breaking news
-
17 సీట్లు.. 306 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్‌లో లోక్‌సభ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ల కోసం టీపీసీసీ దరఖాస్తులను ఆహ్వానించగా గడువు ముగిసే సమయానికి 306 దరఖాస్తులు వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. తొలి రెండు రోజుల్లో 41 దరఖాస్తులు రాగా శుక్రవారం 100 దరఖాస్తులు, శనివారం ఏకంగా 165 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, నల్లగొండ స్థానాలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. శనివారం దరఖాస్తు చేసుకున్న ప్రముఖుల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ (ఖమ్మం), చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ, రేవంత్‌రెడ్డి సన్నిహితుడు పటేల్ రమేశ్‌రెడ్డి (నల్లగొండ), టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ (భువనగిరి), రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు పిడమర్తి రవి (వరంగల్), టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు (మెదక్), సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం (కరీంనగర్) తదితరులున్నారు. బరిలోకి బంధుగణం.. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న లోక్‌సభ స్థానాలకు పార్టీలోని ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా స్థానాల్లో మంత్రులు, ఇతర ముఖ్య నేతల బంధువులు, వారి సన్నిహితులు రంగంలోకి దిగారు. దరఖాస్తుదారుల్లో గడ్డం వంశీ, ఊట్ల వరప్రసాద్, గోమాస శ్రీనివాస్, పెరిక శ్యామ్ (పెద్దపల్లి), సిరిసిల్ల రాజయ్య, మోత్కుపల్లి నర్సింహులు, సర్వే సత్యనారాయణ, నమిండ్ల శ్రీనివాస్ (వరంగల్), మల్లు రవి, ఎస్. సంపత్‌కుమార్ (నాగర్‌కర్నూల్), కుందూరు రఘువీర్, పటేల్ రమేశ్‌రెడ్డి (నల్లగొండ), చామల కిరణ్, కోమటిరెడ్డి పవన్, కుంభం కీర్తిరెడ్డి, చనగాని దయాకర్, పున్నా కైలాశ్‌నేత (భువనగిరి), జగ్గారెడ్డి, సోమేశ్వరరెడ్డి (మెదక్), బండ్ల గణేశ్, దిలీప్ కుమార్, హరివర్ధన్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి), బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ (మహబూబాబాద్), వి. హనుమంతరావు, రేణుకాచౌదరి, మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, వి.వి. రాజేంద్రప్రసాద్ (ఖమ్మం) ఉన్నారు. దరఖాస్తుల గడువు ముగియడంతో ఈ నెల 6లోగా టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశమై వాటిని షార్ట్‌లిస్టు చేస్తుందని, ఆ జాబితాను ఏఐసీసీ నియమించిన తెలంగాణ స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తుందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. -
హామీలు నెరవేర్చకుంటే ప్రజాఉద్యమమే
కూకట్పల్లి/సుభాష్ నగర్: మోసపూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను నెరవేర్చకుండా పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ హామీల అమలు కోసం తాము 100 రోజులపాటు వేచి చూస్తామని, అప్పటికీ హామీలను నెరవేర్చకపోతే ప్రజాఉద్యమం చేపడతామని హెచ్చరించారు. శనివారం కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంతోపాటు మేడ్చల్–మల్కాజిగిరి పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెల్లో రైతులు, పట్టణాల్లో ప్రజలు సంతోషంగా లేరని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేడాది డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తగినన్ని బస్సులు లేకుండా పథకం అమలు చేయడం వల్ల బస్సుల్లో ప్రయాణించే వారు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ పథకం వల్ల ఆటోడ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటివరకు 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రతి నెలా రూ. 10 వేల ఆర్థిక సాయం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓటమితో కుంగిపోవద్దు.. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని... అందుకు కార్యకర్తలు నిరాశ చెంద వద్దని కేటీఆర్ చెప్పారు. స్థానికంగా వార్డు సభ్యుల నుంచి మొదలుకొని ఎంపీల వరకు మనవాళ్లే ఉన్నారని... ఏదైనా సమస్యలుంటే వారిని కలవాలని భరోసా ఇచ్చారు. పార్లమెంటులో తెలంగాణ, హైదరాబాద్ హక్కులు, రాష్ట్రాభివృద్ధి కోసం మాట్లాడే ధైర్యం ఒక్క గులాబీ పార్టీకే ఉందని... అందుకే కాంగ్రెస్, బీజేపీలను నమ్మకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కూకట్పల్లి నియోజకవర్గ పార్టీ కో–ఆర్డినేటర్ సతీష్ అరోరా, నిజాంపేట్ మేయర్, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడటానికి సీఎంకు భయమెందుకు? సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించట్లేదని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ‘తెలంగాణ గెట్స్ జీరో ఇన్ యూనియన్ బడ్జెట్’అంటూ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తన వ్యాఖ్యలతోపాటు జత చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు పణంగా పెడుతున్నారని నిలదీశారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని ఎదిరించేది ప్రాంతీయ పార్టీలేదేశంలో బీజేపీని అడ్డుకొనే శక్తి కేవలం ప్రాంతీయ రాజకీయ పార్టీలకే ఉందంటూ కేటీఆర్ ‘ఎక్స్’లో మరో పోస్ట్ చేశారు. బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 300 చోట్ల పోటీచేసినా కాంగ్రెస్‌కు 40 సీట్లు రావడం అనుమానమేనంటూ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నా రు. కాంగ్రెస్ వ్యవహారశైలి వల్లే విపక్ష ఇండి యా కూటమి చెల్లాచెదురవుతోందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండె: కేటీఆర్‌తో వృద్ధురాలు కేసీఆర్ పాలనే బాగుండేదని.. పింఛన్ సొమ్ము సకాలంలో వచ్చేదంటూ ఓ వృద్ధురాలు కేటీఆర్‌తో పేర్కొంది. శనివారం కుత్బుల్లాపూర్‌లో జరిగిన కూకట్పల్లి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. వారి సంభాషణ సాగింది ఇలా.. వృద్ధురాలు: మాకు కేసీఆర్ ఉన్నపుడే బాగుండె.. టయానికి పింఛన్ ఒస్తుండె. కరెంటు పోకుండా ఉంటుండె. ఇప్పుడు ఊకే కరెంటు పోతాంది. ఈ ప్రభుత్వం తీరు ఏం అర్థమైతలే.. మాకు కేసీఆరే బాగుండే.. మళ్లీ ఆయన వస్తేనే మంచిగుంటది. కేటీఆర్: మళ్లీ అదే పాలనను తప్పకుండా తెచ్చుకుందాం. ఇప్పు డు ‘విడాకులు’ కావాల్నంటే ఐదేళ్లు ఓపిక పట్టాలి అమ్మా. -
విలీన పాపం బీజేపీ, కాంగ్రెస్‌దే..
భద్రాచలం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపిన పాపం బీజేపీ, కాంగ్రెస్‌లదేనని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, పినపాక నియోజకవర్గం మణుగూరులో శనివారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. బీజేపీతో కాంగ్రెస్‌పార్టీ చీకటి దోస్తీ చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే తెలంగాణలో ఇచ్చి న హామీలను నెరవేరుస్తామని ఆ పార్టీ పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలో ఒక్కో పార్టీ చేజారుతున్నందున రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్ర«ధాని కాలేరన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ చేసిన మోసాన్ని గమనించిన ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హరీశ్ పేర్కొన్నారు. తప్పుడు అప్పుల లెక్కలతో అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు.. ఈ రెండు నెలల కాలంలోనే రూ.14 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఫిబ్రవరిలో జాబ్ కేలండర్ ప్రకటించకుండా మాట తప్పిన కాంగ్రెస్ పార్టీపై పోలీసుస్టేషన్లో కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సాగర్ నీటిలో 50 శాతం కోసం బీఆర్ఎస్ పోరాడితే, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఢిల్లీలో తాకట్టుపెట్టిందని మండిపడ్డారు. ఆరు లక్షల మంది ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని తెలిపారు. ఆటో డ్రైవర్లు అత్మహత్య చేసుకున్నందున ఇకనైనా వారి విషయంలో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం రేసులో డిప్యూటీ సీఎం భార్య.. ఎంపీ టికెట్‌కు దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం నుంచి సోనియాగాంధీ, ప్రియాంకను పోటీ చేయాలని కోరామన్నారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని.. వారు పోటీ చేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు ఆమె తెలిపారు. దాదాపు 20 ఏళ్లుగా ఖమ్మం ప్రజలతో కలిసి పనిచేస్తున్నామని, వారి ఒత్తిడి మేరకే ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని, తెలంగాణలో అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్త చేశారు. దేశంలో రాహుల్ ప్రధాని కావడం ఖాయమని నందిని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని పలు లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇదీ చదవండి: టీ కాంగ్రెస్‌లో ఒక్క ఛాన్స్ ప్లీజ్! -
టీ కాంగ్రెస్‌లో ఒక్క ఛాన్స్ ప్లీజ్!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. ఉన్న 17 లోక్‌సభ స్థానాల కోసం.. మొత్తం 306 దరఖాస్తులు గాంధీభవన్‌కు వచ్చాయి. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో తక్కువగా వచ్చాయి. నిన్న(శుక్రవారం) ఒక్కరోజే 100కిపైగా అప్లికేషన్లు రాగా.. దరఖాస్తులు ఇచ్చిన వాళ్లలో నేతలతో పాటు ప్రొఫెసర్లు, పలువురు ఉన్నతాధికారులు సైతం ఉండడం గమనార్హం. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ముఖ్యంగా కీలక నేతలు అసెంబ్లీకి బదిలీ కావడంతో.. వాళ్ల స్థానాల్లో పోటీకి బంధువులు, సన్నిహితులు ఆసక్తి చూపిస్తున్నారు. భువనగిరి ఎంపీ సీటు కోసం కోమటిరెడ్డి బంధువులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి అన్న కొడుకు పవన్, బంధువు చల్లూరి మురళీధర్ అప్లికేషన్లు సమర్పించారు. రేవంత్ సీఎం కావడంతో ఖాళీ అయిన మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో పాటు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఉన్నారు. అలాగే.. రేవంత్ సన్నిహితుడు పటేల్ రమేష్ రెడ్డి, చామలచకిరణ్లు సైతం దరఖాస్తులు సమర్పించారు. ఇక నల్గొండ సీటు కోసం జానారెడ్డి కొడుకు రఘువీర్ దరఖాస్తు ఇచ్చారు. మహబూబాబాద్ సీటు కోసం తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ భట్టు అప్లికేషన్ సమర్పించడం గమనార్హం. దరఖాస్తులు ఇచ్చినవాళ్లలో.. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ (నాగర్‌కర్నూల్), ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, విద్యా స్రవంతి (సికింద్రాబాద్) పెరిక శ్యామ్ (పెద్దపల్లి) తదితరులున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మల్కాజ్‌గిరితో పాటు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ కోసం మొత్తంగా నాలుగు దరఖాస్తులు అందజేశారు. హాట్ సీటు ఏదంటే.. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున హాట్‌సీట్‌గా మారింది ఖమ్మం లోక్‌సభ స్థానం. రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, పలువురు దరఖాస్తులు ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, వీ హనుమంతరావులు సైతం అప్లికేషన్లు ఇచ్చారు. తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్‌లు సైతం దరఖాస్తు చేసుకున్నారు. హాట్ టాపిక్‌గా గడల ఖమ్మంతో పాటు సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కూడా గడల శ్రీనివాస్ దరఖాస్తు చేశారు. గతంలో హెల్త్ డైరెక్టర్‌గా ఉండి.. అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకెక్కిన గడల.. కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. రేవంత్ సర్కార్ కొలువుదీరిన వెంటనే గడలను ఆ పోస్టు నుంచి బదిలీ చేసినా.. లాంగ్‌లీవ్‌లో ఉండి మరీ ఆయన సన్నిహితుల ద్వారా గాంధీభవన్‌కు దరఖాస్తు పంపించడం గమనార్హం. -
కల్వకుంట్ల కవితపై బండ్ల గణేష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?.. పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశావంటూ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మండిపడ్డారు. ఎప్పుడైనా బీసీల గురించి మీరు మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్.. ఆపార్టీని విమర్శించొద్దు. సీఎం ప్రజల్లోకి వెళితే మీకు ఇష్టం ఉండదు. గేటు బయటే ఆపేసి బతికున్న గద్దర్‌ను చంపేశారు. ఆయన పేరుమీద కాంగ్రెస్ అవార్డులు ఇస్తుంది. జానారెడ్డి తప్పుకుని కుమారుడికి అవకాశం ఇచ్చారు. మంత్రులను డమ్మీలను చేసింది మీరు కాదా ?. లిక్కర్ స్కాంలో అక్రమ సంపాదన చేయలేదా ?’’ అని బండ్ల గణేష్ ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాంతో రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసింది మీరు కాదా ?. బీసీల కోసం మీ త్యాగం అవసరం లేదు. ఎంపీగా ఓడిపోతే ఏడ్చి ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. మీ పార్టీ ఆఫీసుకు స్థలం ఇస్తే కొండా లక్ష్మణ్ బాపూజీని మీరు పట్టించుకున్నారా ? సీఎం కావాలని మీరు.. కేటీఆర్ ఆశపడ్డారు. అది సాధ్యం కాలేదని.. ఇప్పుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ముందు లిక్కర్ స్కాం నుంచి బయటపడండి. రెస్ట్ తీసుకోండి...ఏం తప్పు చేశారో తెలుసుకోండి. ప్రెస్ మీట్లు బంద్ చేయండి.. అసహ్యించుకుంటున్నారు’’ అంటూ బండ్ల గణేష్ విమర్శించారు. జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?... పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశావు కవితమ్మ..? -- కాంగ్రెస్ నేత సినీనిర్మాత, బండ్ల గణేష్ Did you remember now to put up a statue of Jyoti Rao Phule? Kavitha, what did you do after being in the government for ten years?… pic.twitter.com/tMaGTOeYbi — Congress for Telangana (@Congress4TS) February 3, 2024 -
కాంగ్రెస్‌పై దేశద్రోహం పెట్టాలి: బండి సంజయ్ ఫైర్
సాక్షి, కరీంనగర్: బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. అద్వానీకి భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై దేశద్రోహం పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దేశంలో ఎమర్జెన్సీ, అయోధ్య పోరాటంలో పాల్గొన్న అద్వానీకి భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉంది. అన్ని సర్వేల్లో బీజేపీ, ప్రధాని మోదీనే మళ్లీ గెలుస్తారు అని రిపోర్టులు రావడం చూసి బీఆర్ఎస్ నాయకులు కంగారు పడుతున్నారు. బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల కోసం చేసిన సర్వే రిపోర్టు నా దగ్గరకి వచ్చింది. కాంగ్రెస్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి. దేశాన్ని విభజించాలి అంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. టెర్రరిస్టులు, ఉగ్రవాదులు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు సపోర్టు చేస్తున్నారు. ఇండియా కూటమి విచ్చినం అవుతుందన్న ఆందోళనతో వారు ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ కూడా ఇలా మాట్లాడిన చరిత్ర ఉంది. అవార్డులను అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ హయాంలో పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు కావాలంటే డబ్బులు ఇస్తే వచ్చేవి. కానీ, సమాజంలో నిజమైన అర్హులకు మాత్రమే బీజేపీ అవార్డులను ఇస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీజేపీని అడ్డుకునే శక్తి వారికి మాత్రమే ఉంది: కేటీఆర్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లే ఇండియా కూటమి చెల్లాచెదురవుతోందని దుయ్యబట్టారు. ఇది, బీజేపీకే లాభం అంటూ కామెంట్స్ చేశారు. కాగా, తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేటీఆర్..‘కాంగ్రెస్ పార్టీకి డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ కాంగ్రెస్ పార్టీపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. I completely concur with Didi. Congress should introspect on how its attitude has resulted in implosion of the proposed INDIA alliance Instead of taking on the BJP in UP & Gujarat (where it is a direct face-off) and making something out of it, Congress ends up playing spoiler… https://t.co/7WSIgBlRtG — KTR (@KTRBRS) February 3, 2024 గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతోంది. దీంతో బీజేపీకి లాభం చేకూరుతుంది. ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. నిజానికి బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉంది. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే దేశంలో బీజేపీని అడ్డుకోగలరు. బీజేపీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రియాంక గాంధీ వస్తే నిరసన చేపడతాం: ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ నాయకులను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. పార్టీ సభ కోసం ప్రభుత్వ నిధులను ఎలా ఖర్చు చేస్తారు. 60 రోజుల్లో కాంగ్రెస్ చేసింది ఏమిటి? అని డిమాండ్ చేశారు. కాగా, ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద, జాగృతిపైనా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు నాపై చేశాడు. పార్టీ సభకు ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారు. అధికారికంగా హెలికాప్టర్ వేసుకొని వెళ్లి పార్టీ సభ పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఎలా పిలుస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని పిలిస్తే నిరసన తెలియజేస్తాం. వేదిక, కుర్చీలు, లైట్లు పెట్టినందుకు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా?. ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత?. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ నిత్యం ఢిల్లీకి ప్రత్యేక విమానం, చార్టెడ్ ఫ్లైట్స్‌లో వెళ్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ఖర్చుతోనే వెళ్తున్నారు కదా?. జై సోనియా అంటున్నారు కానీ.. జై తెలంగాణ అనే మాట రేవంత్ రెడ్డి నోటి నుంచి రాలేదు. కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. సీఎం సోదరులు జిల్లా రివ్యూల్లో ఎలా పాల్గొంటారు. 60 రోజుల్లో ఒకే ఒకరోజు ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ సీఎం అని పిలుస్తున్నారు. మలి దశ ఉద్యమంలో అమరులైన అమరులకు కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ ఒక్కరోజు కూడా అమరులకు నివాళులు అర్పించలేదు. ఒక్క అమరవీరుడి కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. మాది కుటుంబ పార్టీ అంటున్న రేవంత్, కాంగ్రెస్ నేతలు.. హస్తం పార్టీలోని 22 కుటుంబాలకు ఎమ్మెల్యే టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, వారి కుటుంబ సభ్యుల వివరాలను చదివి వినిపించారు. -
బీఆర్ఎస్కు తాటికొండ రాజయ్య గుడ్‌బై
సాక్షి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన గులాబీ పార్టీకి.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య శనివారం రాజీనామా చేశారు. అయితే వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించిన రాజయ్యకు.. పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. రాజయ్యకు ఎంపీ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చి.. మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫాం అందించింది. ఈ ఎన్నికల్లో కడియం శ్రీహరి విజయం కూడా సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అయితే ముందుగా మాటిచ్చిన పార్లమెంట్ స్థానంపై బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎలాంటి భరోసా రాకపోవడంతో రాజయ్య అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే రోజుల్లో కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూసింది. కానీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు ఊహించని షాక్ ఇవ్వడంతో కేవలం ప్రతిపక్షానికి పరిమితమైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయినా అత్యధిక సీట్లు గెలుచుకోవాలని యత్నిస్తోంది. ఇందుకు తగ్గట్లే అధికార కాంగ్రెస్విపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య పార్టీని వీడటం.. ఆ పార్టీకి షాక్‌గానే చెప్పవచ్చు. చదవండి: కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసు.. ఆశావహుల్లో టెన్షన్! -
కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసు.. ఆశావహుల్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ స్థానాలకు టికెట్ల దరఖాస్తులకు నేడే చివరి రోజు. ఈరోజు సాయంత్రం వరకు ఆశావహుల నుండి హస్తం పార్టీ అప్లికేషన్లను స్వీకరించనుంది. ఇప్పటి వరకు 17 స్థానాలకు గాను 140 మంది అప్లికేషన్స్ దాఖలు చేసుకున్నారు. ఇక, అప్లికేషన్స్ ఇవ్వడానికి నేడు చివరిరోజు కావడంతో నిన్న(శుక్రవారం) భారీగా దరఖాస్తులు అందాయి. ఆశావహులు వందకుపైగా అప్లికేషన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎంపీ టికెట్ల కోసం ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు. దరఖాస్తులకు చివరి రోజు కావడంతో నేడు పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. ఖమ్మం కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలో చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. మాజీ సీనియర్లు, కీలక నేతల కుటుంబ సభ్యులు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి టికెట్ రేసులో ఉన్నారు. కాగా, ఈరోజు ఖమ్మంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీస్ నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మల్లు నందిని వెళ్లనున్నారు. మల్లు నందినికే టికెట్ ఇవ్వాలని విక్రమార్క్ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఖమ్మం ఎంపీ స్థానంలో సోనియా గాంధీ పోటీ చేయకపోతే.. అక్కడ తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ప్రకటించారు. దీంతో, ఖమ్మం అభ్యర్థి ఎవరు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. -
కాంగ్రెస్‌కు ఓటెందుకు వేయాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ఆ హామీల ఊసేలేదని ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారని చెప్పడానికి కాంగ్రెస్ మేనిఫెస్టోనే నిదర్శనమన్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే ఏప్రిల్ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండే అవకాశముందని కాబట్టి ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు డబ్బులను వెంటనే జమ చేయాలని కోరారు. ప్రభుత్వాలను కూల్చే చరిత్ర కాంగ్రెస్‌దేనని, రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దినదినగండంగా ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే ఫిబ్రవరి 1న గ్రూప్ –1 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని ఆ తేదీ గడిచినా కనీసం నోటిఫికేషన్ కూడా వేయలేదని మండిపడ్డారు. గ్రూప్ 1 ఉద్యోగాలతోపాటు గ్రూప్ 2 నియామకాలకు కూడా వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మంచి పథకమే అయినప్పటికీ దానివల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని వెంటనే వారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి దానిని అమలు చేయకపోవడమంటే ఆ పవిత్ర గ్రంథాన్ని చిత్తుకాగితంగా పరిగణిస్తున్నట్లేనని విమర్శించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ దోపిడీ చేశాయి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, బీఆర్ఎస్లు రాష్ట్రాన్ని, దేశాన్ని దోపిడీ చేశాయని కేంద్రమంత్రి బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ది అవినీతి, అక్రమాల చరిత్ర అని..అందుకే దేశ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని బహిష్కరించేందుకు సిద్ధమయ్యారన్నా రు. కాంగ్రెస్ పాలనలో సమస్యలు పరిష్కారమవుతాయనే విశ్వాసం ప్రజలకు లేదన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి సమక్షంలో ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అంకిరెడ్డి సుదీర్‌రెడ్డి, బొల్లపు సురేందర్‌రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర శాఖ డైరీని కూడా కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 1న ఉద్యోగ నోటిఫికేషన్ ఏదీ? ఫిబ్రవరి 1న తెలంగాణ నిరుద్యోగ యువత కోసం గ్రూప్–1 నోటిఫికేషన్ ప్రకటిస్తామన్న హామీ ఏమైందని జి.కిషన్‌రెడి ఓ ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విధంగా కాంగ్రెస్ మరోసారి తన నిజస్వరూపం బయటపెట్టుకుందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. -
కర్ణాటకలో కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్నారు
సాక్షి, యాదాద్రి: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని, అక్కడి 25 ఎంపీ సీట్లలో 4,5 మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని, ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయని, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్షని చెప్పా రు. భువనగిరిలో శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు(కేఆర్ఎంబీకి) అప్పగించ డం వల్ల నల్లగొండ జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా ఈనెల 1న గ్రూప్–1 నోటిఫికేషన్ ఎందుకివ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మేమే పూర్తిచేశాం నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్లు మాత్రమే ఇచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. రైతుబంధు డబ్బులు పడటం లేదని ప్రశ్నిస్తే రైతులను చెప్పుతో కొట్టాలనడం ఏం సంస్కారం అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య సంబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ దు్రష్పచారం చేసిందని మండిపడ్డారు. రైతుబంధు, పింఛన్, రుణమాఫీ, కరెంట్, ఉద్యోగాలు, వడ్లకు బోనస్ వంటి హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు. ఈ అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్‌ను ముట్టుకుంటే ఏం జరుగుతుందో చూడాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. సమావేశంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎంతో మందిని చూశాం.. నువ్వెంత?
ఘట్కేసర్/సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యకర్తల వెన్నంటే ఉంటామని, రాష్ట్రంలో ఎవరికి అన్యా యం జరిగినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలం అండగా నిలుస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల్లో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ విజయోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేమని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారని అన్నారు. రుణమాఫీ కోసం రైతులు, ప్రత్యేక బస్సుల కోసం పురుషులు ఎదురు చూస్తున్నారని, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ‘మూడు ఫీట్లు లేనోడు కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను వంద ఫీట్ల లోతులో బొందపెడతాడట, ఇటువంటి తీస్మార్ ఖాన్‌లను ఎంతో మందిని చూశాం, ఈయన ఎంత’అని అన్నారు. ఇండియా కూటమి ఖాళీ.. ఇండియా కూటమిలో ప్రస్తుతం ఎవరూ లేరని మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్, కేజ్రీవాల్, కేరళలో సీపీఎం వాళ్లు వెళ్లిపోయారని, అఖిలేశ్‌యాదవ్ తన దారి తాను చూసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత ఆ కూటమిలో చివరికి రాహుల్ గాంధీ ఒక్కరే మిగులుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదని, ఇప్పుడు ఆ పార్టీ ఉన్న పరిస్థితిలో గతంలో ఉన్న 50, 55 ఎంపీ సీట్లు కూడా గెలుచుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్‌కు లేదు కేంద్రంలోని బీజేపీ సర్కారును ఆపే సత్తా కాంగ్రెస్‌కు లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు జీవనాధారమైన కృష్ణా, గోదావరి జలాల వాటాలు తేల్చే సమయం ప్రధాని మోదీకి లేదని, మరో పక్క సీఎం రేవంత్‌రెడ్డి కృష్ణా జలాలపై బోర్డుకు హక్కులు కల్పిస్తూ తెలంగాణను ఢిల్లీలో తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా, చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత భద్రారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 6956 స్టాఫ్ నర్సు పోస్టులు, 15,750 పోలీసు కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ ఘనత తమదేనని చెప్పుకుంటూ ప్రజలను పిచ్చోళ్లను చేస్తోందని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల భర్తీతో కాంగ్రెస్ పారీ్టకి ఏమాత్రం సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఈ పోస్టులను మంజూరు చేసి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఫలితాలు ప్రకటించి, ఉద్యోగ నియామకాలు చేపట్టే సమయంలో దురదృష్టవశాత్తు ఎన్నికల నియమావళి రావడంతో ప్రక్రియ ఆగిపోయిందని ‘ఎక్స్’వేదికగా వెల్లడించారు. అసత్యాలు చెప్పడం కాంగ్రెస్‌కు ఇదే తొలిసారి కాదు.. చివరిసారి కూడా కాదని తారకరామారావు అన్నారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు డిమాండ్ చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు మీ వల్ల ఇవాళ రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలకు గిరాకీ లేక కుటుంబాల పోషణ భారంకావడంతో 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే.. పరిస్థితి ఎంత చేజారిందో అర్థమవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఓ గిరిజన ఆటోడ్రైవర్ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ఆటోను తగలబెట్టుకున్న సంఘటనతో ప్రతి ఒక్కరి గుండె బరువెక్కిందని విచారం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని, కానీ ఇప్పటి వరకు స్పందన లేదని ఆరోపించారు. ఆటో డ్రైవర్లకు ప్రతినెలా రూ.10 వేల లెక్కన ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల సమ స్యలు పరిష్కరించకపోతే ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లతో కలసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రభుత్వం మెడలు వంచి ఆటోడ్రైవర్లకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. -
మన లక్ష్యం బీజేపీ విముక్త్ భారత్
సాక్షి, హైదరాబాద్: ‘పదేళ్ల బీజేపీ పాలనలో అన్ని వ్యవస్థలు విచ్చిన్నమయ్యాయి..మరోసారి కేంద్రంలో మోదీకి అధికారం ఇస్తే దేశం విధ్వంసమవుతుంది. బీజేపీ విముక్త్ భారత్ మన లక్ష్యం. ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలి’అని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించడానికే ఇండియా కూటమిలో చేరి ఉద్యమిస్తున్నట్టు ఆయన వివరించారు. మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో భాగంగా శుక్రవారం తొలిరోజు సమావేశంలో డి.రాజా ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యదేశంలో అధ్యక్షతరహా పాలన సాగించేందుకు మోదీ ఒకే దేశం.ఒకే ఎన్నిక అనే నినాదం తెరపైకి తీసుకొస్తున్నారన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేలా ప్రజలను చైతన్యపరచాలని చెప్పారు. మరోసారి మోదీకి అధికారం కట్టబెడితే దేశ భవిష్యత్ ఆందోళనకరంగా మారుతుందని వ్యాఖ్యానించారు. దేశాన్ని రక్షించేందుకు ‘దేశ్ బచావో.. బీజేపీ హఠావో’అని ఇండియా కూటమి నినాదం ఇచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యాంగానికి అనుగుణంగా లౌకిక, ప్రజాస్వామ్య విలువలతో పనిచేసే పారీ్టలు గెలవాలని ఆకాంక్షించారు. భారత్ ప్రజస్వామిక దేశంగా ఉంటుందా..లౌకిక గ్రణతంత్రంగా కొనసాగుతుందా? లేదా ఫాసిస్టు, నియంతృత్వ దేశంగా ఉండబోతుందా? అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్నారు. బీజేపీని ఎలా గద్దె దించాలో లౌకిక, ప్రజాతంత్ర పారీ్టలు, శక్తులు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య ఫాసిస్టు, నియంతృత్వ వ్యవస్థ తీసుకొస్తోందన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే మోదీ సర్కారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపె ట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పేదల కోసం ఎలాంటి ప్రకటనలు చేయలేదని, కార్పొరేట్ సంస్థలకు విధించే పన్నులను 32 శాతం నుంచి 27 శాతానికి తగ్గించారని డి.రాజా అన్నారు. తద్వారా మోదీ ప్రభుత్వం ఎవరి పక్షపాతి అనేది స్పష్టమైందని.. సబ్‌కాసాత్ సబ్కా వికాస్ అన్నా, వాస్తవ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మోదీ పాలనలో యువత భవిష్యత్ అంధకారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని మోదీ చెబుతున్నారని, అంతర్జాతీయ ఆక లి సూచీలో 125 దేశాల మధ్య భారతదేశం 111వ స్థానంలో ఉండడం ఏమిటని ప్రశ్నించారు. మోదీ, గాందీల రాముడు వేర్వేరు బీజేపీ రాముడి పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని, మోదీ చెప్పే రాముడు, గాంధీ చెప్పే రాముడికి తేడా ఉందన్నారు. మోదీ హయాంలో మతతత్వ రాజ్యంగా మారుస్తున్నారని, రాజ్యాంగాన్ని, అందులోని మౌలిక సిద్ధాంతాలు, ప్రజాస్వామ్యం, లౌకికవ్యవస్థను కాలరాస్తోందని విమర్శించారు. గత పార్లమెంట్ సమావేశాలలో ఎంతమంది ఎంపీలను సస్పెండ్ చేశారో అందరికీ తెలుసున్నారు. ప్రజాస్వామ్యం ఉన్నతమైనదని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పార్లమెంటు కళ్లలాంటివని, అలాంటి ప్రతిపక్ష సభ్యులను గత పార్లమెంట్ సమావేశంలో సస్పెండ్ చేశారని విమర్శించారు. పార్లమెంట్లో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుందని, పార్లమెంట్ పని చేయకపోతే ప్రజాస్వామ్యం మరణిస్తుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పాడన్నారు. సమావేశాలకు రామకృష్ణ పాండా, కూనంనేని సాంబశివరావు, నిషా సిద్ధూలు అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నారు. -
ఒక్కరోజే వంద దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మేరకు పార్టీకి శుక్రవారం ఒక్కరోజే వంద దరఖాస్తులు అందాయి. శుక్రవారం గాం«దీభవన్‌కు వచ్చిన పలువురు నేతలు తమ దరఖాస్తులను అందజేశారు. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ దర ఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో తక్కువగా వచ్చా యి. దరఖాస్తు చేసుకున్న వారిలో సినీ నిర్మాత బండ్ల గణేశ్ (మల్కాజిగిరి), మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ (నాగర్‌కర్నూల్), ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, విద్యా స్రవంతి (సికింద్రాబాద్) పెరిక శ్యామ్ (పెద్దపల్లి) తదితరులున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌తో పాటు జనరల్ స్థానమైన మల్కాజిగిరి కోసం 4 దరఖాస్తులు అందజేశారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఇప్పటివరకు 141 దరఖాస్తులు రాగా, శనివారం సాయంత్రంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఖమ్మం బరిలో గడల, వంకాయలపాటి హాట్‌సీట్‌గా మారిన ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టికెట్ కోసం శుక్రవారం ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్‌లు దరఖాస్తు చేసు కున్నారు. గడల సికింద్రాబాద్ స్థానానికి కూడా దర ఖాస్తు చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉండి, అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకెక్కిన గడల.. అప్పట్లో కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఇటీవలే రేవంత్ ప్రభుత్వం గడలను ఆ పోస్టు నుంచి బదిలీ చేసింది. ప్రస్తుతం లాంగ్‌లీవ్‌లో ఉన్న ఆయన ఉన్నట్టుండి గాం«దీభవన్‌లో దరఖాస్తులివ్వడం గమనార్హం. మెజార్టీ స్థానాలు గెలుస్తాం: బండ్ల గణేశ్ మల్కాజిగిరి స్థానం నుంచి పోటీకి అవకాశం కల్పించాలని కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు దరఖాస్తు ఇచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్ ..విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్నారు. -
కాంగ్రెస్‌వి బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. భూములకు సంబంధించిన లావాదేవీల విషయంలో బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు డబ్బులు సమకూర్చడానికి బిల్డర్లు, భూ వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని విమర్శించారు. అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతి మంత్రులపై చర్యలు తీసుకుంటామన్న రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. రాష్ట్రపార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ నేతలు డీకే అరుణ, పి.మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి,పైడి రాకేష్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసినందుకు, వికసిత భారత్ సాకారం చేయడానికి వీలుగా బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. హామీల అమలుపై క్లారిటీ లేదు ‘తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక రోడ్‌మ్యాప్ లేదు. ఇచి్చన హామీల అమలుపై క్లారిటీ ఇవ్వడం లేదు. పార్లమెంట్ ఎన్నికల వరకు కాలయాపన చేసే ప్రయత్నం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ బూత్ స్థాయిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన లోపాలను సరి చేసుకోవాలి. గ్రామ స్థాయిలో నిత్యం కొత్తగా చేరికలు ప్రోత్సహించాలి. ఫిబ్రవరి మొత్తం చేరికల కోసం కేటాయించాలి..’అని కిషన్‌రెడ్డి సూచించారు. 17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారా? తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని కాంగ్రెస్ నేతలు మాయ మాటలు చెబుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగానే కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పదాధికారుల భేటీ తర్వాత నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు , ఇతరనాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ ఇచి్చన కార్యక్రమాల్ని కింది స్థాయి వరకు తీసుకెళ్ళేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై భేటీలో చర్చించామని అరుణ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 10 నుండి 12 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక బిజీబిజీ పదాధికారుల సమావేశంలో నిర్ణయించిన మేరకు రాష్ట్ర పార్టీ నాయకులు లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో బిజీబిజీ కానున్నారు. ఈ నెలలో 17 ఎంపీ సీట్ల పరిధిలో బీజేపీ ‘విజయసంకల్ప రథ (బస్సు)యాత్రలు’నిర్వహించనున్నారు. 5వ తేదీ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుపుతారు. 5 నుండి 8 వరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో బాగంగా కార్యకర్తలు తమకు కేటాయించిన గ్రామంలో 24 గంటల పాటు ఉంటారు. అక్కడ ప్రజలతో మమేకం అవుతారు. 4 ,5, 6 తేదీల్లో పార్లమెంట్ ప్రవాసీ యోజన ఉంటుంది. 18 నుండి 24 వరకు నారీ శక్తి వందన్ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబి్ధదారుల సమ్మేళనాలు, ప్రతి పార్లమెంట్, అసెంబ్లీలో ఎన్నికల కార్యాలయాల ఏర్పాటు ఉంటాయి. నో మొబైల్స్! పార్టీ అంతర్గత సమావేశాల్లో ముఖ్యనేతలు చెబుతున్న విషయాలపై దృష్టి పెట్టకుండా నేతలు సెల్ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారంటూ.. శుక్రవారం నాటి పదాధికారుల భేటీకి మొబైళ్లను అనుమతించలేదని తెలిసింది. సెల్ఫోన్లు అన్నీ ఒకచోట డిపాజిట్ చేశాకే నేతలను సమావేశ మందిరంలోకి అనుమతించినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. -
రాంచీ టు శామీర్‌పేట
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్‌కు చేరింది. మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపయ్ సోరెన్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉండడంతో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్ పార్టీలకు చెందిన 41 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంప్‌కు తరలించారు. రాంచీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రత్యేక విమానంలో బయలుదేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు నేరుగా బేగంపేట విమానాశ్రయంలో దిగారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌లు వారికి ఆహ్వనం పలికి రెండు ప్రత్యేక బస్సుల్లో శామీర్‌పేటలోని ఓ రిసార్టుకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఈ ముగ్గురు నేతలు ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. బలపరీక్ష జరిగేవరకు ఇక్కడే.. జార్ఖండ్‌లో పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ నేతలు బుధవారమే సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర టీపీసీసీ ముఖ్యులతో టచ్‌లోకి వచ్చారు. ఎమ్మెల్యేలను క్యాంపు కోసం హైదరాబాద్‌కు తీసుకువస్తామనే సమాచారం అందించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నమే వీరు హైదరాబాద్‌కు రావాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో శుక్రవారానికి వాయిదా పడింది. కాగా ఏఐసీసీ నేతలు ఆదేశాల మేరకు టీపీసీసీ వీరి క్యాంపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మాజీ జెడ్పీటీసీ నక్కా ప్రభాకర్‌గౌడ్ పేరిట శామీర్‌పేట రిసార్ట్స్‌లో 38 రూంలు వీరి కోసం బుక్ చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేలంతా మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఈనెల ఐదో తేదీన జార్ఖండ్ అసెంబ్లీలో చంపయ్ సోరేన్ బలనిరూపణ జరగనున్న నేపథ్యంలో అదేరోజు ఉదయం లేదంటే ముందు రోజు అర్ధరాత్రి వారు ప్రత్యేక విమానంలో రాంచీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. శిబిరానికి సీఎం రేవంత్! శుక్రవారం ఇంద్రవెల్లి పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఈ ముగ్గురు నేతలతో సంప్రదింపులు జరిపారని, ఆయన కూడా క్యాంపునకు వెళ్లి జార్ఖండ్ ఎమ్మెల్యేలను కలుస్తారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఎమ్మెల్యేలు సురక్షితంగా ఉంటారన్న ఆలోచనతో వారిని హైదరాబాద్‌కు తరలించాలని ఏఐసీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా క్యాంపు నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను టీపీసీసీ పూర్తి చేసింది. శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు రిస్టార్టుకు వెళ్ళారు. -
ప్రజా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే..ప్రజలు ఊరుకోరు!
అలా చేస్తే ఊర్లలోకి రానిస్తరా? ‘‘ఈ మధ్య కొందరు మాట్లాడుతున్నరు. మూడు నెలలు, ఆరు నెలల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. నీ అయ్యా.. ఎవడు పడగొట్టేటోడు.. మా యువకులు వేలాది మంది ఇక్కడ ఉన్నారు. పడగొడితే వారంతా చూస్తూ ఊరుకుంటరా? ఊర్లలోకి రానిస్తరా? ఎవడైనా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే.. మీ ఊర్ల వేపచెట్టుకు కట్టేసి కొట్టండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇదేమైనా మీరు దోపిడీ చేసిన లక్ష కోట్ల కాళేశ్వరం కూలినట్టు అనుకున్నరా? ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరు’’ సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని, త్వరలోనే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని కొందరు మాట్లాడుతున్నారని.. ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణను కొల్లగొట్టి విధ్వంసం చేశారని.. తాము పునర్నిరి్మంచే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పదిహేను రోజుల్లో కానిస్టేబుల్ నియామకాలను చేపడతామని ప్రకటించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పునర్నిర్మాణ సభ నిర్వహించింది. సీఎం రేవంత్ ఇందులో పాల్గొని మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణను కొల్లగొట్టి విధ్వంస రాష్ట్రంగా మార్చారు. కేసీఆర్ తన సొంత కుటుంబ సభ్యుల కోసమే తప్ప ఏనాడూ ప్రజల కోసం ఆలోచించలేదు. మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. నాడు ఇంద్రవెల్లి సాక్షిగా సమరశంఖం పూరించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. అందుకే అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతం నుంచే ప్రారంభిస్తున్నాం. మళ్లీ ఇదే ఇంద్రవెల్లి సాక్షిగా పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తాం. గత పదేళ్ల పాలనలో ఏనాడైనా అడవి బిడ్డల గురించి, ఇంద్రవెల్లి అమరుల కుటుంబాల గురించి ఆలోచించారా? గూడేలు, తండాలకు నిజంగా నీళ్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు మేం రూ.65 కోట్లతో ఇంద్రవెల్లిలో పనులు మొదలుపెట్టాల్సి వచ్చేదా? ప్రగతిభవన్ వద్ద నాడు గద్దర్‌ను నిరీక్షించేలా చేసిన కేసీఆర్‌కు ఉసురు తగిలింది. మోదీ దగ్గర గులాంగిరీ.. దేశంలో రెండే కూటములు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది ఎంపీ సీట్లను గెలిస్తే.. కేసీఆర్ వాటిని ఢిల్లీలో తాకట్టు పెట్టి మోదీ దగ్గర గులాంగిరీ చేశారు. ఇప్పుడు మోదీ, కేడీ ఒక్కటై ముందుకొస్తున్నారు. మతం పేరిట బీజేపీ, మద్యంతో కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించాలి. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలి. నాటి ఘటనకు క్షమాపణ చెప్తున్నా.. 1981 ఏప్రిల్‌లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇంద్రవెల్లి పోరాటకారులను కాల్చి చంపి, ఇప్పుడు నివాళులు అరి్పస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. నాటి సీమాంధ్ర పాలకుల కారణంగా ఆ ఘటన జరిగింది. దానిపట్ల నేను క్షమాపణ చెప్తున్నాను. ఆదివాసీలను గుండెల్లో పెట్టి చూసుకుంటాం..’’ అని రేవంత్ పేర్కొన్నారు. ధరణితో కోల్పోయిన భూములను అప్పగిస్తాం: భట్టి అటవీప్రాంతాల్లోని గిరిజనులకు నీటి వనరులను అందుబాటులోకి తెస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. ధరణి ద్వారా కోల్పోయిన భూములను గోండు గిరిజనులకు తిరిగి అప్పగిస్తామని ప్రకటించారు. సీఎం కార్యక్రమాల్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగర్‌రావు, వినోద్, వివేక్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వీహెచ్, మల్లురవి, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు. నాగోబాకు పూజలు చేసి.. మహిళలతో భేటీ.. ఇంద్రవెల్లి పర్యటన సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు, నేతలు నివాళి అర్పించారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్లస్థలాల పట్టాలు అందజేశారు. ఇక్కడి కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మెప్మా, వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా నాగోబా దర్బార్ హాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం రేవంత్ ముఖాముఖి నిర్వహించారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల స్కూల్ యూనిఫారాలు కుట్టే అవకాశాన్ని మహిళా సంఘాలకు ఇస్తామని హామీ ఇచ్చారు. -
4న తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది. 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన ప్రభుత్వం.. ఆదివారం జరగనున్న సమావేశంలో మరో రెండు గ్యారెంటీలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: జన్మలో కేసీఆర్ మళ్లీ సీఎం కాలేరు: సీఎం రేవంత్‌రెడ్డి -
ఎంపీ టికెట్ల కోసం బండ్ల, గడల దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తుల్లో ఇవాళ ఆసక్తికరమైన పరిణామాలు కనిపించాయి. నటుడు కమ్ సినీ నిర్మాత, కాంగ్రెస్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఎంపీ సీటు కోసం దరఖాస్తు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. రేవంత్ రెడ్డి ఖాళీ చేసిన స్థానం కోసమే ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక.. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ ఏకంగా నాలుగు సీట్లకు నాలుగు దరఖాస్తులు సమర్పించారు. మరోవైపు నాగర్‌కర్నూల్ టికెట్ కోసం మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమార్తె చంద్రప్రియ కూడా అప్లికేషన్ సమర్పించారు. కేసీఆర్ కాళ్లు మొక్కి.. ఇదిలా ఉంటే.. గాంధీభవన్‌లో ఇవాళ సమర్పించిన దరఖాస్తుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసిన అంశం.. గడల శ్రీనివాసరావు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే రాజకీయాంశాలతో చర్చనీయాంశంగా మారారాయన. సీఎంగా ఉన్న కేసీఆర్ కాళ్లు కూడా మొక్కుతూ వార్తల్లోకి ఎక్కారు కూడా. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డారాయన. ఇప్పుడు.. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకుని మరోసారి ఆయన హాట్ టాపిక్‌గా మారారు. తన సన్నిహితుల ద్వారా గాంధీ భవన్ లో దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికల్లో పోటీ చేయకుండానే.. జంప్ జిలానీగా గడల మారినట్లు చర్చ నడుస్తోంది. -
హైదరాబాద్‌లో ‘రిసార్ట్’ పాలిటిక్స్.. జాలీగా జార్ఖండ్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. రాంచి బిర్సా ముండా ఎయిర్‌పోర్టు నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు మొత్తం 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వారిని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్స్‌కు తరలించారు. జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష తేదీ ఖరారయ్యే వరకు హైదరాబాద్ క్యాంపులో జార్ఖండ్ కాంగ్రెస్ జేఎంఎం ఎమ్మెల్యేలు ఉండనున్నారు. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్‌కు ఏఐసీసీ అప్పగించింది. కాగా, నిన్న మధ్యాహ్నం నుంచే జార్ఖండ్ రాజకీయ అలజడి ప్రారంభం కాగా, హైదరాబాద్‌లో గురువారం రాత్రే జడ్పీటీసీ నక్కా ప్రభాకర్‌గౌడ్ పేరిట రూమ్‌లు బుక్ అయ్యాయి. హైదరాబాద్ క్యాంపునకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకోవడంతో ఇంద్రవెల్లి పర్యటన నుంచే ఎప్పటికప్పుడు రేవంత్ టచ్‌లో ఉన్నారు. రాత్రికి జార్ఖండ్ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణం -
త్వరలోనే వారి బండారం బయటపెడతా: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ హయాంలో సిటీ చుట్టూ పక్కల భూముల చేతులు మారాయని, వాటి మీద సమగ్ర విచారణ జరగాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ది అక్రమాల చరిత్ర అని, అందుకే ఒకటి, రెండు రాష్ట్రాలకు పరిమితం అయ్యిందన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తే అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా లేదంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ అవసరం లేదని.. గత పదేళ్లలో అభివృద్ధికి బదులు ప్రజల ఆత్మ గౌరవాన్ని బీఆర్ఎస్ దెబ్బ తీసిందని దుయ్యబట్టారు. దేశ అబివృద్ధి కోసం బీజేపీ లో చేరాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి వారి బండారం బయట పెడతామన్నారు. మేము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పీసీ సెక్రెటరీ గా ఉన్న అంకిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఫిబ్రవరి మొత్తం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీలో చేరికలు ఉంటాయి. చేరికలకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాం. కేసీఆర్ కుటుంబం మీద కోపంతో కాంగ్రెస్‌కి ఓటేశారు. కాంగ్రెస్ గెలవలేదు .. బీఆర్ఎస్ను ఓడించారు. కాంగ్రెస్ గెలిచిన సమస్యలు పరిష్కారం కావు’’ అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. పార్టీని వీడనున్న మర్రి జనార్దన్‌రెడ్డి? -
రేవంత్లాంటోళ్లను కేసీఆర్ చాలామందినే చూశారు: కేటీఆర్
సాక్షి, మేడ్చల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి మండిపడ్డారు. బీఆర్ఎస్ను బొందపెడతామని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని.. అలాంటి వాళ్ళను చాలా మందినే చూశామని అన్నారు. ఘట్కేసర్లో శుక్రవారం నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రేవంత్ లాంటి బుడ్డర్ ఖాన్‌లను కేసీఆర్ ఎంతోమందని చూశారు. ఎంతోమంది తీస్మార్ ఖాన్‌లను మాయం చేసి తెలంగాణా తెచ్చారు కేసీఆర్. పార్టీ కార్యకర్తలు ఎవరికి అన్యాయం జరిగిన అందరం బస్ వేసుకొని వస్తాం. మా బాస్‌లు ఢిల్లీలో లేరు. గుజరాత్‌లోనూ లేరు. లంకె బిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారు. సెక్రటేరియట్లో కంప్యూటర్లు, జీవోలు ఉంటాయి.. లంకె బిందెలు ఉండవు. లంకెబిందెల కోసం వెదికేది ఎవరో ప్రజలకు తెలుసు. ప్రతి ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాడుతాం.’ అని కేటీఆర్ అన్నారు. ‘2 లక్షల అప్పు తెచ్చుకోండి. నేను మాఫీ చేస్తా అన్నారు. ఇప్పుడు ఆ హామీ ఎటుపోయింది. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు. వాటికోసం కోటి 57 లక్షల మంది ఆడబిడ్డలు వేచి చూస్తున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల కడుపు కొట్టారు. కడుపు కాలిన ఆటోడ్రైవర్ ప్రజాభవన్ ముందు ఆటో కాలబెట్టాడు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రంలో బీజేపీని అడ్డుకోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని మండిపడ్డారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, ఆరు గ్యారంటీలు అమలు చేసేది లేదని అన్నారు. కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని దుయ్యబట్టారు. మల్లారెడ్డిని ఢీ కొట్టలేరు మేడ్చల్‌లో మల్లారెడ్డితో పోటీ పడే పరిస్థితి ఎవరికీ లేదని అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు మల్లారెడ్డి అని తెలిపారు. 420 హామీలు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణ మాట ఢిల్లీలో వినబడాలి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలన్నారు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలేనని.. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలన్నారు. చదవండి: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. మర్రి జనార్దన్‌రెడ్డి రాజీనామా?