుకు, ఢిల్లీ మెప్పు కోసం రాజీవ్ విగ్రహాన్ని పెట్టాడు. మేము అధికారంలోకి వచి్చన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని గాం«దీభవన్‌కు తరలిస్తాం. రేవంత్‌కు అంత ఇష్టమైతే జూబ్లీహి ల్స్ ఇంట్లో రాజీవ్ విగ్రహం పెట్టుకోవాలి. గణేశ్ నిమజ్జనం రోజున రేవంత్‌కు చెబుతున్నా రాసిపెట్టుకో. రాజీవ్ విగ్రహం తొలగింపు కచి్చతంగా జరిగి తీరుతుంది’అని కేటీఆర్ ప్రకటించారు. హామీలు అమలు చేసేంతవరకు ప్రభుత్వం వెంటపడతాం ‘రాజీవ్ విగ్రహావిష్కరణ సందర్భంగా రేవంత్ మాట్లాడిన పనికిమాలిన మాటలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది. రాష్ట్రంలో గంగాజమున తెహజీబ్‌ను కాపాడుతూ పదేళ్లపాటు తెలంగాణకు ఒక్క నొక్కు పడకుండా శాంతిభద్రతలను కేసీఆర్ కాపాడారు. రేవంత్‌కు చేతనైతే నాణ్యమైన విద్యుత్, రైతుబంధు, పెంచిన పెన్షన్లు, 2 లక్షల ఉద్యోగాలు తదితర హామీలను నెరవేర్చాలి. కానీ రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. హామీలు అమలు చేసేంత వరకు ప్రభుత్వం వెంటపడతాం. తెలంగాణతల్లి విగ్రహానికి పాలాభిõÙకం చేసేందుకు వెళుతున్న బీఆర్ఎస్వీ విద్యార్థి నేతల అరెస్టు అక్రమం’అని కేటీఆర్ అన్నారు. జాతీయ సమైక్యత దిన వేడుకలు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణభవన్‌లో జాతీయజెండాను ఎగురవేశారు. అంతకుముందు సచివాలయం ఎదుట రాజీవ్‌గాం«ధీ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు తెలంగాణభవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పాలాభిõÙకం చేశారు. ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, రాజీవ్ సాగర్, వాసుదేవరెడ్డి, రాకేశ్‌రెడ్డి, బాలరాజుయాదవ్ పాల్గొన్నారు. -
రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అందుకే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహా స్థాపన అని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోనియా, రాహుల్‌ను నాడు తిట్టిన కారణంగానే నేడు కవర్ చేసుకునేందుకే విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు.కాగా, జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహా స్థాపన చేపట్టారు.నాడు సోనియా గాంధీని బలిదేవత, రాహుల్ గాంధీని ముద్ద పప్పు అని తిట్టారు. వాటిని కవర్ చేసుకోవడానికే రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు చేశారు. రాజీవ్ కంప్యూటర్ కనిపెట్టారని సీఎం రేవంత్ చెబుతున్నారు. కంప్యూటర్ కనిపెట్టిన ఛార్టెస్ బాబేజ్ ఆత్మ బాధపడుతుంది అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శాసనమండలిలో విపక్ష నేత మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఇది కూడా చదవండి: హైడ్రాపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. -
తెలంగాణ తల్లికి నేడు పాలాభిషేకాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయానికి, తెలంగాణ అమర జ్యోతికి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టుపెట్టే సిగ్గుమాలిన చర్యగా భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులతో సహా తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలుపాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటమేంటని తెలంగాణ సమాజమంతా ఆవేదన చెందుతోందని, రేవంత్‌రెడ్డి వెంటనే తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కచ్చితంగా తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని హెచ్చరించారు. ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహావిష్కరణా? ‘తెలంగాణ తల్లి విగ్రహం కోసం స్థలాన్ని కేసీఆర్ 2023 జూలైలోనే ఎంపిక చేశారు. యావత్తు తెలంగాణ సమాజం కూడా తెలంగాణ తల్లిని గౌరవించుకునేందుకు కేసీఆర్ ఎంపిక చేసిన స్థలానికి ఆమోద ముద్ర వేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ చర్య ప్రతి తెలంగాణ వ్యక్తి మనసునూ గాయపర్చేలా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం. సకల మర్యాదలతో గాంధీ భవన్‌కు తరలిస్తాం..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీ మెప్పు కోసమే! ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి బానిసత్వం చేస్తారని మేం ముందుగానే చెప్పాం. రేవంత్‌రెడ్డి ఇప్పుడు అదే పనిచేస్తున్నారు. ఢిల్లీ బాసుల మెప్పు కోసమే తెలంగాణ ఆత్మను తాకట్టు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ మనోభావాల కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఢిల్లీ బాసుల మెప్పు పొందటమే ముఖ్యమైపోయింది. తెలంగాణ ఉద్యమకారులమంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీకి గులాములేనని తేలిపోయింది. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకున్న వాళ్లెవరూ రాజకీయంగా బతికి బట్టకట్టలేదు. తెలంగాణ ప్రజలు వారికి రాజకీయంగా సమాధి తవ్వటం ఖాయం..’అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వం, ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్షగా నిలుస్తుందని స్పష్టం చేశారు. -
మేం వచ్చాక రాజీవ్‌గాంధీ విగ్రహం అక్కడికే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి ఆవిష్కరించటంపై సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ పప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు నిరసనగా రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రేవంత్‌రెడ్డి తెలంగాణతల్లి ఆత్మను తాకట్టుపెట్టాడని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధేనని హెచ్చరించారు. ఇదీ చదవండి.. రాజీవ్ విగ్రహాన్ని టచ్‌చేస్తే బీఆర్ఎస్కే నష్టం: వీహెచ్ -
రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే బీఆర్ఎస్కే నష్టం: వీహెచ్
సాక్షి,హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశాన్ని21వసెంచరీలోకి తీసుకుపోవడానికి కృషి చేసిన వ్యక్తని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు కొనియాడారు. అలాంటి నేత విగ్రహాన్నికూలగొడతామని బీఆర్ఎస్ నేతలు అనడం సరికాదన్నారు.య గాంధీభవన్‌లో మంగళవారం(సెప్టెంబర్16) వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అది బీఆర్ఎస్కు పెద్ద నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.‘దేశం కోసం ప్రాణాలు అర్పించినిన ఫ్యామిలీ గాంధీలది. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. విగ్రహాలు కూలుస్తాం లాంటి మాటల వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట తగ్గిపోతుంది. రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడే సచివాలయంలోనే పెట్టాలి. విగ్రహాన్ని ముట్టుకుంటే ప్రజలే సమాధానం చెప్తారు. అలాంటి ఆలోచనలు ఉంటే బీఆర్ఎస్ నేతలు మానుకోవాలి’అని వీహెచ్ హితవు పలికారు. ఇదీ చదవండి.. టచ్ చేసి చూడు.. పొన్నం సవాల్ -
అలా చెప్పి ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేది!
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన కూడదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అధికారం కోల్పోయామన్న అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ... బీఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించడం కూడా ఎంత వరకూ సబబో ఆయన ఆలోచించుకోవాలి. పీఏసీ పదవి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య వివాదం ముదిరిన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం దీనిపై బీఆర్ఎస్ విమర్శలకు దిగడం.. పరిస్థితి మరింత ముదిరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (బీఆర్ఎస్), గాంధీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు అరికెపూడి గాంధీ వైపునే ఉన్నప్పటికీ సీఎం ఆయన్ను వెనకేసుకుని వచ్చినట్లుగా అనిపిస్తుంది.సెప్టెంబరు 12 కౌశిక్, గాంధీల మధ్య జరిగిన ఘటనల్లో పోలీసులతోపాటు ప్రభుత్వ వైఫల్యమూ స్పష్టంగా కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో పెట్టిన పోలీసులు గాంధీపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. దీన్నే సాకుగా తీసుకున్నారో ఏమో కానీ.. గాంధీ తన అనుచరులతో కౌశిక్ ఇంటిపై దాడికి దిగారు. కౌశిక్ ఇంటి ముందు కూర్చుని ‘‘మీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటకు రా’’ అంటూ రెచ్చగొట్టే, సినిమా డైలాగులు, ఇతర పరుష పదజాలం ఉపయోగించారు. గాంధీ అనుచరులు మరింత రెచ్చిపోయి కౌశిక్ ఇంటి అద్దాలు పగులగొట్టడమే కాకుండా.. టమోటాలు, కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. తప్పు ఎవరిదన్నది అందరికీ స్పష్టంగా తెలుస్తున్నా పోలీసులు గాంధీని ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచలేదో స్పష్టం చేయలేదు.ముఖ్యమంత్రి బీఆర్ఎస్పై చేసే ఆరోపణ రాజకీయం అనుకోవచ్చు కానీ.. గురువారం నాటి ఘటనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది. కాంగ్రెస్‌లో చేరిన గాంధీ అనుచరులే. అంతా అయిపోయిన తరువాత పోలీసులు గాంధీపై నామమాత్రంగా కేసులు పెట్టారన్న అభిప్రాయం కూడా ప్రజల్లో నెలకొంది. బీఆర్ఎస్ నేత ఎవరైనా కాంగ్రెస్ నేత ఇంటిపై దాడి చేసి ఉంటే కూడా ఇలాగే వ్యవహరించే వారా? లేక... దాడులకు ఎవరు పాల్పడ్డా కఠినంగా వ్యవహరించాని సీఎం చెప్పేవారా? ఇలా చెప్పి ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెరిగి ఉండేది.ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నాడని సీఎం స్వయంగా చెప్పడం ఇంకో ఎత్తు. గతంలో పీఏసీ పదవిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు ఎలా ఇచ్చారని రేవంత్ రెడ్డే ప్రశ్నించారు. మరి ఇప్పుడు అదే తీరులో గాంధీకి పదవి కట్టబెట్టడం ఎంత వరకూ సబబు అవుతుంది?. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, త్వరలో ఆ పార్టీ ఖాళీ అవుతుందని రేవంత్ స్వయంగా విమర్శించారు కదా? అలాగైతే ఆయన ధైర్యంగా వీరందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధమై ఉండాల్సింది. ఇలా చేసి ఉంటే ఆయనపై గౌరవం మరింత పెరిగేది. ఇలా చేయలేదు సరికదా.. పార్టీ మారిన దానం నాగేందర్‌ను ఏకంగా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడుతూంటే రేవంత్ వాటినే ప్రోత్సహించడం, పైగా గాంధీ బీఆర్ఎస్ వాడేనని వ్యాఖ్యానించడం, దబాయించడం ఏమంత సముచితంగా అనిపించదు.సెప్టెంబరు 12 నాటి ఘటనకు ముందు కౌశిక్ రెడ్డి చేసిన కొన్ని పనులు, వ్యాఖ్యలు కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారేందుకు కారణమైందన్నది స్పష్టం. ఎందుకంటే.. గాంధీతోపాటు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి గాజులు, చీర ప్రదర్శించడం రెచ్చకొట్టడమే అవుతుంది. అంతేకాదు.. ఈ చర్య మహిళలను కించపరచడం కూడా. రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది... ఇదే అంశంపై గాంధీ, కౌశిక్ రెడ్డిలు పరస్పర ఘాటు విమర్శలకూ దిగారు. అయితే ఒకరింటికి ఒకరు వెళతామని సవాళ్లు విసురుకోవడమే రచ్చగా మారింది. అప్పటికిగానీ ఇది శాంతి భద్రత సమస్య అని గుర్తించలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి స్థానికుడు కాదని బతకడానికి వచ్చిన వాడు వ్యాఖ్యానించడం కూడా సరైంది కాదు. తెలంగాణ వచ్చి పదేళ్ల తర్వాత కూడా ఈ రకమైన వాదన చేయడం బీఆర్ఎస్కు నష్టం చేసేదని ఆ పార్టీ నేతలు గుర్తించాలి.హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ స్వీప్ చేయడంలో ఆంధ్రా నుంచి స్థిరపడిన వారి ఓట్లు, ఇతర రాష్ట్రాల వారు ఉన్నారని రేవంత్ స్వయంగా చెప్పిన విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో కౌశిక్ వ్యాఖ్యలను ప్రస్తావించి ముఖ్యమంత్రి కూడా అదే పదం వాడడం అభ్యంతరకరం. బతకడానికి వచ్చిన వారి ఓట్లు కావాలి గానీ, వాళ్లు వద్దా అని ముఖ్యమంత్రి రేవంత్ అనడం ద్వారా ఆయన కూడా కౌశిక్ లాగానే మాట్లాడారనే భావన కలుగుతుంది. ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా వుంటే మళ్లీ ప్రజల మధ్య అనవసరమైన వివాదాలు రాకుండా వుంటాయని చెప్పాలి.ఫిరాయింపులపై హైకోర్ట్ తీర్పు మీద రేవంత్ వ్యాఖ్యానిస్తూ బీఆర్ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఖాళీ అయిపోతోందని కాంగ్రెస్ ప్రచారం చేయడం కూడా అలాంటి సైకలాజిక్ గేమే కదా?. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. ఆ ఆరోపణ నిజం కాకపోతే వారు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి లేదని కోర్టుల నుంచి ఆర్డర్ తీసుకు రావాలని విపక్షాలకు సలహా ఇవ్వడం విడ్డూరంగా ఉంది.ఏ ఎమ్మెల్యే అయినా అటూ ఇటూ దిక్కులు చూస్తే అనర్హత వేటు పడుతుందంటే తన ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. ఒక పక్క పదిమందిని చేర్చుకొని వారిపై వేటు వేయని రేవంత్ తమాషాగా మాట్లాడుతున్నారు. నిజానికి బీఆర్ఎస్ , బీజేపీలు కలిసినా రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి లేదు. అలాంటి అవకాశముంటే ఎన్నికలైన వెంటనే అక్రమమైనా ఒక పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనైనా లాగి ఉండేవారు. ఆ పని చేసే అవకాశం లేదు కాబట్టే రేవంత్ ప్రభుత్వం సేఫ్‌గా వుంది. ఇప్పుడేమో ఆయన పదిమందిని లాగడమే కాకుండా, ఏదో కుట్ర జరుగుతోందని వైరి పక్షాలపై ఆరోపణలు చేస్తున్నారు.ఏది ఏమైనా ఫిరాయింపుల విషయంలో రేవంత్ తన గురువైన చంద్రబాబునాయుడిని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుసరిస్తున్నట్టే వుంది. కొసమెరుపు ఏమంటే కేసీఆర్ లక్కీ నెంబర్ తమ దగ్గర వుందంటూ రేవంత్ రెడ్డి తమకు 66 మంది సభ్యులు వున్నారని గుర్తు చేయడం. కేసీఆర్ లక్కీ నెంబర్ 6గా చెప్పుకుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలున్నారు. కాబట్టి రెండు 6 సంఖ్యతో వున్నాయి కాబట్టి అలా అని వుండవచ్చుగానీ నిజానికి ఇలాంటి నమ్మకాలున్నవారు అన్ని అంకెల్ని కలిపి ఫైనల్ గా వచ్చిన సింగిల్ డిజిట్ నే లక్కీ నెంబర్ గా చూస్తారు. ఐతే రేవంత్ లక్కీ నెంబర్ తొమ్మిది!!!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత ఇదీ చదవండి: నా ప్రాణాలకు హాని జరిగితే రేవంత్‌దే బాధ్యత!! -
అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలం: కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తనను హత్య చేయడానికి అనుచరులను పంపించానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరోక్షంగా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సహచ ఎమ్మెల్యేను హత్య చేయడానికి పంపించారంటే ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉండదని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన తెలంగాణ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు పార్టీ నాయకులు కొట్లాడుకున్నారని అన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకొని హైదరాబాద్ బ్రాండ్ డ్యామేజ్ చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో నేనే అనుచరులను పంపిన అంటున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాని ప్రశ్నించినదుకు సీఎం రేవంత్ నన్ను హత్య చేయాలని అనుకున్నారా?. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ, హోమ్స్ సెక్రెటరీ స్పదించాలి. .. డీజీపీ, హోం శాఖ స్పదించక పోతే రేపు(మంగళవారం) గవర్నర్‌ను కలుస్తా. పోలీసులు సీఎం రేవంత్పైన 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. సైబరాబాద్ పోలీస్ కమిషన్‌కు మంచి పేరు ఉంది. అవినాష్ మహంతి కరీంనగర్ సీపీగా డైనమిక్‌గా పని చేస్తున్నారు. డైనమిక్ లాగా అవినాష్ మహంతి పని చేయాలి. ఎమ్మెల్యే ఇంటి మీద ఎటాక్ జరిగితే ఎం జరిగిందో పోలీసులు చెప్పరా? ..ఒకన్నీ అరెస్ట్ చేసి ఇంకొకనికి ఎస్కార్ట్ ఇచ్చి చింతపండు చేసినం అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. మరీ ఓటుకు నోటు కేసులో చింతపండు అయిన విషయం మర్చిపోయినవా? నేను తెలంగాణ జనం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. సీఎం రేవంత్ స్థాయి.. వీధి రౌడీ స్థాయికి దిగజారిపోయింది. సీఎం రేవంత్ మనుషులు హత్య చేస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఇంటలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డికి ఫోన్ కాల్స్ వివరాలు ఇచ్చాను. నా ప్రాణానికి హాని జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత. రాష్ట్రంలో మల్లా బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది.. ఇది పక్కా. అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలం’ అని అన్నారు. -
టచ్ చేసి చూడు: పొన్నం సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ఎదుట దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై అనవసర రాజకీయాలకు తెరలేపొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై పిచ్చి ప్రేరాపనలు చెయ్యద్దని మండిపడ్డారు. విగ్రహాన్ని కూల్చుతాం పేల్చుతాం అంటే ఎవరు చూసుకుంటూ కూర్చోరని పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండదని, దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహం పై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను, తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవమానించదు.. అవమానించలేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తమకు తెలంగాణ తల్లిపై అభిమానం ఉంది కాబట్టే.. సెక్రటేరియట్ లోపల విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. బీఆర్కు చేతనైతే తమకంటే మంచి పనులు చేయాలని సూచించారు. 18 సంవత్సరాలకు యువతకు ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు.కాగా తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటుపై రాజీకాయ రగడ నెలకొంది. విగ్రహావిష్కరణపై కాంగ్రెస్, బీఆర్ మధ్య మాటల యుద్దం నడుతస్తోంది. సచివాలయం ఎదుట తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావించామని, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని మండిపడుతోంది. అంతేగాక బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని తెలిపింది. బీఆర్ఎస్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడాలని, ఏం జరుగుతోందో చుద్దాం అంటూ సవాల్ విసురుతున్నారు. -
తెలంగాణ తల్లిని అవమానిస్తారా? కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిని ఆవమానిస్తోందని ధ్వజమెత్తారు .తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన, స్వార్థ రాజకీయాలకు తెరతీస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఎ క్స్ వేదికగా స్పందిస్తూ..‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ?నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన.. “తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..“రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా.. ??తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు..!జై తెలంగాణ’ అంటూ పేర్కొన్నారు. కాగా సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తుంది.తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎవరి విగ్రహాలు పెట్టినా ఊరుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే తేల్చిచెప్పారు. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మృతి చిహ్నం పక్కన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని.. ఆ స్మృతి చిహ్నం ప్రారంభోత్సవ సభలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. అందుకోసం సచివాలయం ముందున్న సిగ్నల్ పాయింట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి రోడ్డును వెడల్పు వేసిందని పేర్కొన్నారు. ప్రజలు పండుగ సంబురాల్లో ఉండగా విగ్రహావిష్కరణకు పూనుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. -
ఒక్కసారే ఎక్కువ.. రెండోసారి పగటి కలే..
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుడే ఎక్కువ.. రెండుసార్లు గెలుస్తారని అనడం పగటి కలలు కనడమే’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ను గెలిí³స్తే ఐదేళ్లలోపు ప్రభుత్వాలు పోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. ‘అదృష్టం బాగుంటే ఐదేళ్లు ఉంటావు.మంచిగా ప్రవర్తించు. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతుంది. రెండుసార్లు అధికారంలో ఉంటానని పగటి కలలు కనకు. అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ తీస్తున్నావు. సీఎం కుర్చీ గౌరవం తగ్గిస్తున్నావు. రాష్ట్రంలో రెండు రకాల వరదలతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఒకటి వర్షాలతో వచ్చిన వరద అయితే...రెండోది చిల్లర ముఖ్యమంత్రి అబద్ధాల వరద. మోరీల కంపును మించిపోయింది ముఖ్యమంత్రి నోటి కంపు. ప్రభుత్వంలో ఉన్నాననే సోయి..ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నా అనే ఇంగితం లేక మాట్లాడుతున్నాడు.పదే పదే నా పొడుగును గురించి దుర్భాషలాడుతున్నావు. నేను పొడుగే. తెలంగాణ ఉద్యమం నన్ను మరింత ఎత్తుకు చేర్చింది. నీ బుద్ధి కురుచ. నీ చరిత్ర కురుచ. నీ భాష కురుచ. నీ కురుచతనం వల్ల నీకు కలిగిన ఆత్మనూన్యత వల్ల పదేపదే నా పొడుగు గురించి మాట్లాడుతున్నావు. నేను తాటి చెట్టంత ఎదిగిన. నువ్వు వెంపలి చెట్టంత కూడా ఎదగలే. నిన్ను లిల్లీపుట్ అని నేను అనలేనా. సన్నాసి అని నేను అనలేనా.. నా ఎత్తు ఎంత ఉంటే ఎందుకు. ఇప్పటికీ 20 సార్లు మాట్లాడివ్ నా ఎత్తు గురించి’అని తీవ్రస్థాయిలో హరీశ్‌రావు ధ్వజమెత్తారు.రుణమాఫీ ఎక్కడ అయిందో చెప్పు...‘రుణమాఫీ పూర్తి చేశా అని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అబద్ధాలు చెప్పినవ్. రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తావా? కొండారెడ్డిపల్లి చౌరస్తా లేదా మా సిద్దిపేట వెంకటాపురం పోదామా? వెంకటాపురం గ్రామంలో 122 మంది ఉంటే.. 82 మందికి కాలేదు. రుణమాఫీ విషయంలో సీఎంకు, వ్యవసాయశాఖ మంత్రి మాటల మధ్య తేడాలున్నాయి. రెండు లక్షలపైన మిత్తి ఉంటే కట్టిన వాళ్ల లిస్ట్ పంపుతున్నానని, దమ్ముంటే వాళ్లకు మాఫీ చెయ్యి అని ఆ వివరాలు హరీశ్‌రావు వెల్లడించారు. -
గాందీభవన్ ఆదేశాలను పాటిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరంగా గాం«దీభవన్ నుంచి వచ్చే ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని, ముఖ్యమంత్రి సహా యావత్ మంత్రిమండలి ఇందుకు కట్టుబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ సభలో భట్టి మాట్లాడారు. సామాజిక న్యాయం జరిగేది కాంగ్రెస్ పారీ్టలోనేనని.. ఇందుకు మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే నిదర్శనమని పేర్కొన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ కారణంగానే పార్టీ అధికారంలోకి వచి్చందని.. కార్యకర్తలను సముచితంగా గౌరవిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యతలను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో ముందుకెళ్లాలి: దీపాదాస్మున్షీ పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకుని పనిచేయాలని కోరారు. మరింత బలోపేతం చేయాలి: ఉత్తమ్ కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పేందుకు మహేశ్‌గౌడ్ నియామకమే నిదర్శనమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తల శ్రమ, త్యాగాలతోనే తాము పదవుల్లో ఉన్నామని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి సీఎం పరామర్శ చిన్నచింతకుంట: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. మధుసూదన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో జరిగిన దశదినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. మధుసూదన్‌రెడ్డిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి జూపల్లి, చిన్నారెడ్డి, మల్లురవి ఉన్నారు.సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగు కలకలం బంజారాహిల్స్ (హైదరాబాద్): సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో ఆదివారం ఓ గుర్తుతెలియని బ్యాగు కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని రంగోలి స్టోర్ నుంచి సీఎం ఇంటికి వెళ్లేదారిలో ఈ బ్యాగును సీఎస్‌డబ్లూ (సిటీ సెక్యూరిటీ వింగ్) అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే వెళ్లి.. ఆ బ్యాగ్‌ను పరిశీలన కోసం అక్కడి నుంచి తరలించారు. ఇది సీఎం నిత్యం ప్రయాణించే మార్గం కావడం గమనార్హం. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని గుర్తించినట్లు పోలీసువర్గాలు చెప్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ప్రకటనా చేయకుండా గోప్యత పాటిస్తున్నారు. -
విమోచన దినంపై కాంగ్రెస్ వైఖరేంటి?: బండి సంజయ్
రసూల్‌పురా: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జై తెలంగాణ అని నినదించి ఇపుడు ఎందుకని విమోచన దినోత్సవం జరపడం లేదో సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిజాం నవాబు, రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన అమరవీరుల విశేషాలను తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు కేంద్ర సాంస్కృతిక, హోంశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తు న్నామని తెలిపారు.ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రతీ ఒక్కరు చూడాలని భావిత రాలకు నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆకృత్యాల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు, అవమానాలు పడ్డారో, ఏయే ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగాయో ఫొటో ఎగ్జిబిషన్ తెలియజేస్తుందని చెప్పారు. గతంలో ఉన్న రజాకార్ల దళం నేడు ఎంఐఎం పార్టీగా మారిందని అలాంటి దళాన్ని నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొగుడుతున్నారని విమర్శించారు.బీఆర్ఎస్ సమైక్యదినం అంటే కాంగ్రెస్ వాళ్లు ప్రజాపాలన అంటున్నారని ప్రజావంచన దినోత్సవం అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. పాఠ్యాంశాల్లో తెలంగాణచరిత్ర చేర్చాలన్న ఆలోచన త్వరలో ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్. చింతల రామచంద్రారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పీఎల్.శ్రీనివాస్ నగర నాయకులు పాల్గొన్నారు. -
మా జోలికొస్తే ఊరుకోం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లబోరని.. అలాగని ఎవరైనా తమ జోలికి వస్తే ఊరుకోబోమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాందీల వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాడొకడు వీడొకడు మోపైండు. కార్యకర్తలపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. కొందరు సన్నాసులు మన వాళ్ల ఇంటికి వస్తామన్నారు. కానీ మనవాళ్లే వాళ్ల ఇంటికి వెళ్లారు. ఇంటికి రమ్మన్నవాడికి చింతపండు అయినంక దాడికి వచ్చారని అంటున్నాడు. మరి ఇంటికి ఎందుకు రమ్మనాలి? .. .. డానికి పిలవాల్నా’’ అని పేర్కొన్నారు. తమ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని ఎవరైనా తమ జోలికి వస్తే.. వీపు చింతపండు అవుతుందని వ్యాఖ్యానించారు. పీసీసీ కొత్త అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సౌమ్యుడేనని.. కానీ ఆయన వెనుక తాను ఉన్నానని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలను కాపాడుకుంటామని.. పార్టీని, ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళతామని చెప్పారు. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం గాందీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పదేళ్లు అధికారంలో ఉంటాం.. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌పై పార్టీ గురుతర బాధ్యతను పెట్టిందని రేవంత్ అన్నారు. ‘‘మా ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మీ ఎన్నికలు రాబోతున్నాయి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో పార్టీ జెండా మోసిన కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యతలను నేను, మహేశ్‌గౌడ్ తీసుకుంటాం. మా ఎన్నికల కంటే ఎక్కువగా మీ ఎన్నికల కోసం పనిచేస్తాం. మీరు గెలిస్తేనే మేం గెలిచినట్టు, కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు. స్థానిక ఎన్నికల్లో విజయానికి పునరంకితమవుదాం’’అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూడు, నాలుగు నెలల్లో కులగణన పూర్తవుతుందని.. ఆ తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతాయని రేవంత్ చెప్పారు. గతంలో పదేళ్లు టీడీపీ, ఆ తర్వాత పదేళ్లు కాంగ్రెస్, మళ్లీ పదేళ్లు టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయని.. ఇదే పద్ధతిలో మరో పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పారు. ఆ ఎన్నికలు ఫైనల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సెమీఫైనల్స్‌లో లభించిన విజయం మాత్రమేనని సీఎం రేవంత్ అన్నారు. ‘‘2029లో ఫైనల్స్ జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఢిల్లీ గద్దెపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. మోదీని ఓడించి రాహుల్‌గాం«దీని ప్రధానిని చేయాలి. అప్పుడే మనం ఫైనల్స్‌లో గెలిచినట్టు. తెలంగాణ నుంచి ఆ ఎన్నికల్లో 15 మందిని కాంగ్రెస్ ఎంపీలుగా గెలిపించాలి. అప్పటివరకు ఎవరూ విశ్రమించొద్దు’’అని పిలుపునిచ్చారు. రాజీనామా చేస్తానన్న వ్యక్తి ఎక్కడ? తాను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఇంద్రవెల్లిలో సమరశంఖం పూరించానని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చేందుకు పనిచేశానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆరు గ్యారంటీల అమలు ప్రారంభించామన్నారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఒకేసారి రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశాం. కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న సన్నాసి ఎక్కడ? కావాలంటే వివరాలు పంపిస్తా..’’అని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పానని.. చెప్పినట్టుగానే ఇప్పటికే 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. దేశానికి ఒలింపిక్స్ బంగారు పతకం తెస్తాం! క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. 2028 ఒలింపిక్స్‌లో దేశం తరఫున బంగారు పతకాన్ని తెచ్చే బాధ్యతను తెలంగాణ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నేను పవర్ సెంటర్‌ను కాదు – సీఎం, మంత్రులు గాంధీభవన్‌కు రావాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇస్తుందనేందుకు తన నియామకమే నిదర్శనమని నూతన టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని అనుకోలేదని.. పార్టీ బాధ్యతలు చూడాల్సి వస్తుందని అప్పుడప్పుడూ రేవంత్‌రెడ్డి అంటుంటే ఊరికే అంటున్నారని భావించేవాడినని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా తనకెలాంటి భేషజాలు లేవని.. తాను పవర్ సెంటర్‌ను కానని చెప్పారు. తాను ప్రభుత్వానికి, పారీ్టకి మధ్య వారధిగా ఉంటానని.. తాను పీసీసీ అధ్యక్షుడిగా, రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం పార్టీ కార్యకర్తలపై గీత కూడా పడనీయమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు నిర్మించాలన్నదే తన లక్ష్యమని, ఆ దిశలో ప్రభుత్వం కూడా సహకారం అందించాలని కోరారు. మంత్రులు వారంలో రెండు రోజులు గాంధీ భవన్‌కు రావాలని.. జిల్లాలకు వెళ్లినప్పుడు జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని కోరారు. సీఎం రేవంత్ కూడా వీలును బట్టి నెలకు రెండు సార్లయినా గాం«దీభవన్‌కు వచ్చి వెళ్లాలన్నారు. దీనివల్ల పార్టీ శ్రేణులతో మమేకం కావొచ్చన్నారు. సౌమ్యుడినేగానీ.. కరాటే బ్లాక్ బెల్ట్ ఉంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని.. సోషల్ మీడియాను సోషల్సెన్స్ లేకుండా ఉపయోగించుకుంటున్నాయని మహేశ్‌గౌడ్ విమర్శించారు. వాటిని ఎదుర్కోవాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని, గ్రామగ్రామానికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని పిలుపునిచ్చారు. తనను సౌమ్యుడని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. ప్రజాస్వామ్యంలో తాను సౌమ్యుడినే అయినా కరాటేలో బ్లాక్‌బెల్ట్ ఉందని చమత్కరించారు. గాందీభవన్‌లో ‘లాల్ సలామ్’! టీపీసీసీ కొత్త చీఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కమ్యూనిస్టుల తరహాలో ‘లాల్‌సలామ్’ వినిపించడం ఆసక్తిగా మారింది. ప్రజాగాయకుడు గద్దర్‌కు నివాళి అరి్పస్తూ సాగిన పాటలో ‘లాల్‌సలామ్’ అనే చరణం ఉంది. ఇది విని కొందరు కాంగ్రెస్ ఆఫీసులో కమ్యూనిస్టు పాట అంటూ చమత్కరించారు. – పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ప్రసంగిస్తున్న సమయంలోనే మంత్రి శ్రీధర్‌బాబు వేదిక మీదకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలికిన మహేశ్‌గౌడ్.. ‘అయ్యగారు వచ్చారు. ఆయన రాకతో మంత్రిమండలి సంపూర్ణంగా వచ్చినట్టయింది..’ అని వ్యాఖ్యానించారు. – సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ వేదికపైకి వచ్చినప్పుడు.. తొలి వరుసలో కూర్చున్న మంత్రి పొన్నం ప్రభాకర్ లేచి, వీహెచ్‌కు తన స్థానం ఇచ్చి వెనుక వరుసలోకి వెళ్లి కూర్చున్నారు. – సభలో ఎవరెవరు మాట్లాడాలనే విషయంలో గందరగోళం లేకుండా స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆ జాబితాను రాసి ఇచ్చారు. పెళ్లి ముహూర్తం పెట్టిన అయ్యగారితోనే.. మహేశ్‌కుమార్‌గౌడ్ తన పెళ్లికి ముహూర్తం పెట్టిన పురోహితుడితోనే పీసీసీ అధ్యక్ష బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పూజలు చేయించారు. ఆయన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన పూజారి కృష్ణమాచార్యులు. ఆయన, గాంధీభవన్ పూజారి శ్రీనివాసమూర్తి ఇద్దరూ కలిసి పూజలు చేశారు. ఇక గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, తన అడుగుపడని మిల్లీమీటర్ స్థలం కూడా గాందీభవన్‌లో లేదని.. ప్రతి గోడ, కిటికీ, తలుపును తాను తాకానని మహేశ్‌గౌడ్ గుర్తు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తన తొలి ప్రసంగంతోనే కార్యకర్తలను ఆకట్టుకున్నారు. సౌమ్యుడిని అంటూనే కరాటేలో బ్లాక్‌బెల్ట్ ఉందన్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం కోసం మంత్రులు తరచూ గాంధీభవన్‌కు, జిల్లా కార్యాలయాలకు రావాలని కోరారు. రేవంత్ నుంచి జెండా అందుకుని.. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు మహేశ్‌గౌడ్ హైదరాబాద్‌లోని నార్సింగి నుంచి భారీ ర్యాలీగా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం గాందీభవన్‌కు చేరుకుని.. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్నారు. సభా ప్రాంగణంలో రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పార్టీ జెండాను అందుకున్నారు. -
రేవంత్‌ను తిట్టడం ఎంతసేపు.. హరీష్ చురకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా సీఎం రేవంత్, హరీష్ మధ్య మాటల దాడి జరుగుతోంది. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సీఎంను తిట్టడం ఎంతసేపు అంటూ కౌంటరిచ్చారు.కాగా, సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. ఈ క్రమంలో హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. నా గురించి ఆలోచించడం మాని.. ప్రజల గురించి ఆలోచించండి. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పిందెవరు?. నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేసిందెవరు?. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది మీరు కాదా?. ఎక్కడ దాక్కున్నావు అని నన్ను ప్రశ్నిస్తున్నారు.. నేను రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోయాను.రేవంత్ ఈరోజు గాంధీభవన్‌లో చెప్పినవన్నీ అబద్ధాలే. తెలంగాణలో రుణమాఫీ జరగలేదనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి సొంతరూ కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ జరిగిందా?. దీనిపై చర్చించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమా?. నేను నీకు సర్వే పంపిస్తా చూసుకో. సురేందర్ రెడ్డి ఆత్మహత్య ప్రభుత్వం హత్యే. రుణమాఫీ జరిగి ఉంటే సురేందర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. రుణమాఫీ పూర్తిగా జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదు.నాలుగు వేల పెన్షన్ ఇస్తామని మోసం చేసింది మీరు కాదా?. రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశావ్. రైతులకు బోనస్ ఇస్తా అంటూ బోగస్ చేసిన సన్నాసివి నువ్వు కాదా?. రెండు లక్షలపైన ఉండే రైతులు వెంటనే రుణం కట్టండి మాఫీ చేస్తా అని సీఎం అంటాడు. వ్యవసాయ మంత్రి లోన్ కట్టకండి అని అంటారు. వ్యవసాయ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్‌కు మధ్య సమన్వయమే లేదు.ఇంత కాలం ఓపిక పట్టాం.. మర్యాదకు కూడా హద్దు ఉంటుంది. రేవంత్‌ను సన్నాసి అని నేను అనలేనా?. సీఎం పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సీఎం కుర్చీకి మాత్రమే మర్యాద ఇస్తున్నాం. కాంగ్రెస్ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. వారి మధ్య వారికే సమన్వయం లేదు. కౌశిక్ రెడ్డి, గాంధీ విషయంలో కాంగ్రెస్ నేతలకే క్లారిటీ లేదు. మా వాళ్లే కౌశిక్ ఇంటికి వెళ్లారని రేవంత్ అంటున్నారు. ముందు మీ సంగతి చూసుకోండి అంటూ చురకలంటిచారు. ఇదే సమయంలో ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్ రియల్ ఎస్టేట్‌వ్యాపారం చేస్తున్నాడు. ఫార్మా భూములపై కన్నేసి ఏదో చేయాలని చూస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే.. -
కౌశిక్ రెడ్డి ఎపిసోడ్.. సీఎం రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి దాడుల ఎపిసోడ్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు ఎవరి జోలికి వెళ్లారు.. అదే సమయంలో ఎవరైనా మా వాళ్ల జోలికి వస్తే ఊరుకోరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటాను. మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడు.. ఏం కాదు అనుకోకండి. మహేష్ గౌడ్ వెనుక నేను ఉంటాను. మా వాళ్లు ఎవరి జోలికి పోరు.. ఎవరైనా వస్తే ఊరుకోరు. రా చూసుకుందామని కౌశిక్ రెడ్డి ఎందుకు సవాల్ చేశాడు. వెళ్లి వీపు పగలకొడితే.. కొట్టారు అంటారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా అంశాన్ని సీఎం రేవంత్ మళ్లీ తెరపైకి తెచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అని నిరూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేశాం. ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. రూ.2లక్షలు మాఫీ చేస్తామని చెప్పి.. చేసి చూపించాం. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.రూ.2లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామన్నారు. రైతు రుణమాఫీపై ఆనాడు హామీ ఇచ్చాం.. అమలు చేసి చూపించాం. రాజీనామా సవాల్ చేసిన వాళ్లు ఎక్కడికి పోయారు. రాజీనామా చేయకుండా ఎక్కడ దాకున్నారు. రుణమాఫీ అయిన రైతుల వివరాలు హరీష్‌రావుకు పంపిస్తాం. మొన్నటి గెలుపు సెమీ ఫైనల్ మాత్రమే. 2029లో ఫైనల్స్ ఉన్నాయి. మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘మీ కంటే పాలన మాకే బాగా తెలుసు’: కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్ -
ఓటుకు నోటు కేసు.. కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పొలిటికల్ కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే కదా ఓటుకు నోటు కేసు నమోదు చేసి విచారణ పూర్తి చేయలేకపోయింది. ఇది మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.కాగా, బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా..‘ఓటుకు నోటు కేసు నమోదు చేసి విచారణ పూర్తి చేయలేకపోయింది గత మీ ప్రభుత్వమే కేటీఆర్. 2015 నుంచి కేసును పూర్తి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ట్విట్టర్లో స్టార్ డం కోసం కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని లాగుతున్నారు. మీరు నిజంగా న్యాయం జరగాలని కోరుకుంటే ఓటుకు నోటు కేసును సీబీఐకి లేదా ఈడీకి బదిలీ చేసి ఉండాల్సింది. కేటీఆర్ వ్యవహారం రాహుల్ గాంధీ లేని లోటు భర్తీ చేస్తున్నట్లు ఉంది’ అంటూ ఎద్దేవా చేశారు. Welcome Home K T Rama Rao garu..Jet Lag & whatever you had seems to be taking toll on you..ACB registered the Cash for vote case, and your inefficient BRS govt couldn't defend it for years.Since 2015, your incompetent govt has failed to finish the trial. Now, for optics…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 15, 2024ఇదిలా ఉండగా.. అంతకుముందు బండి సంజయ్‌పై కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ‘బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్‌ను జైల్లో వేసేవాళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డి లాగా గుంజుకుపోయేటోళ్లం’ అంటూ బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్..‘బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా కేసీఆర్ గారిని జైల్లో పెట్టడం పట్ల మీకున్న అత్యుత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఓటుకు నోటు స్కామ్‌లో కెమెరాకు చిక్కిన వ్యక్తి ఇప్పటికీ స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడో చెప్పండి! మీరు ప్రశ్నించలేదు. బహుశా బడే భాయ్ (ప్రధాని మోదీ), ఛోటే భాయ్ (సీఎం రేవంత్) మధ్య సంబంధాన్ని మీరు ఇంకొంచెం ఎక్కువగా దర్యాప్తు చేయాలేమో కదా?. కొన్నేళ్లుగా అన్ని సాక్ష్యాలు స్పష్టంగా బయటకు కనిపిస్తున్నప్పటికీ ఛోటే భాయ్ ఎందుకు జైలులో లేడు!. ఇన్నాళ్లూ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాదా?. మిమ్మల్ని ఆపేది ఏది? ఎవరు? అంటూ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు -
సీఎం, మంత్రులకు టీపీసీసీ చీఫ్ కొత్త రూల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్ టీపీసీసీ బాధ్యతలను మహేష్ కుమార్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా, గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ బాధ్యతలకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘నేను పీసీసీ అధ్యక్షుడు అయినా కార్యకర్తగానే ఉంటాను. ఇద్దరు విభిన్నమైన వ్యక్తులతో కలిసి పని చేశాను ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకరు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నాయకులు అందరినీ కో-ఆర్డినేట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది అందరూ కలిసి పని చేస్తున్నారు.నాకు గాంధీ భవన్‌తో 40 ఏళ్ల అనుబంధం ఉంది. నేను పీసీపీ చీఫ్ అవుతానని అనుకోలేదు. నాకు ఇన్నీ రోజులు పదవి ఎందుకు రాలేదు? అని ఎప్పుడు అనుకోలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. అందుకే నాకు ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు పీసీసీ పదవి వచ్చింది. నాకు భేషజాలు లేవు. గాంధీ భవన్లో పవర్ సెంటర్లు లేవు. ఒక్కటే పవర్ సెంటర్ రాహుల్ గాంధీ పవర్ సెంటర్. ప్రతీ రోజు గాంధీ భవన్లో ఆరు గంటలు ఉంటాను. ప్రతీ వారం ఒక ఇద్దరు మంత్రులు గాంధీ భవన్‌కు రావాలి. బుధవారం ఒకరు.. శుక్రవారం మరో మంత్రి అందుబాటులో ఉండాలి. నెలకు ఒకసారి సీఎం కూడా గాంధీభవన్‌కు రావాలి.కౌశిక్ రెడ్డి వాడిన భాష వలన గాంధీ అనుచరులు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక భాష మారిపోయింది. కేసీఆర్‌కు భాషకు రేవంత్ కూడా తన భాషతోనే సమాధానం చెప్పాడు. అందుకే మనం అధికారంలోకి వచ్చాము. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాను సోషల్ సెన్స్ లేకుండా వాడుతున్నారు అంటూ విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అని నిరూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేశాం. ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. రూ.2లక్షలు మాఫీ చేస్తామని చెప్పి.. చేసి చూపించాం. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.రూ.2లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామన్నారు. రైతు రుణమాఫీపై ఆనాడు హామీ ఇచ్చాం.. అమలు చేసి చూపించాం. రాజీనామా సవాల్ చేసిన వాళ్లు ఎక్కడికి పోయారు. రాజీనామా చేయకుండా ఎక్కడ దాకున్నారు. రుణమాఫీ అయిన రైతుల వివరాలు హరీష్‌రావుకు పంపిస్తాం. మొన్నటి గెలుపు సెమీ ఫైనల్ మాత్రమే. 2029లో ఫైనల్స్ ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు రాబోతుంది. ఆర్ఆర్ఆర్ కోసం ప్రధాని మోదీని కలిసాం. ముచ్చర్లలో ఫోర్త్ సిటీ రాబోతుంది. అక్కడ అద్భుతమైన సిటీని నిర్మించబోతున్నాం అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రతీ ఇంటికీ తీసుకెళ్లే బాధ్యత కొత్త పీసీసీపై ఉంది. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాం. పార్టీలో క్రమశిక్షణ ఉంటే కొంచం ఆలస్యమైనా పదవులు వస్తాయి. పార్టీలో చాలా మందికి ప్రభుత్వంలో అవకాశం కల్పించాం. ఇంకా మరికొందరికి కూడా అవకాశం ఇస్తాం అని చెప్పుకొచ్చారు. -
కేటీఆర్ ట్వీట్.. మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
సాక్షి, పెద్దపల్లి జిల్లా: ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోందంటూ కేటీఆర్ ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ‘‘ఎమ్మెల్యే అరికెపూడి గాంధీయే తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్టు మేము తలదూర్చం’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.‘‘మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరు పరిష్కరించుకోవాలి. మా పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలే.. వారందరినీ గౌరవిస్తాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం’’ అని శ్రీధర్‌బాబు చెప్పారు.‘‘రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచడానికి అందరూ పాలుపంచుకోవాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరు ఏం చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు’’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు