breaking news
-
ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చేశారు.. ప్రధాని మోదీ
సాక్షి,నాగర్‌కర్నూల్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించకముందే దేశ ప్రజలు తీర్పు ఇచ్చేశారని, మూడోసారి మోదీయే ప్రధాని అని నిర్ణయించారని ప్రధాని అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చార్సౌ పార్( నాలుగు వందలు దాటి) అని నినదిస్తున్నారన్నారు. సభలో మోదీ మాట్లాడుతూ ‘ నిన్న(మార్చ్15) మల్కాజ్గిరి రోడ్ షోలో నిన్న జన ప్రవాహాన్ని చూశాను. యువకులు, మహిళలు, వృద్ధులు చాలా మంది రోడ్ల మీద నిల్చొని బీజేపీకి మద్దతు తెలిపారు. మల్కాజ్‌గిరిలో అద్భుతం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలపుడు బీఆర్ఎస్ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చూశాను. మోదీని మూడోసారి ప్రధాని చేయడానికి ఇప్పుడు అంతే ఉత్సాహంతో వేచి చూస్తున్నారు. గత పదేళ్లలో కేంద్ర పథాకాలు తెలంగాణ ప్రజలకు చేరకుండా అవినీతి, అబద్ధాల కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డుకున్నాయి. ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ అంబేద్కర్‌ను ఓడించింది. గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఓడించాలని చూశారు. కాంగ్రెస్ తెలంగాణలో ఎస్సీ వర్గానికి చెందిన ప్రస్తుత డిప్యూటీ సీఎంను కూడా ఇప్పుడు అవమానిస్తోంది. కాంగ్రెస్ నేతలు పైన కూర్చుంటారు. ఎస్సీ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెడతారు. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ బాటలో వెళ్లే పార్టీనే. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్ అని పిలుస్తారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి మోదీ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంది. కానీ పదేళ్లలో తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నలిగిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజల కలలను చిన్నాభిన్నం చేశారు. ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీలు గెలిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఆటలు సాగవు. ఇందుకే ఇక్కడ బీజేపీ ఎంపీలు గెలవాల్సి ఉంది. తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఎంపీలుంటే నేను మీకు చాలా సేవ చేయడానికి వీలవుతుంది. ఎక్కువ మంది ఎంపీలు గెలిస్తే మీ ఆకాంక్ష ఢిల్లీలో నాకు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓట్లు రెండింతలు చేశారు. ఈసారి బీజేపీకి రెండంకెల ఎంపీ సీట్లివ్వండి. నా ప్రసంగాలు ఎక్స్(ట్విటర్)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో తెలుగులో వినండి. కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాడు. అంబేద్కర్‌ను అవమానిస్తున్నాడు. దళితబంధుతో కేసీఆర్ దళితులను మోసం చేశాడు. బీఆర్ఎస్ దళితున్ని సీఎం చేస్తానని చేయలేదు. కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ స్కాముల్లో భాగస్వాములు, కాంగ్రెస్ 2జీ కుంభకోణం చేస్తే బీఆర్ఎస్ నీటి పారుదల ప్రాజెక్టులో అవినీతి చేసింది. రాష్ట్రం బయటికి వెళ్లి అవినీతి పార్టీలతో కలిసి అవినీతి చేశారు. ఈ నిజాలు రోజు మన ముందు బయటపడుతూనే ఉన్నాయి. మోదీ మీ దగ్గర ఓటు తీసుకుని కుటుంబ సభ్యులకు కుర్చీ ఇవ్వడు. వారి బ్యాంకు బ్యాలెన్సులు పెంచడు.140 కోట్ల మంది మోదీ కుటుంబ సభ్యులే. మోదీ కుర్చీలో కూర్చొని సుఖ పడడు. చాలా కాలం సీఎంగా, ఇప్పుడు పీఎంగా నాకు సేవ చేసే అవకాశమిచ్చారు. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నేను నా కోసం వాడుకోలేదు. నేను ఏమైనా చేశానంటే, రాత్రి పగలు కష్టపడ్డానంటే 140 కోట్ల మంది ప్రజల కోసమే. ఇందుకే మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ పూర్తి చేసే గ్యారెంటీ. ఆర్టికల్ 370 రద్దు చేస్తామంటే చేశాం. రాముడు సొంతింటికి వస్తాడని చెప్పాం. వచ్చాడు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అగ్రభాగంలో నిలిపాం. ఇది మోదీ గ్యారెంటీ . తెలంగాణలో పేదల కోసం ఒక కోటి బ్యాంకు ఖాతాలు తెరిచాం. తెలంగాణలో 1 కోటి 50 లక్షల మందికి బీమా చేశాం. తెలంగాణలో 67 లక్షల కంటే చిన్న వ్యాపారులకు ముద్ర రుణాలు వచ్చాయి. 80 లక్షల కంటే ఎక్కువ మందికి ఆయుష్మాన్ భారత్ లబ్ధి చేకూరింది. తెలంగాణ ప్రజలకు నేను మాటిస్తున్నాను. ఒక్క అవినీతి పరున్ని వదలను. అవినీతిపై పోరాడేందుకు నాకు ఆశీర్వాదం ఇవ్వండి. నాగర్‌కర్నూల్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించండి’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ సభలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్, నల్గొండ, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు. -
తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: ప్రధాని మోదీ
Live Updates.. బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్న మోదీ ప్రసంగం... తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: మోదీ గత పదేళ్ల తెలంగాణ అభివృద్దికి ఎన్డీయే ప్రభుత్వం కృషి చేసింది తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధ్వంసం చేశాయి మల్కాజ్‌గిరిలో ప్రజల అద్భుత స్పందన చూశాను వేగవంతమైన అభివృద్ధి కూడా తెలంగాణలో తీసుకురావాలి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తెలంగాణ అభివృద్దికి అడ్డుగా మారాయి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతి పాల్పడింది తెలంగాణను గేట్‌వే ఆఫ్ సౌత్ అంటారు ఏడు దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకోవటం మినహా కాంగ్రెస్ ఏం చేయలేదు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించాలి 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం ఈసారి 400 సీట్లు ఎన్డీయేకు రాబోతున్నాయి గరీబీ హఠావో నినాదం కాంగ్రెస్‌వాళ్లు ఇచ్చారు. కానీ, పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. 87 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కింద లబ్ది పొందారు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది బీజేపీనే దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది కేంద్ర పథకాలతో అట్టడుగు వర్గాలకు ఎంతో మేలు జరిగింది ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేశాం రాజ్యాంగాన్ని మారుస్తామని అంబేద్కర్‌ను కేసీఆర్ అవమానించారు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అడుగు జాడల్లోనే నడుస్తోంది కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లి లిక్కర్ కేసులో అవినీతికి పాల్పడ్డ చరిత్ర కేసీఆర్ కుటుంబానిది. కేసీఆర్ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోంది. గ్యారెంటీల పేరతో కాంగ్రెస్ గారడీలు చేస్తోంది. నేడు యువత, ప్రజలు, మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో దోచుకుంది సరిపోక ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దోచుకున్నారు. ►నాగర్ కర్నూల్ చేరుకున్న ప్రధాని మోదీ. కాసేపట్లో బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొననున్న మోదీ. ►బేగంపేట్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ.. ►ప్రధాని మోదీ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ పాల్గొననున్నారు. ►కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా జిల్లాలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ►శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భారీ రోడ్డుషోలో పాల్గొన్నారు. రాత్రి వరకు ఈరోడ్డు షో కొనసాగింది. ►అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకొని మోదీ అక్కడే బస చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ కర్నూల్‌కు మోదీ వెళ్లనున్నారు. అక్కడ వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు. ►ఈ బహిరంగ సభలో కృష్ణా క్లస్టర్ పరిధిలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ లోక్ సభ స్థానాల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థులతోపాటు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోనున్నారు. -
కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన జితేందర్, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకు ముందు జితేందర్‌తో పాటు మిథున్‌రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానానికి తమ రాజీనామా లేఖలు పంపారు. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే జితేందర్‌రెడ్డికి కేబినెట్ మంత్రి హోదాతో కూడిన రెండు పదవులు లభించాయి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. బండిని తప్పించడంతోనే తిరోగమనం..: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండగా పార్టీ రాష్ట్రం బలం పుంజుకుని రాజకీయశక్తిగా ఎదిగిందని మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వం మార్పు జరిగాక బీజేపీకి తీవ్రంగా నష్టం జరిగిందని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లలో గెలవాల్సిందిపోయి 8 స్థానాలకే పరిమితమైందని తెలిపా రు. బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాకు పంపించిన రాజీనామా లేఖలో ఆయా అంశాలను ప్రస్తావించారు. తనకు బీజేపీలో ఇన్నాళ్లూ పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జేపీనడ్డాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ వల్ల కాదు
సాక్షి, హైదరాబాద్: ‘ బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అన్నారు. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేసే సత్తా అమిత్ షాకు లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా సాధ్యం కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంజాన్ ఉప వాస దీక్షల సందర్భంగా శుక్రవారం మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ‘మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగుశాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎంతో మంది న్యాయ నిపుణులతో చర్చించి రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు అన్ని రంగాల్లో అవకాశాలను మెరుగుపర్చాం. అదనపు అడ్వొకేట్ జనరల్, మైనారిటీ సలహాదారు, ముఖ్యమంత్రి కార్యాలయం, వక్ఫ్‌బోర్డు చైర్మన్, టీఎస్పీఎస్సీ సభ్యుడిగా మైనారిటీలను నియమించాం. మైనారిటీల సంక్షేమానికి మా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఒక యూని వర్సిటీకి వీసీగా మైనారిటీలకు అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాతబస్తీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిజానికి అది ఓల్డ్ సిటీ కాదు..ఒరిజినల్ సిటీ..అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మైనారిటీ గురుకులాలకు అత్యాధునిక హంగులతో శాశ్వత భవనాలను నిర్మిస్తాం. ప్రభుత్వ ఉద్యోగ నియామ కాల ప్రక్రియ ఎల్బీస్టేడియం వేదికగా నిర్వహి స్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది ఎల్బీ స్టేడియం నుంచే. అదే స్ఫూర్తితో ఇక్కడి నుంచే పలు కార్యక్రమాలు అమలు చేస్తు న్నాం’ అని సీఎం వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. -
బీఎస్పీకి రెండు లోక్‌సభ సీట్లు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను రెండు లోక్‌సభ సీట్లను పొత్తులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, నాగర్‌కర్నూలు లోకసభ స్థానాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ అంగీకరించింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల రెండు పర్యాయాలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో నాగర్‌కర్నూలుతో పాటు మరో రెండు స్థానాలను బీఎస్పీ కోరినప్పటికీ రెండు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు బీఆర్ఎస్ సుముఖత వ్యక్తం చేసింది. బీఎస్పీకి కేటాయించిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను ఆ పార్టీ చేసుకుంటుందని బీఆర్ఎస్ ప్రకటించింది. కేసీఆర్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి వివరించిన అనంతరం బీఆర్ఎస్ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. కాగా, 15 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. ఇప్పటికే 11 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. భువనగిరి, నల్లగొండ, మెదక్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు అయిన తర్వాతే బీఆర్ఎస్ జాబితా వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
కాంగ్రెస్‌లోకి దానం, పసునూరి!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరో సిట్టింగ్ ఎంపీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, రోహిత్‌చౌదరి, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి పాల్గొన్నారు. రెండు మూడురోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఈ సందర్భంగా నాగేందర్ తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక పసునూరి దయాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా ఇద్దరు నేతలు ఈనెల 18న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. దానం నాగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలో నిలిపే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని గాందీభవన్ వర్గాలంటున్నాయి. మరోవైపు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎంఅర్జీ వినోద్‌రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు సికింద్రాబాద్ నుంచి పోటీచేసే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం. -
మోదీ జోష్ షో
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన ఈ రోడ్‌షో పార్టీ నాయకులు, కేడర్‌లో జోష్ నింపింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, ఇతర వర్గాల వారు రోడ్డుకు ఇరువైపులా, ఇళ్లపై, షాపింగ్, కమర్షియల్ కాంప్లెక్స్‌లపై నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీకి అభివాదం తెలిపారు. అబ్కీ బార్ 400 పార్...(ఈసారి 400 సీట్లు దాటాలి) ఇతర నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రద ర్శించారు. ప్రధానిని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. రోడ్‌షో సాగిన మార్గమంతా రెండువైపులా ఉన్న ప్రజలను మోదీ రెండు చేతులు ఊపుతూ పలకరించారు. ఈ సంద ర్భంగా డప్పు, డోలు, ఇతర వాయిద్య బృందాల ప్రదర్శనలు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. నేడు నాగర్‌కర్నూల్‌కు మోదీ కేరళ నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధానికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. మోదీ నేరుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మీర్జాల గూడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఓపెన్‌టాప్ వాహనంలో మల్కాజి గిరి దాకా దాదాపు 1.3 కి.మీ. దూరం రోడ్‌షో నిర్వహించారు. ఆయన వెంట జీప్‌లో ఓ వైపు కిషన్‌రెడ్డి మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రమే (ఇద్దరు భద్రతా సిబ్బంది మినహా) రోడ్‌షోలో పాల్గొన్నారు. అంతకుముందు చేవెళ్ల, భువనగిరి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వేర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మాధవీలతలను మోదీకి పరిచయం చేశారు. ఈ రోడ్‌షో మొదలు, చివరి పాయింట్ల వద్ద పలువురు బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు స్వాగతం పలికేలా లైనప్‌లు ఏర్పాటు చేశారు. కాగా రోడ్‌షో ముగియగానే మోదీ రాజ్‌భవన్ బసకు చేరుకున్నారు. ప్రధాని శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్లో కర్ణాటకలోని గుల్బర్గా వెళతారు. -
కవిత అరెస్ట్ రాజకీయ కుట్ర: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కుట్రతోనే కవితను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. అంతా పథకం ప్రకారమే జరిగిందని.. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. కవిత అరెస్ట్ అనంతరం బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. కవితను అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్‌రావు అన్నారు. 19కి కేసు విచారణ ఉన్నప్పటికి ఇవాళ అరెస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను దెబ్బతీయాలన్నదే ప్లాన్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రాజకీయ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ‘‘మాది ఉద్యమ పార్టీ అరెస్టులు, కేసులు కొత్త కాదు. రేపు అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఇలాంటి కుట్రలు చేస్తున్నాయి’’ అని హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?.. అసలు కథ ఎప్పుడు మొదలైంది? -
లిక్కర్ కేసులో కవిత అరెస్ట్.. నేతల రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. నాలుగు గంటలపాటు సోదాలు జరిపిన అనంతరం కవితను అరెస్ట్ చేసింది ఈడీ. కావాలనే శుక్రవారం వచ్చారు అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చి.. ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని మండిపడ్డారు. సుప్రీం చెప్పిన మాటను పక్కన పెట్టిన తమ అధికారులు (ఈడీ).. కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈడీ అధికారులు కవిత ఇంటికి కావాలని శుక్రవారం వచ్చారని ఆరోపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని కవిత, కుటుంబ సభ్యులు, పార్టీ లీడర్లు తెలిపారు. దర్యాప్తు సంస్థ అక్రమ రెస్టును న్యాయపరంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. అరెస్టుని అడ్డుకోవద్దని.. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కేటీఆర్, హరీష్ రావు కోరారు. కవిత అరెస్ట్.. కక్ష సాధింపు కాదు: ఈటల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ సోదాలు కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్య కాదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. విచారణ సంస్థలు తన పని తాము చేసుకొని పోతాయన్నారు. దేశంలో విచారణలు జరగడం ఇదేం మొదటిసారి కాదని అన్నారు. దర్యాప్తు సంస్థలు తన దగ్గరున్న ఆధారాలను బట్టి విచారణలు జరుపుతాయని పేర్కొన్నారు. కక్ష సాధింపులకు దిగాల్సిన అవసం బీజేపీకి లేదని తెలిపారు. డిల్లీకి కవిత! అరెస్టు వియం కవిత కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు తెలియజేశారు. కవిత భర్త అనిల్‌కు మెమో ఇచ్చారు. కవితను నేడు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు అధికారులు. రాత్రి 8.45 విమానంలో కవితను ఢిల్లీకి తరలించనున్నారు. ఇక లిక్కర్ కేసులో మరికొందరు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈడీ అధికారులతో వాగ్వాదం కవిత నివాసం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ చేరుకున్నారు. ముందుగా వారిని లోపలికి వెళ్లనివ్వని అధికారులు.. కాసేపటి తరువాత అనుమతించారు. ఈ క్రమంలో విచారణ అధికారులతో కేటీఆర్, హరీష్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీ ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. -
కవిత ఇంట్లో సోదాలు.. కేసీఆర్ ఆకస్మిక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్‌లతో భేటీ అయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద కొనసాగుతున్న ఐటీ, ఈడీ సోదాలపై ఆరా తీశారు. ఇక హైదరాబాద్‌లో ఒకేసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, కవిత నివాసంలో సోదాలు జరగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ శుక్రవారం సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. మూడు గంటలకుపైగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళా అధికారులతో కలిపి మొత్తం 12 మంది అధఙకారులు సోదాలు జరుపుతున్నారు. కవిత రెండు ఫోన్లును ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర బలగాలు కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. సోదాలు జరుగుతున్న కవిత ఇంటికి ఆమె అడ్వకేట్ భరత్ చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు. ఈడీ సోదాలు జరుగుతున్నాని, ఇప్పుడు అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనిఖీలు మరికొంత సమయం కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈడీ సోదాలు ముగిసిన తర్వాత సమాచారం ఇస్తామని, అప్పుడు లోపలికి పిలుస్తామని కేంద్ర బలగాలు చెప్పాయి. -
బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి ఎంపీ పసునూరి దయాకర్?
సాక్షి, వరంగల్: వరంగల్‌లో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లోకి చేరబోతున్నట్లు సమాచారం. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ పసునూరి కలిశారు. వరంగల్ పార్లమెంట్ సీటు విషయంలో పసునూరి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. -
BRS MLC Kavitha Arrest: లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్.. ఢిల్లీకి తరలింపు
IT ED Raids, MLC Kavitha Arrest Updates: BREAKING @ 09.00 PM అరెస్ట్ ప్రొసీజర్‌కు సంబంధించి పంచనామా తయారుచేసిన ఈడీ లాఠీచార్జ్ మధ్య కవిత అరెస్ట్ కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి రూట్ క్లియర్ చేసిన పోలీసులు కవితను ఢిల్లీకి తీసుకెళ్తున్న పోలీసులు. మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 6:40 వరకు సెర్చ్ చేసినట్లు పేర్కొన్న ఈడీ. సాయంత్రం 5.20కి కవితను అరెస్ట్ చేసినట్లు పంచనామాలో తెలిపిన ఈడీ పీఎమ్ఎల్ఏ యాక్ట్ 19 కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ. అనుమతి లేకుండా వచ్చి గొడవపడ్డారు: ఈడీ సాయంత్రం 6 గంటలకు అనుమతి లేకుండా 20 మంది లోపలికి వచ్చారు: ఈడీ BREAKING @ 08.31 PM ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్న కేటీఆర్ ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించిన ఢిల్లీ పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఈడీ కేసు నమోదు. కవిత నివాసం వద్ద తమ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన ఈడీ. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం కవిత అరెస్టు రాజకీయ ప్రేరేపితం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఈ చర్యలు అనైతికం. విపక్ష పార్టీలు లక్ష్యంగా చేసే ఈ చర్యలు ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. కేసీఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ప్రతి విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం.. రాజకీయ ప్రయోజనాలకోసమే ఈ అరెస్టు. ఈ పరిణామాలు వారికి తాత్కాలిక ఆనందమే.. భవిష్యత్‌లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కవిత అరెస్టుపై ఒక ప్రకటనలో స్పందించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. BREAKING @ 08.11 PM కుట్రతోనే కవితను అరెస్ట్ చేశారు: హరీష్‌రావు అంతా పథకం ప్రకారమే జరిగింది ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటాం కవితను అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం 19కి కేసు విచారణ ఉన్నప్పటికి ఇవాళ అరెస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను దెబ్బతీయాలన్నదే ప్లాన్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రాజకీయ కుట్ర చేస్తోంది BREAKING @ 08.00pm రేపు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ వేయనున్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం నిందితుడు అమిత్ అరోరా సమాచారంతో కవిత అరెస్ట్ 4 రోజుల నుంచి అమిత్ అరోరాను ప్రశ్నిస్తున్న ఈడీ సౌత్ లాబీ కీలక సమాచారాన్ని ఈడీకి అందించిన అరోరా లిక్కర్ కేసులో కీలకంగా వ్యవహరించిన సౌత్ లాబీ రేపు ఉదయం అమిత్ అరోరాతోపాటు కవితను ప్రశ్నించనున్న ఈడీ రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత హాజరు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నేరుగా ఈడీ ఆఫీస్‌కు కవిత రాత్రంతా ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే బీఆర్ఎస్ నాయకురాలు రేపు ఉదయం కవితకు మెడికల్ టెస్టు రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ విచారణ కోసం కవితను కస్టడీ కోరనున్న ఈడీ BREAKING @ 07.20pm కవితను ఢిల్లీ తరలిస్తున్న ఈడీ అధికారులు కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కవిత. రాత్రి. 8:45కి విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లనున్న అధికారులు. రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ. కవిత ఇంటి దగ్గర ఈడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. కవితను తీసుకెళుతున్న వాహనాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ యత్నం. బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టి వాహనానికి రూట్ క్లియర్ చేసిన పోలీసులు. పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత పార్టీ శ్రేణులను సముదాయించిన సీనియర్ నాయకులు ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామన్న కవిత. శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని విజ్ఞప్తి. BIG BREAKING @ 07.00pm కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారులు ఇంటి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తున్న ఈడీ అధికారులు. కవితను తీసుకెళ్లే రూట్ క్లియర్ చేస్తున్న పోలీసులు రాత్రి. 8:55కి ఫ్లైట్ బుక్ చేసిన అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల హెచ్చరికతో పోలీసుల భారీ బందోబస్తు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి వివరాలు BIG BREAKING @ 6.30pm ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఈడీ ప్రకటన సాయంత్రం 5:20 నిమిషాలకు కవిత అరెస్ట్ చేశాం. మనీలాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేశాం. ఆమె అరెస్ట్ చేసినట్లు భర్త అనిల్‌కు తెలిపాం. BIG BREAKING @ 5.45pm ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ కవిత ఫోన్లు, పీఏ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రాత్రి 8.45గంటల విమానంలో కవితను ఢిల్లీకి తరలించనున్న ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్‌కు ముందు ED అధికారులు.. ఆమెకు అరెస్ట్ వారంట్‌తో పాటు సెర్చ్ వారెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలిసింది. కవితను ఢిల్లీ తరలించే అవకాశముంది. BRS MLC K Kavitha is being brought to Delhi by ED: Sources (file pic) pic.twitter.com/23NM1P7cEc — ANI (@ANI) March 15, 2024 ఛార్జ్‌షీట్‌లో కవితపై మోపిన అభియోగాలు ఏంటంటే.? ఆప్ నేతలకు సౌత్‌గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంది. అరుణ్పిళ్లైకి క్రియేటివ్ డెవలపర్స్ భాగస్వాములు, రవిశంకర్ చెట్టి రూ.5 కోట్లకు హైదరాబాద్‌లో భూమి అమ్మారన్న ఆరోపణలున్నా వారెవరూ అరుణ్పిళ్లైను కలవలేదు. ఈ ఒప్పందాన్ని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు చెందిన శ్రీహరి చర్చలు జరిపి ఖరారు చేశారు. భూమి కొనుగోలు నిమిత్తం సంస్థకు ఒకరు డబ్బులు బదిలీ చేస్తారని చెప్పిన శ్రీహరి.. ఎవరు డబ్బులు బదిలీ చేశారనేది రవిశంకర్ చెట్టికి చెప్పలేదు. అయితే, ఎన్‌గ్రోత్ కాపిటల్ పేరుతో ఫీనిక్స్ గ్రూపునకు చెందిన శ్రీహరి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు బుచ్చిబాబు తన వాంగ్మూలంలో చెప్పారు. ఆ సమయంలో ఫీనిక్స్ గ్రూపునకు సీవోవోగా శ్రీహరి ఉన్నారు. దీంట్లో కవిత భర్త అనిల్‌కుమార్ కూడా భాగస్వామి. కవిత తెలంగాణలో పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో మార్కెట్ రేటు కంటే తక్కువకే భూమి కొనుగోలు చేశారు. దీంతోపాటు కవిత మరో ప్రాపర్టీ కూడా కొనుగోలు చేశారు. 25వేల చదరపు అడుగుల ప్రాపర్టీకి సంబంధించిన పేపర్ వర్క్‌ను బుచ్చిబాబు, శ్రీహరి పూర్తిచేశారు. మార్కెట్ ధర చదరపు అడుగు రూ.1,760 ఉంటే రూ.1,260 మాత్రమే చెల్లించారు. కవితతో గణనీయమైన ఆర్థిక లావాదేవీలున్న వ్యక్తి రవిశంకర్‌తో భూమి కొనుగోలుకు చర్చలు జరిపినట్లు నిర్ధారణకు వచ్చాం. ఇండోస్పిరిట్స్‌లో కవిత తరఫున అరుణ్ పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించి రూ.32.86 కోట్లు అందుకున్నారు. పిళ్లై సూచన మేరకు రూ.25.5 కోట్లు నేరుగా ఇండోస్పిరిట్స్ నుంచి పిళ్లై ఖాతాకు బదిలీ అయ్యాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మద్యం దుకాణం నిమిత్తం ఎన్వోసీ కోసం జీఎంఆర్ గ్రూపునకు చెందిన బీవీ నాగేశ్వరరావుతో మాగుంట రాఘవ, ఎంపీ ఎంస్ రెడ్డి చర్చలు జరిపారు. ఎంఎస్ రెడ్డి వాట్సాప్ సందేశాల ద్వారా ఇది వెల్లడైంది. వ్యాపారంలో భాగస్వాములై ఎన్వోసీ ఇవ్వాలని జీఎంఆర్‌ను కోరినట్లు తేలింది. ఇండోస్పిరిట్స్‌లో అరుణ్ పిళ్లై ప్రాక్సీ భాగస్వామి. ఇండోస్పిరిట్స్ నుంచి లాభాలు తన నుంచి కవితకు చేరడంపై అరుణ్పిళ్లై సేట్మెంట్ల ద్వారా వెల్లడైంది. ఏప్రిల్ 2022లో ఢిల్లీలోని ఓ హోటల్లో విజయ్‌నాయర్‌తో కవిత, అరుణ్పిళ్లై సమావేశమయ్యారు. వ్యాపార కార్యకలాపాలు కుంటుపడుతున్న నేపథ్యంలో చెల్లించాల్సిన లంచాలు రికవరీ చేయడంపై చర్చించారు. హోటల్ రికార్డుల దీన్ని ధ్రువీకరించుకున్నాం. దినేష్ ఆరోరా, అరుణ్పిళ్లై వాంగ్మూలాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కిక్‌బ్యాక్‌ల రూపంలో సొమ్ములు వెనక్కి మళ్లించే పనులను అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై నిర్వహించినట్లు ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలమిచ్చారు. సౌత్‌గ్రూప్ నుంచి కిక్‌బ్యాక్‌లను విజయనాయర్ అందుకుంటున్నారన్నారు. విజయ్నాయర్కు డబ్బు అవసరమని బుచ్చిబాబు ఫోను నంబర్ల ద్వారా చేసిన వాట్సాప్ సందేశాల ద్వారా ధ్రువీకరణ అయింది. దీంట్లో ‘వీ’కి డబ్బు కావాలి అంటే విజయ్నాయర్కు డబ్బు అవసరమని అర్థమని బుచ్చిబాబు తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ హోటళ్లలో జరిగిన సమావేశాల్లో సౌత్‌గ్రూపు నుంచి విజయ్నాయర్కు డబ్బులు పంపడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా బుచ్చిబాబు తెలిపారు. క్రియేటివ్ డెవలపర్స్ ఖాతాకు డబ్బు మళ్లించడం కూడా బుచ్చిబాబు నోట్స్ ద్వారా తెలిసింది. కవిత తరఫున ఇండోస్పిరిట్స్ నుంచి వచ్చిన లాభాలను అరుణ్ పిళ్లై అందుకొని ఆమె ఆదేశాల మేరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని ధ్రువీకరణ అయింది. భూముల కొనుగోలులో శ్రీహరి సూచనల మేరకు కవిత తరఫున సొమ్ములు బదిలీ చేయడం వరకే పిళ్లై పాత్ర పరిమితమని తేలింది. అయితే, మే 2022 నుంచి రిజిస్టర్ కాకుండా ఉన్న భూమి 11.10.22న అరుణ్పిళ్లై భార్య పేరు మీద రిజిస్టర్ కావడం అరుణ్పిళ్లై ప్రయోజనం కోసమేనని, కవితకు లాభదాయకం కాదని దర్యాప్తులో తేలింది. అరుణ్పిళ్లై ఆదేశాల మేరకే ఇండో స్పిరిట్స్ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్లకు రూ.కోటి, రూ.70 లక్షలు బదిలీ చేసినట్లు సమీర్ మహేంద్రు తెలిపారు. దీనికి మద్దతుగా ఎలాంటి రికార్డు లేదు. అయితే, అరుణ్ పిళ్లై చెప్పినట్లుగా ఈ సంస్థలు ఇండో స్పిరిట్స్ లేదా అరుణ్ పిళ్లైకి ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. ఆయా సంస్థలకు ఇచ్చిన సొమ్ము ఇప్పటివరకూ వెనక్కి ఇవ్వలేదు. గౌతమ్ ముత్తాకు అరుణ్పిళ్లై బదిలీ చేసిన రూ.4.76 కోట్లు, అభిషేక్‌కు రూ.3.85 కోట్లు బదిలీ రుణం తిరిగి ఇవ్వమని చెప్పినప్పటికీ కాలక్రమేణా ఎలాంటి రుణం లేదని పిళ్లై పేర్కొన్నారు. BIG BREAKING @ 5.30pm కవితకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ED కాసేపట్లో కవితను అరెస్ట్ చేసే అవకాశం కవిత నివాసం వద్ద కవిత అనుచరుల నిరసన బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కవిత ఇంటి ముందు గేటు బయట బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసే దిశగా ED అడుగులు వేస్తోంది. ఇప్పటికే కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ఆమెకు అరెస్ట్ వారంట్‌తో పాటు సెర్చ్ వారెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలిసింది. లాయర్లు, కవిత వర్గం ఏమంటోంది? ఒక మహిళను సాయంత్రం 6గంటలకు అరెస్ట్ చేయరాదు సుప్రీంకోర్టుకు ఇచ్చిన మెమోను ఈడీ ఉల్లంఘించారు CrPC సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు, 2022 డిసెంబరులో అప్పటి విచారణ అధికారి ఇదే తరహా నోటీసు సెక్షన్ 160 కింద ఇచ్చారు, గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు దర్యాప్తు సంస్థకు ఏవైనా ప్రశ్నలకు సమాధానం లేదా సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో ఇస్తారు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరెస్ట్ చేయడం రాజకీయ కక్షే నాలుగు గంటలుగా కొనసాగుతున్న సోదాలు ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు మూడు గంటలకుపైగా కొనసాగుతున్న తనిఖీలు కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న 12 మంది అధికారులు. ఇద్దరు మహిళా అధికార్లతోపాటు పదిమంది అధికారుల తనిఖీలు. కవిత ఇంట్లో 16 ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అధికారులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం ఇంట్లోకి ఎవరినీ అనుమతించని ఈడీ కేసు కోర్టులో ఉండగా.. దాడులు ఎలా చేస్తారు?: సోమ భరత్ కుమార్, బీఆర్ఎస్ లీగల్ సెల్. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్‌లో ఉంది. కేసు పెండింగ్‌లో ఉండగా ఈడీ అధికారులు కవిత ఇంటికి ఎలా వస్తారు? ఢిల్లీ నుంచి ఈడి అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదు. ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టులో ఈడీ చెప్పింది. ఈనెల 19న సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కవితను అరెస్ట్ చేసే అవకాశం లేదు. కవిత ఇంటికి చేరుకున్న అడ్వకేట్ భరత్ కవిత నివాసంలోకి అనుమతించని అధికారులుజ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా అడ్వకేట్ భరత్ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అనుమతించే ప్రసక్తి లేదని తెలిపిన అధికారులు. మరికొంత సమయం పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడి ఈడీ సోదాలు ముగిసిన తర్వాత సమాచారం ఇస్తామన్న అధికారులు. అప్పుడు లోపలికి పిలుస్తామని అడ్వకేట్‌కు చెప్పిన అధికారులు. మూడు గంటలుగా కొనసాగుతున్న సోదాలు ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు మూడు గంటలకుపైగా కొనసాగుతున్న తనిఖీలు కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న 12 మంది అధికారులు. ఇద్దరు మహిళా అధికార్లతోపాటు పదిమంది అధికారుల తనిఖీలు. కవిత ఇంట్లో 16 ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అధికారులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం ఇంట్లోకి ఎవరినీ అనుమతించని ఈడీ సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంయుక్తంగా సోదాలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారులు తనిఖీలు జరుపుతున్నాయి. నాలుగు బృందాలుగా ఈడీ, ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఇంట్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. కవితతోపాటు ఆమె భర్త వ్యాపారాలపై దర్యాప్తు సంస్థ అధికారుల ఆరా తీస్తున్నారు. ఐటీ, ఈడీ సోదాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. చదవండి: కవిత పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా -
కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది: హరీష్‌రావు సెటైర్లు..
సాక్షి, తెలంగాణ భవన్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కరువు తెచ్చిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓటు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, హరీష్‌రావు శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయ్యింది. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని విఫలమయ్యారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ మాట తప్పింది. అసెంబ్లీ రూపురేఖలు మారుస్తామని తట్ట మట్టి కూడా ఎత్తలేదు. రైతు రుణమాఫీపై అతీగతీ లేదు. ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు. ఉన్న పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో కరువును పెంచడానికి కాంగ్రెస్ పోటీ పడుతోంది. వ్యవసాయాన్ని శిథిలావస్థకు చేర్చుతున్నారు. సీఎం గారు పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వండి. తాగడానికి నీళ్ళు లేక జనం గోస గోస పడుతున్నారు మీ పాలన వచ్చింది ఖాళీ బిందెలు, నిండుగా వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. కర్ణాటక నుంచి తాగునీరైన తెప్పించడంలో విఫమయ్యారు. ప్రాజెక్ట్‌లు అప్పగింత చేసి మేము ఒత్తిడి తేవడంతో మళ్లీ వెనక్కి తగ్గారు. కేసీఆర్.. కిట్లు ఇస్తు.. రేవంత్ మాత్రం తిట్లతో పోటీ పడుతున్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నారు. ఇదీ కాంగ్రెస్ ఘనత. కరువును పెంచడానికి పోటీ పడుతుంది కాంగ్రెస్. కాంగ్రెస్ వంద రోజుల పాలన లో 174మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 34మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తాం అన్నారు. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మొన్నటి బడే భాయ్ చోటే భాయ్ మీటింగ్‌లో తేలిపోయింది. కాంగ్రెస్ పాలన, యూట్యూబ్.. యూటర్న్ పాలనగా సాగుతోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. క్లారిటీ ఇచ్చిన సుఖేందర్ రెడ్డి
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో క్షేత్రస్థాయిలో నిర్మాణ లోపం ఉందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో సీఎం రేవంత్ పాలన బాగానే ఉన్నట్టు ప్రజలు భావిస్తున్నారు. ఏ పార్టీకి సంబంధంలేని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నాను. ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు సీఎం రేవంత్ బంధువు అయినప్పటికీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాత్రమే కలిశాను. బయట ఎప్పుడూ కలవలేదు. నేను ఏ రాజకీయ పార్టీలో చేరను. నా కుమారుడు అమిత్‌కు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే. కానీ ఎలాంటి చర్చలు జరగలేదు. అలాగే, బీఆర్ఎస్లో కొందరు నేతలు అమిత్‌కు సహకరించకపోవడంతో పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నాడు. బీఆర్ఎస్ నుంచి పోటీకి అమిత్ దూరంగా ఉన్నాడు’ అని క్లారిటీ ఇచ్చారు. -
బీఎస్పీకి రెండు సీట్లిచ్చిన బీఆర్ఎస్.. ‘ఆర్ఎస్పీ’ పోటీ అక్కడి నుంచే..
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్ఎస్ రెండు సీట్లు కేటాయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం(మార్చ్15) ఒక ప్రకటన విడుదల చేసింది. పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో పాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి స్వయంగా బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(ఆర్ఎస్పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను 11 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఖరారైంది. తాజాగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలను పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించడంతో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థులను ప్రకటించాల్సిన నియోజకవర్గాల జాబితాలో సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరి, మెదక్ ఉన్నాయి. కాంగ్రెస్ జాబితా వెలువడిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌పైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో ఈ నెల 23న బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థులు ఖరారైన చోట బహిరంగ సభలు, ప్రచార షెడ్యూల్‌పై స్థానికంగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నేతలను కేసీఆర్ ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. ఇదీ చదవండి.. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -
మధుసూదన్ అరెస్ట్‌తో రంగంలోకి హరీష్.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధుసూదన్‌ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకోవడం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక, మధుసూదన్ అరెస్ట్ నేపథ్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘దేశం మొత్తంలో ఎన్నో క్వారీలు ఉన్నాయి. పూర్తి పర్మిషన్తో క్వారీలు నడిపిస్తున్నాము. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు. ప్రజా కోర్టులో తేల్చుకుంటాం. కింది స్థాయి నుంచి ప్రజల మద్దతుతో రాజకీయాల్లో కొనసాగుతున్నాము. మా తమ్ముడిని అక్రమంగా అరెస్ట్ చేశారు’ అని వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..‘తెలంగాణలో కాంగ్రెస్ వంద రోజలు పాలన ఎలా తయారైందంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారు. వందల మంది పోలీసులతో కలిసి తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లి అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసం. అంత అవసరం ఏముంది?. నోటీసులు ఇవ్వరు.. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. అధికారం శాశ్వతం కాదు. గత పదేళ్లలో మేము ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదు. ప్రభుత్వం ఇలాంటి విధానాలను మార్చుకోవాలి. పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. pic.twitter.com/xm5037wIyS — Telugu Scribe (@TeluguScribe) March 15, 2024 Video Credit: TeluguScibe మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో మధుసూదన్‌ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల క్వారీలు మీద ఎటువంటి చర్యలు లేవు. వరుసగా కేసులు నమోదు చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. వంద రోజులు పూర్తి అయ్యాయి.. హామీల అమలు పూర్తి కాలేదు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చివరకు ధర్మమే గెలుస్తుంది. కోర్టుల ద్వారా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. మీ కుట్రలను ప్రజల ముందుకు తీసుకొని వెళ్తాము. మెడ మీద కత్తి పెట్టి జాయిన్ చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది పనికి రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనసు గెలవండి. ప్రతి పక్షం లేకుండా చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ప్రణీత్‌రావుతో చాటింగ్ చేసిన బీఆర్ఎస్ ముఖ్యనేత?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. విచారణ ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణీత్‌రావు ఫోన్లను సీజ్ చేసిన స్పెషల్ టీం.. ఆ ఫోన్లలోని వాట్సాప్ ఛాటింగ్‌లను రిట్రీవ్(డిలీట్ చేసిన సమాచారాన్ని సేకరించడం) చేసినట్లు తెలుస్తోంది. ఈ వాట్సాప్ సంభాషణలనే కీలకంగా భావిస్తూ.. దర్యాప్తులో ముందుకెళ్లాలని భావిస్తోంది. ప్రణీత్‌రావు ఛాటింగ్‌లో ఓ బీఆర్ఎస్ ముఖ్యనేత పేరు ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ నేత ఇచ్చిన సూచనల మేరకే ప్రణీత్ కొంత మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు విచారణ బృందం గుర్తించింది. బీఆర్ఎస్కు చెందిన ఆ ముఖ్యనేత వంద ఫోన్ నెంబర్లు ప్రణీత్ రావు ఇచ్చారని.. ఆయా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయాలని ప్రణీత్‌రావును ఆదేశించారని తెలుస్తోంది. .. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు?.. ఎక్కడ కలుస్తున్నారు? అనే వివరాల్ని ఆ బీఆర్ఎస్ నేత ప్రణీత్‌రావు నుంచి కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి సోదరులు, అనుచరులతో పాటు చుట్టుపక్కల ఉన్నవాళ్ల ఫోన్లను సైతం ప్రణీత్‌రావు ట్యాప్ చేశారు. అంతేకాదు ట్యాపింగ్ చేసిన ఆ సమాచారాన్ని రాత్రికి రాత్రే ప్రణీత్‌రావు ఆ బీఆర్ఎస్ పెద్దకు చేరవేసినట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. ప్రణీత్‌రావు గతంలో చెప్పిన పోలీసు అధికారులతో(మాజీలు) పాటు సదరు బీఆర్ఎస్ ముఖ్య నేతను సైతం విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అసలు ఆ ముఖ్యనేత ఎవరు? అనే ఆసక్తి సర్వత్రా ఇప్పుడు నెలకొంది. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్.. కారణం ఇదే..
సాక్షి, పటాన్చెరు: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. వివరాల ప్రకారం.. గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డిపై చీటింగ్, మైనింగ్‌కు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో మధుసూదన్ రెడ్డి క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నాడు. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని లీజ్‌కు తీసుకుని మరో నాలుగు ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్ కూడా నివేదిక ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో క్రషర్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం, మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, మధుసూదన్ అరెస్ట్‌తో పటాన్చెరు పోలీసు స్టేషన్ వద్దకి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో, స్టేషన్ ఎదుట పోలీసులు మోహరించారు. -
మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు అవకాశం లభించింది. దీంతో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను 11 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఖరారైంది. నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాన్ని పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించే అవకాశం ఉండటంతో, మరో ఐదు స్థానా లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థు లను ప్రకటించాల్సిన నియోజకవర్గాల జాబితాలో హైదరాబాద్, సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరి, మెదక్ ఉన్నాయి. కాంగ్రెస్ జాబితా వెలువడిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌పైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో ఈ నెల 23న బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థులు ఖరారైన చోట బహిరంగ సభలు, ప్రచార షెడ్యూల్‌పై స్థానికంగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఆదిలాబాద్ నేతలతో కేసీఆర్ భేటీ ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలతో నందినగర్ నివాసంలో గురువారం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కు పార్టీ అభ్యర్థన మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. అయితే ఈ భేటీకి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి గైర్హాజరుపై కేసీఆర్ ప్రశ్నించగా, వ్యక్తిగత పనులతో రాలేకపోయినట్లు నిర్మల్ జిల్లా నేతలు వెల్లడించారు. అయితే ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి గైర్హాజరు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
రాహుల్ గాంధీ హామీలు పెద్ద జోక్
బోయినపల్లి(చొప్పదండి): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ప్రతి మహిళ పేరిట రూ.లక్ష చొప్పున బ్యాంకులో జమచేస్తా మని, ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న హామీలు పెద్దజోక్ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గురువారం జరిగిన ప్రజాహితయాత్రలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి ఎలాగూ రాలేదని అర్థమై, అడ్డగోలు హామీలు ఇస్తున్నారన్నారు. రిజర్వేషన్ల విషయం తర్వాత కానీ.. మొదట కాంగ్రెస్ పార్టీ పదవులు, లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం టికెట్లు మహిళలకు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఇప్పటికీ దిక్కులేదని చెప్పారు. 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రానికి అధిక నిధులు తీసుకొస్తామన్నారు. బోయినపల్లి మండలకేంద్రంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు మాట్లాడుతూ బండి సంజయ్ గెలిస్తే మోదీ ప్రభుత్వంలో మంత్రిపదవి వస్తుందని పేర్కొన్నారు. -
బీఆర్ఎస్కు పెద్దిరెడ్డి రాజీనామా
హుజూరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రెండుసార్లు మంత్రిగా, కార్మిక సంఘ నేతగా సేవలందించిన ఇనుగాల పెద్దిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గురువారం లేఖ రాశారు. 2021 జూలై 27న తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో పెద్దిరెడ్డి బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ తనను పార్టీ పరిగణనలోకి తీసుకోకపోవడం, ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన కదనభేరి సభకు ఆహ్వానించనందుకు మనస్తాపంతో పార్టీకి రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులు, ప్రజాభీష్టం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పెద్దిరెడ్డి వెల్లడించారు. -
కాంగ్రెస్‌కు అభ్యర్థులే దొరకడం లేదు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చాలాచోట్ల అభ్యర్థులే దొరకడంలేదని, అందుకే ఇతర పార్టీల్లో టికెట్ రాని నేతల కోసం ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ముఖ్యమంత్రిని కూడా బయటనుంచి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయనకు టికెట్ రాకపోవడం బాధాకరమన్నారు. డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ఇద్దరూ పెద్ద లీడర్లేనని, జితేందర్‌రెడ్డి పార్టీ మారతారని తాను భావించడం లేదని చెప్పారు. చేవెళ్ల సీటు మోదీదేనని రాసి పెట్టు కోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలోని 12, 13 సీట్లు గెలిచినా ఆశ్చర్యపోనవసరంలేదని చెప్పారు. బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి వస్తానన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే తమ పార్టీపై దుష్ప్రచారం సాగుతోందని, మద్యం కుంభకోణం కేసులో చర్యలు తీసుకోకపోవడం వల్ల అలా అనుకుని ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కాంగ్రెస్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌లో చేరిన కోనప్ప
కాగజ్‌నగర్ రూరల్: సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగజ్ నగర్ పట్టణంలోని విన య్ గార్డెన్లో గురువా రం నిర్వహించిన సమా వేశంలో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క కండువా కప్పి కోనప్పను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కోనప్పతోపాటు ఆయన సోదరుడు, ఇన్చార్జ్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్పర్సన్ షాహీనా సుల్తానా, వైస్‌చైర్మన్ రాజేందర్, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గెలిపించడానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రావి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గని అసంతృప్త స్వరాలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ అభ్యర్థులుగా బయటివారికి ప్రాధాన్యమివ్వడంపై బీజేపీలో ఇంకా అసంతృప్త స్వరాలు తగ్గడం లేదు. ఇప్పటివరకు 15 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఏడుగురు ఇటీవలే చేరినవారికి (ఒకరు పార్టీలో కూడా చేరకున్నా) టికెట్లు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్డ్ సీట్లను (మూడు ఎస్సీ, రెండు ఎస్టీ సీట్లు) పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి కాకుండా ‘వలస’ నేతలకే ఇవ్వడం ఏమిటని (ఇంకా వరంగల్ ఎస్సీ సీటు ఖరారు కాలేదు) ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తమకు టికెట్ దక్కని కొందరు నేతలు అసంతృప్తితో పార్టీ మారొచ్చంటూ ప్రచారం జరుగుతోంది. మహబూబ్‌నగర్ సీటును పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కేటాయించడంతో.. ఆ స్థానాన్ని ఆశించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి నిరుత్సాహానికి గురయ్యారు. దీనికితోడు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నేతలు గురువారం జితేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జితేందర్‌రెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం సాగింది. అయితే ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని, పార్టీ మారే ఉద్దేశమేదీ లేదని ఆయన ప్రకటించారు. వేధించిన వారికి టికెట్లా? నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ గుర్రంపోడు ఎస్టీల భూముల పోరు అంశంలో బీజేపీ నాయకులపై అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కేసులుపెట్టి జైలుకు పంపారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పార్టీ శ్రేణులను వేధించిన వ్యక్తిని బీజేపీలో చేర్చుకుని నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోసం టికెట్ త్యాగం చేసి, తర్వాత చేరిన మరో కాంగ్రెస్ నేతకు అసెంబ్లీ టికెట్ ఇచ్చినా సహకరించిన పార్టీ నేత జి.మనోహర్‌రెడ్డికి నల్లగొండ ఎంపీ సీటు ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీస్తున్నాయి. ఇక నాగర్‌కర్నూల్ ఎంపీ సీటును బీఆర్ఎస్ ఎంపీ కుమారుడికి ఇచ్చి.. పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శ్రుతికి మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సబబు అని బీజేపీ అసంతృప్త నేతలు ప్రశ్నిస్తున్నారు. 20ఏళ్లకుపైగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్‌ను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన శ్రీనివాస్‌కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడం సరికాదని అంటున్నారు. వరంగల్ జిల్లాలో పార్టీ కేడర్‌పై కేసులకు కారణమైన అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తాం, పార్టీలోకి రావాలంటూ పిలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అరూరి రమేశ్‌ను పార్టీలోకి తీసుకోవద్దని, వరంగల్ ఎంపీ సీటు ఇవ్వొద్దని గురువారం రాష్ట్ర నాయకత్వానికి మాజీ మంత్రి జి.విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే జైపాల్, ఇతర ఎస్సీ వర్గ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇదే డిమాండ్‌తో వరంగల్ జిల్లా నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన కూడా చేశారు. ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎంపీ టికెట్లు ఇవ్వడంపై.. ఆశావహులు, ఇతర నేతలు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే టికెట్ల కేటాయింపులో తమ ప్రమేయం పెద్దగా లేదని, జాతీయ నాయకత్వమే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తోందని ముఖ్య నేతలు బదులిస్తున్నట్టు సమాచారం. -
తెలంగాణకు ప్రధాని రాక.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో... తెలంగాణలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వరుసగా శుక్ర, శని, సోమవారాల్లో వివిధ చోట్ల బహిరంగసభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్న మోదీ రాత్రికి రాజ్‌భవన్‌లో బసచేయనున్నారు. శనివారం ఉదయం నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. మళ్లీ 18న జగిత్యాలలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శుక్ర, శనివారాల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చనే అంచనాల మధ్య ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ ఇప్పటికే ఈ నెల 4న ఆదిలాబాద్‌లో, 5న పటాన్‌చెరువులో రూ.15వేల కోట్ల పైచిలుకు విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందా లేదా అన్న దానితో నిమిత్తం లేకుండా మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయని పార్టీ వర్గాల సమాచారం. ఇదీ మోదీ షెడ్యూల్... ► శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు... ► రోడ్డుమార్గాన మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని రోడ్డుషో స్టార్టింగ్ పాయింట్‌కు... ► సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు మల్కాజిగిరిలో రోడ్డుషో ► రోడ్డుమార్గాన 6.40 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ► శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు ► మధ్యాహ్నం 12 నుంచి 12.45 గంటల దాకా అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు ► ఒంటిగంటకు నాగర్‌కర్నూల్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.05 గంటలకు కర్ణాటకలోని గుల్బర్గాకు బయలుదేరుతారు. ► తిరిగి 18వ తేదీ రాష్ట్రానికి వస్తారు. ఆ రోజు షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది. ఔ నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు ప్రధాని మోదీ రెండు రోజుల నగర పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం తెలిపింది. శుక్రవారం సాయంత్రం 4.40 నుంచి 7 గంటల మధ్య బేగంపేట, పీఎన్టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్‌రోడ్డు, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, రైల్వే హాస్పిటల్, మెట్టుగూడ రోటరీ, మీర్జాలగూడ టి–జంక్షన్, మల్కాజిగిరి ఆర్చి, లాలాపేట్, తార్నాక, గ్రీన్‌ల్యాండ్స్, మోనప్ప జంక్షన్, రాజ్‌భవన్, ఎంఎంటీఎస్ జంక్షన్, వీవీ విగ్రహం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. ఆయా మార్గాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించింది. అదేవిధంగా శనివారం ఉదయం 10.40 నుంచి 11.15 గంటల మధ్య ప్రధానమంత్రి రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఆ సమయంలో వీవీ విగ్రహం, మెట్రో రెసిడెన్షీ లేన్, ఎంఎంటీఎస్ రాజ్‌భవన్, పంజగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, హెచ్‌పీఎస్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పీఎన్టీ ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించింది. మోదీ రాక.. భద్రత కట్టుదిట్టం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల(నేడు, రేపు) నగర పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశా రు. మోదీ విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న నేపథ్యంలో దానిని కేంద్ర బలగాలు తమ ఆ«దీనంలోకి తీసుకు న్నాయి. ఎయిర్పోర్ట్ పరిసరాలను అణువణువూ జాగిలాలతో జల్లెడ పట్టాయి. ప్రధాని పయనించే మార్గాల్లో పోలీసులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. నేడే మోదీ రోడ్ షో పూర్తిచేసుకుని తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. శనివారం ఉద యం 10.40 నుంచి 11.15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాక్షి, సిటీబ్యూరో, మల్కాజిగిరి/ సనత్‌నగర్: మల్కాజిగిరిలో నేడు సాయంత్రం 5.15 గంటలకు జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ మరి కొద్దిరోజుల్లో వెలువడనున్న తరుణంలో ప్రధానమంత్రి రోడ్ షో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపనుంది. మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలు మల్కాజిగిరిలో రోడ్‌షో ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేందుకు సన్నాహాక సమావేశాలు ఇ ప్పటికే ఏర్పాటు చేశారు. రోడ్ షో ఇలా... ► ప్రధాని మోదీ రోడ్ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభం కానున్నది. ► సుమారు 1.3 కి.మీ. దూరంలో ఉన్న మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్‌షో జరుగుతుంది. ► మల్కాజిగిరి చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌కు ఏర్పాటు చేశారు. అక్కడ మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ► దారి పొడవునా సుమారు 60 స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ► ప్రజలతోపాటు పార్టీ నాయకులు స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ► రోడ్‌షోలో భాగంగా సుమారు ముప్ఫై కార్లతో కాన్వాయి ట్రయల్ రన్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన భద్రతాచర్యల్లో భాగంగా రోడ్ షో జరిగే ప్రాంతం చుట్టూ నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిర్ బెలూన్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్, ప్యారా గ్లైడింగ్‌లను నిషేధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రోడ్ షో ముగిసే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. రహదారి మళ్లింపులు ఇలా.. ► మెట్టుగూడ నుంచి మీర్జాలగూడ క్రాస్ రోడ్, నేరేడ్మెట్ వైపునకు వచ్చే ప్రయాణికులు శాంతినగర్ టీ జంక్షన్ వద్ద మళ్లించి, లాలాపేట మీదుగా జెడ్‌టీసీ, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్ మీదుగా నేరేడ్మెట్కు చేరుకోవాలి. ► నేరేడ్మెట్, వినాయక్‌నగర్, సఫిల్‌గూడ జంక్షన్ మీదుగా మల్కాజ్గిరి క్రాస్ రోడ్స్‌కు వచ్చే వాహనదారులు ఆనంద్‌బాగ్ క్రాస్ రోడ్స్ వద్ద మలుపు తీసుకొని ఉత్తమ్ ఆర్యూబీ మీదుగా ఉత్తమ్ నగర్, ఏఓసీ రూట్, సికింద్రాబాద్ మీదుగా వెళ్లిపోవాలి. ► జెడ్‌టీసీ జంక్షన్ నుంచి ఆనంద్‌బాగ్‌కు వచ్చే వాహనాలు జెడ్‌టీసీ వద్ద మళ్లించి, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్, నేరేడ్మెట్, వినాయక్‌నగర్ మీదుగా వెళ్లిపోవాలి. పార్కింగ్లు ఇక్కడే.. రోడ్ షోకు హాజరయ్యేవారు తమ వాహనాలను అనుటెక్స్ పెట్రోల్ బంక్, అషూర్ఖానా మైదానం, ప్రశాంత్ నగర్, జైన్ కన్స్ట్రక్షన్, సఫిల్‌గూడ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల లోపు పార్కింగ్ చేయాలి. ఆ సమయం తర్వాత పార్కింగ్ చేయడానికి అనుమతి లేదు.