-
సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేయడంతో కాసం.. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో రేవంత్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రతినబూనిందని.. ఆ కుట్రలో భాగంగానే 2025లో భారత దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చబోతున్నారని.. అందుకే కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ రేవంత్ కాంట్రవర్శి కామెంట్స్ చేశారు. -
18 ఏళ్లుగా సాగదీత.. ఇంకా ఎన్నాళ్లో?
తాము ఏ సుద్దులు చెప్పిన... ఏ నీతులు చెప్పిన అవి ఎదుటి వారికే కాని తమకు కాదని ఈనాడు మీడియా గట్టిగా విశ్వసిస్తోంది. అందుకే ఈనాడు వారు తమకు ఇష్టం లేని వారిపై, లేదా తమ రాజకీయ ,వ్యాపార ప్రయోజనాలకు అడ్డం అవుతారని అనుకున్న వారిపై నానా బురద వేస్తుంటారు .పచ్చి అబద్దాలు రాయడానికి కూడా వెనుకాడడం లేదు .తెలుగుదేశం పార్టీకి , సీఎం చంద్రబాబుకు ,తమకు కొమ్ము కాసేవారికి మాత్రం రక్షణగా నిలబడుతుంది.గత ఐదేళ్లుగా వైఎస్ జగన్ పాలనపై ఎంత విషం చిమ్మిందో చూశాం. అప్పుడే కాదు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం కోల్పోయినా, ఇప్పటికి వారిపైనే చెడరాస్తోంది. పాపాల పుట్టలు అని... అవి అని, ఇవి అని ఇష్టరీతిలో హెడ్గింగ్లు పెడుతుంది .అదే తమకు సంబందించిన అక్రమాల గురించి మాత్రం నోరు విప్పితే ఒట్టు.మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సంబందించి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం, అందులో రామోజి సంస్థ అక్రమాలకు పాల్పడిందని , అర్హత లేకపోయినా డిపాజిట్ లు వసూలు చేసిందని ...శిక్షార్హ నేరమని స్పష్టంగా చెప్పినా కనీసం స్పందించ లేకపోయింది.వేలకోట్లకు సంబందించిన దందా అనండి ...స్కామ్ అనండి.. దానిపై నేరుగా వివరణ ఇచ్చే పరిస్థితి కూడా మార్గదర్శి ఫైనాన్శయర్స్ కాని...ఈనాడు మీడియాకు కాని ఉన్నట్లు లేదు.మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టుదలతో సాగించిన పోరాటంతో ఈ మాత్రం అయినా కదలిక వచ్చింది .లేకుంటే ఈ దేశంలో మీడియాను అడ్డంపెట్టుకుని ... ఎన్ని అరాచకాలకైనా పాల్పడవచ్చని, తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసి...తద్వారా ఎన్ని కైన ప్రభుత్వాల ద్వారా తమ అర్ధిక ప్రయోజనాలకు కాపాడుకోవచ్చని ఏవరైన భావించే పరిస్థితి ఏర్పడింది .తాజాగా ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించినప్పుడు జరిగిన పరిణామం చూస్తే మార్గదర్శి అనండి...దివంగత రామోజి రావు అనండి లేదా ప్రస్తుత యాజమాన్యం అనండి.. వారికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ఎంత పట్టు ఉన్నది అర్ధం అవుతుంది .ఏపిలోని చంద్రబాబు ప్రభుత్వం...తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కేసులో జవాబు ఇవ్వడానికే సిద్దం పడకపోవడం విశేషం. చంద్రబాబు అంటే ఏటూ టిడిపి కనుక అయన తోటి ఈనాడుకు ఉన్న సంబంధాల రీత్య అర్ధం చేసుకోవచ్చు. రామోజీ కాంగ్రెస్‌కు అనుకూలం కాదని తెలిసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎలాంటి సమాదానం ఇవ్వకపోవడం గమనించదగ్గ అంశం.బహుశా గురుశిష్యులు ఇద్దరు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవ్వడం మార్గదర్శి సంస్థకు కలిసి వస్తోందని అనుకోవాలి. ఈ రెండు రాష్ట్రాల న్యాయవాదులు మార్గదర్శి కేసు విచారణకు హజరు అయినా పూర్తిగా మాౌనం పాటించారట. దానిని మార్గదర్శి న్యాయవాది లుద్రా అనుకూలంగా మలచుకుని కేసును అలస్యం చేసేందుకు ప్రయత్నాలు ఆరంబించారని మీడియా కధనం. మొత్తం విషయం పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది .రెండు వేల ఆరువందల కోట్ల మేర అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారన్నది అభియోగం. అప్పటి ఎంపీ ఉండవెల్లి చేసిన ఫిర్యాదు వ్యవహరంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుని చివరకు ఈ దశకు చేరింది .మద్యలో ఏదో కారణం చూపి రామోజి ఈ కేసును ఉమ్మడి ఏపి హైకోర్టు విభజనకు ముందు రోజు కోట్టివేయించుకోగలిగారు .ఆ తర్వాత ఎప్పటికో ఈ విషయం తెలిసి ఉండవల్లి సుప్రీం కోర్టుకు వెళ్లి తన పోరాటం కోనసాగించారు . అసలు ఏప్పడో చర్య తీసుకోవాల్సిన ఆర్బిఐ ఇనాళ్లు మౌనంగా ఉండడం కూడా అశ్చర్యం కలిగిస్తోంది .తుదకు కోర్టు ఆదేశాలతో ఒక నివేదికను తయారు చేసి సమర్పించింది.అందులో మార్గదర్శి అక్రమంగానే డిపాజిట్లు వసూలు చేసిందని తేల్చింది .ఆర్బీఐ చట్టం లో సెక్షన్ 45 ఎస్ ను మార్గదర్శి ఉల్లంఘించిందని బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని తెలిపింది .ఈ కేసులో నేరాభియోగం రుజువు అయితే జైలు శిక్షతో పాటు డిపాజిట్ లుగా వసూలు చేసినదానికి రెండింతులు పెనాల్టి చెల్లించాల్సి ఉంటుంది .దీనితో మార్గదర్శికి, ఈనాడు వారికి మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది .ఒక్క సాక్షి తప్ప మిగిలిన మీడియా ఇంత పెద్ద వార్తను ప్రముఖంగా ఇవ్వకపోవడం కూడా వారి పలుకుబడిని తెలియచేస్తుంది .రామోజి రావు 2008 లో సమర్పించిన అఫడివిట్ ప్రకారం 2610 కోట్లు సేకరించారు .అందులో 1864 కోట్లు తిరిగి చెల్లించామని తెలిపారు .మరి మిగిలిన సుమారు 750 కోట్ల డిపాజిట్లు ఏం అయ్యాయి?అవి ఎవరివి అన్న అంశాలను మాత్రం గుట్టుగా ఉంచారు .అంతేకాదు 1864 కోట్లు ఎవరేవరికి చెల్లించారో జాబితా ఇవ్వడానికి రామోజి కుటుంబం సమ్మతించడం లేదని సమాచారం మీడియాలో వచ్చింది.ఆ వివరాలు వెల్లడిస్తే కొందరు పెద్దలు ...అందులో ముఖ్యంగా టిడిపి వారికి చెందిన నల్లధనం బట్టబయలు అవుతుందని ..బినామి పేరుతో తాము పెట్టిన దందా వెల్లడి అవుతుందని రామోజీ కుటుంబం అందోళన చెందుతున్నట్టు సాక్షి పత్రిక నేరుగా అరోపించింది .ఈనాడు వారు కాని ...మార్గదర్శి వారు కాని ,రామోజి రావు కుమారుడు కిరణ్ , కోడలు శైలజ కాని ఏ మాత్రం విలువలు పాటించేవారైనా, ఖచ్చితంగా వీటికి సమాదానం చెప్పగలగాలి. అలా చెప్పడం లేదంటే దాని అర్దం వారు తప్పు చెసినట్టు అంగీకరించడమే .ఊరందరికి నీతులు చెప్పే ఈనాడు మీడియా ఈ విషయంలో ఉన్న గుట్టుముట్లను ఎందుకు విప్పడం లేదు అంటే ...దీని ఱర్ధం ఈ విషయాలు వెలుగులోకి వస్తే తమ పాపాల పుట్ట బయటపడుతుందా అన్న భయమా అనే సందేహం వస్తే తప్పు ఏముంది.దేశంలో ఉన్నవారందరని పారదర్శకంగా ఉండాలని నీతులు రాస్తూ ...కథలు చెబుతూ ఉండే ఈనాడు, మార్గదర్శిల యాజమాన్యం ఇప్పటికైనా ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేసినట్టుగా డిపాజిట్ లు ఏవరేవరికి చెల్లించారో వెల్లడించాలి.అలాగే ఎవరికి చెల్లించని 750 కోట్ల డిపాజిట్ ల రహస్యం ఏంటో తెలపాలి.అదంతా నల్లధనం కాదని ,తాము పద్దతిగా వ్యాపారం చేస్తున్నామని చెప్పగలగాలి.అలాగే చంద్రబాబు,రేవంత్ ప్రభుత్వాలు కూడా ఈ డిపాజిట్ లకు సంబందించి వాస్తవాలను తమ అఫడవిట్ ల ద్వారా తెలియచేయాలి.లేకుంటే ఈ రెండు ప్రభుత్వాలకు ఈనాడు మీడియాకు మద్య క్విడ్ ప్రో కో సాగుంతుందని జనం అభిప్రాయపడతారు . అరుణకుమార్ చేసిన విజ్ఞప్తికి రెండు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?అన్నది డౌటే.ఒకవేళ స్పందించినా, అది మార్గదర్శికి, ఈనాడు వారికి అనుకూలంగానే ఉండవచ్చు. నిజానికి ఉండవల్లి తన వాదనలో చెప్పినట్టు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యకు దిగితే మొత్తం లోగుట్టులు అన్ని బహిర్గతం అవుతాయి. కాని ఇప్పుడు ఉన్న వాతావరణం గమనిస్తే అది అంత తేలిక కాకపోవచ్చు. పద్దేనిమిది ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహరంలో ఎంతకాలం వీలైతే , అంత కాలం ఈ కేసును సాగదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కేసుల వల్లే మన వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడుతుంది .ప్రజల్లో విశ్వాసం నెలకోనాలంటే కనీసం న్యాయవ్యవస్థ అయినా ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది .అది జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
రేవంత్‌ను క్షమించాలని యాదాద్రి స్వామిని ప్రార్థించా: హరీష్ రావు
సాక్షి, యాదాద్రి: ఎన్ని కేసులు పెట్టినా చివరి రైతుకు రుణమాఫీ జరిగే వరకు తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రపంచం తలకిందులు అయినా ఆగష్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్.. మాట తప్పారని విమర్శించారు. రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ అంశంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ హరీష్ రావు ఆలయాల పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా గురువారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని ఆరోపించారు. పాలకుడు మాట తప్పితే తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ ఆలయంలో పాప పరిహార పూజలు చేసినట్లు తెలిపారు.‘రైతులనే కాదు దేవుడిని రేవంత్ మోసం చేశాడు. కేసీఆర్ ఆదేశిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది. పార్టీ మారిన చరిత్ర నీది. రేవంత్ రుణమాఫీ అయింది అంటున్నాడు. మంత్రులు కాలేదని అంటున్నారు. ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల రుణమాఫీ పూర్తిగా కాలేదని అంటున్నారు. 42 లక్షల మందిలో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది. 46 శాతం మాత్రమే రుణమాఫీ పూర్తి అయ్యింది. దేవుళ్లపై ప్రమాణం చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్‌ది.బహిరంగంగా రేవంత్ క్షమాపణ చెప్పాలి. దేవుళ్ల వద్దకు వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల మొఖం చూసి రేవంత్ ను క్షమించాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించా. బోనస్ ఇస్తామని మోసం చేశాడు. రైతులు, అన్ని వర్గాల పక్షాన పోరాడే శక్తిని ఇవ్వాలని దేవుణ్ణి కోరాం. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మూడు వందల రోజులు వచ్చినా అమలు కాలేదు. ఎంత మందికి రుణమాఫీ చేశావో శ్వేతపత్రం విడుదల చేయాలి. రైతు భరోసా కింద 7500 కోట్లు గతంలో కేసీఆర్ ఇచ్చేవారు. అవెప్పుడు ఇస్తావు? స్పీకర్, ఎమ్మెల్యేలకు రుణమాఫీ చేసి చిన్న చిన్న ఉద్యోగులకు ఎందుకు కోత పెడుతున్నావు? రేవంత్ ఏ చోట ప్రమాణం చేశాడో అన్ని చోట్లకు పోతాం. రేవంత్ దేవాలయాలన్నింటినీ శుద్ధి చేయాలి. కాంగ్రెస్ మంత్రులు వెరైటీగా ఉన్నారు. రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయమంటే నన్ను రాజీనామా చేయమంటున్నారుకాంగ్రెస్ ప్రజా పాలనలో ధర్నాలు నిషేదం అంటూ రైతులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. జర్నలిస్ట్ సరితపై రేవంత్ అనుచరులు దాడి చేశారు. ఆదిలాబాదులో పోలీస్ యాక్ట్ తీసుకొచ్చారు. వీటన్బింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాం. లాఠీలతో మోసాన్ని అడ్డుకోలేరు. రుణమాఫీ చేస్తామని రైతులతో రైతులతో రణం చేస్తున్నాడు. రుణమాఫీ కాలేదంటే రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నావు. ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమా?’ అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. -
రుణమాఫీపై సమాధానం చెప్పే దమ్ము సీఎం రేవంత్‌కు లేదు: కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే రుణమాఫీపై తమ ఆందోళనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.కోతలు లేకుండా రూ. 2 లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రేవంత్ అనేక హామీలు ఇచ్చారని, ఒక్క సంతకంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారని గుర్తు చేశారు. రుణమాఫీ చేస్తామని అనేక దేవుళ్లపై ఒట్లు పెట్టిన సీఎం రేవంత్.. రుణమాఫీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేయకుండా దైవద్రోహానికి పాల్పడ్డారని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో దీనిపై ప్రశ్నిస్తే తమనే దబాయించారని, సభలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఏడిపించారని అన్నారు. రుణమాఫీ, హామీలపై సమాధానం చెప్పే దమ్ము సీఎం రేవంత్‌కు లేదన్నారు. -
పావుశాతం మాఫీతో వంద శాతం మోసం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను పచ్చి దగా చేస్తోందని, రైతులందరికీ రుణమాఫీ జరిగేంత వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. కేవలం పావు శాతం రుణమాఫీతో వంద శాతం రైతులను మోసం చేశారని.. ఈ అంశంపై సీఎం, మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ కోరుతున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం ఏమిటని నిలదీశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని, ఆయన పన్నిన వలలో తాము చిక్కుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసేలా ప్రభుత్వం మెడలు వంచేందుకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘రైతు ధర్నా’ కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.. ‘‘సీఎం రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు రైతులకు ఎంత మేర రుణం మాఫీ అయిందో కూడా సీఎం, మంత్రులకు తెలియనట్టుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమయ్యాయని చెప్తున్నారు. నిజంగా వంద శాతం రుణమాఫీ అయి ఉంటే రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో సీఎం చెప్పాలి..’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఆందోళన చేస్తూ, బ్యాంకులను ముట్టడిస్తున్నారని.. రైతు రుణమాఫీ కోరుతున్న రైతులపై ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, బజార్‌హత్నూర్‌లలో ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. కేసులను ఉపసంహరించుకోని పక్షంలో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి జైల్‌భరోకు పిలుపునిస్తామని చెప్పారు. లక్షలాది మంది రైతులను మోసం చేసిన ప్రభుత్వంపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. బజారు భాషకు వ్యతిరేకంగా పాలాభిషేకాలు ‘‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నందుకు సీఎం రేవంత్ బజారు భాష మాట్లాడారు. ఆ బజారు భాషకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి రైతు ధర్నాను ప్రారంభించాలి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం నియోజకవర్గం కొడంగల్‌లోని కోస్గి మండలంలో ఐదు బ్యాంకుల్లో కలిపి 20,239 రైతు ఖాతాలుంటే.. కేవలం 8,527 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పారు. రుణమాఫీకి ఎన్నో కుంటిసాకులు చెబుతూ ఆంక్షలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుబంధుకు ఇంకెన్ని ఆంక్షలు పెడుతుందోననే అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండాం వెంటాడుతాం, వేటాడుతామని చెప్పారు. రేవంత్ ఫామ్‌హౌజ్‌ను కూల్చివేయాలి హైడ్రా పేరిట హైడ్రామా ఆపండి.. ‘‘జన్వాడలో నాకు ఎలాంటి ఫామ్‌హౌజ్ లేదు.. ఓ మిత్రుడి ఫామ్‌ను లీజుకు తీసుకున్నా. ఒకవేళ ఆ ఫామ్‌హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి. ప్రభుత్వానికి దమ్ముంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, మహేందర్‌రెడ్డి, వివేక్ వంటి కాంగ్రెస్ నాయకుల రాజభవనాలు కూడా కూల్చేయాలి. ఇప్పటికైనా హైడ్రా పేరుతో చేస్తున్న హైడ్రామా ఆపాలి..’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే అన్ని అక్రమ నిర్మాణాలను ఒకేరోజు కూల్చాలని.. రేవంత్‌రెడ్డి అ«దీనంలోని అక్రమ నిర్మాణాలను కూడా కూల్చి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు. -
ఇంఛార్జి హోదాలో అభయ్ పాటిల్..కన్ఫ్యూజన్లో తెలంగాణ బీజేపీ శ్రేణులు
హైదరాబాద్,సాక్షి : తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా కర్ణాటక నేత అభయ్ పాటిల్‌ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. కానీ నేతలు మాత్రం ఇంఛార్జి నియామకం జరగలేదని అంటున్నారు. దీంతో తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి ఎవరనే అంశం చర్చకు దారి తీసింది. హైదరాబాద్ వేదికగా తెలంగాణ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి హోదాలో అభయ్ పాటిల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చారు. అభయ్ పాటిల్ నియామకం జరగలేదని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.దీంతో రాష్ట్ర ఇంఛార్జిగా హోదాలో పార్టీ పంపితేనే తాను సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చానని సభా వేదికపై అభయ్ పాటిల్ తెలిపారు. పార్టీ ఎక్కడికి పంపినా తాను వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని..సొంతంగా తాను ఇక్కడికి రాలేదని అభయ్ పాటిల్ స్పష్టం చేశారు.మరోవైపు తెలంగాణ బీజేపీ అధికారిక వెబ్సైట్లో తెలంగాణ బీజేపీ ఇంఛార్జిగా అభయ్ పాటిల్ ఫోటోతో పేరు సైతం ఉండడంతో కమలం శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. స్పష్టత ఇచ్చిన కిషన్ రెడ్డిగత వారం తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా తరుణ్ ఛుగ్ స్థానంలో కర్ణాటక బీజేపీ నేత అభయ్ పాటిల్‌ను అధిష్టానం నియమించిందని వార్తలు వచ్చాయి. దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా అభయ్ పాటిను నియమించినట్లుగా వార్తలు వస్తున్నాయని, కానీ కేంద్ర అధిష్టానం ఎవరిని నియమించలేదని స్పష్టం చేశారు. -
రేవంత్ ఫాంహౌజ్ ఎక్కడుందో చూపిస్తా: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: జన్వాడ ఫామ్‌హౌజ్ వ్యవహారం కోర్టుకి ఎక్కిన వేళ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆ ఫామ్ హౌజ్ తనది కాదని, నిబంధనలకు విరుద్ధంగా అది కట్టి ఉంటే తాను కూల్చివేయిస్తానని అన్నారాయన. ఈ క్రమంలో కాంగ్రెస్ మంత్రులపైనా ఆయన విమర్శలు సంధించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. నా పేరుతో ఏ ఫాంహౌజ్ లేదు. నా ఫ్రెండ్ ఫాంహౌజ్ లీజ్‌కు మాత్రమే తీసుకున్నా. ఫాంహౌజ్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉంటే నేనే కూలగొట్టిస్తా. నాకు కాదు.. కాంగ్రెస్ బడా నేతలకే ఫాంహౌజ్‌లు ఉన్నాయి. పొంగులేటి, మహేందర్‌రెడ్డి, మధుయాష్కీలకే ఎఫ్టీఎల్లో ఫాంహౌజ్‌లు ఉన్నాయి. రేవంత్ ఫాంహౌజ్ ఎక్కడుందో కూడా చూపిస్తా. హైడ్రానో.. అమీబానో తీసుకుని పోదాం అని మండిపడ్డారాయన. .. పొంగులేటి తమ్ముడు కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నారు. వివేక్ ఫాంహౌజ్‌ను ఎఫ్టీఎల్ పరిధిలో ఎలా కట్టారు?. మంత్రుల ఫాంహౌజ్లతోనే కూల్చివేతలు ప్రారంభించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారాయన. -
రవ్వంత చేసి కొండంత డబ్బా
హైదరాబాద్, సాక్షి: రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని, అందుకు మంత్రుల మాటలే సాక్ష్యం అని చెబుతూ.. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులకు టోపీ పెట్టారు. రుణమాఫీ పచ్చి బూటకమనేది అర్థమవుతోంది. రవ్వంత చేసి కొండంత డబ్బా కొట్టుకుంటున్నారు. రుణమాఫీ విషయంలో వాళ్లలో వాళ్లకే సమన్వయం లేనట్లుంది. అందుకే ముఖ్యమంత్రి, మంత్రులు తలోమాట చెబుతున్నారు. రుణమాఫీ విషయంలో కాంగగ్రెస్ ఘోరంగా విఫలమైంది. అందుకే.. అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడింది. తెలంగాణ రైతాంగం రగిలిపోతోంది. రైతులకు ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేపడతాం అని కేటీఆర్ అన్నారు. -
చంద్రబాబూ.. జగన్‌లా మీరు చేయలేరా? ఉండవల్లి హాట్ కామెంట్స్
తూర్పుగోదావరి, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని, కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా స్పందిస్తారో చూడాలని మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో జగన్ ఇంప్లీడ్ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. బుధవారం ఉదయం రాజమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. మార్గదర్శి తరపున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపిస్తూ.. రెండు వారాల సమయం కోరారు. తాము ఎవరెవరికి డబ్బు చెల్లించామో 70 వేల పేజీల్లో సుప్రీంకోర్టుకు వివరాల్ని మార్గదర్శి సబ్మిట్ చేసింది. కట్టిన డబ్బుల ఇచ్చారే తప్ప వడ్డీ ఇవ్వలేదని పలువురు మార్గదర్శి ఫైనాన్స్ ఖాతాదారులు నన్ను అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా డబ్బు అందేందో లేదో పరిశీలించమని ఒక జ్యుడీషియరీ అడ్వైజర్ ను హైకోర్టులో నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..ఇదీ చదవండి: టీడీపీకి ఇది నల్ల ఖజానా.. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధం. 2006లో అప్పటి ఫైనాన్స్ శాఖా మంత్రి చిదంబరానికి నేను చెప్పిందే.. ఇప్పుడు ఆర్బీఐ కూడా చెప్పింది. ఆర్బీఐ అఫిడవిట్‌తో నేను చెప్పిందే నిజమైంది. మార్గదర్శిపై నా పోరాటాన్ని మరోలా వక్రీకరించారు. ఇదేదో వైఎస్సార్ చెప్పటం వల్లే నేను చేశానని అందరూ అనుకుంటున్నారు... అది నిజం కాదు. ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఏ చిట్‌ఫండ్ కంపెనీ కూడా చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరించడం లేదు. ఇటీవలె కాకినాడలో జయలక్క్క్ష్మి చిట్‌ఫండ్ కంపెనీ ఎత్తేశారు. మార్గదర్శి.. చిట్‌ఫండ్ యాక్ట్‌ను బ్యాడ్ లాగా పేర్కొంది. రామోజీరావు అనుసరించకపోవడం వల్లే తాము అదే ఫాలో అవుతున్నామని చెబుతున్నారు. ఈ విషయంలోనే నాపై మార్గదర్శి కంపెనీ కూడా కేసు కూడా వేసింది. రామోజీరావు కేసులో ప్రెస్‌మీట్ చెప్పిన అందరిని జైల్లో వేస్తున్నారు. మిగిలిన వారెవరు ప్రశ్నించకుండా ఉండేందుకు మార్గదర్శి నాపై పరువు నష్టం దావా కేసు వేశారు.సంబంధిత వార్త: మార్గదర్శి దందాకు క్విడ్ ప్రోకో కుట్ర.. మార్గదర్శి చిట్ ఫండ్స్ నాపై 50 లక్షలు పరువు నష్టం దావా వేశారు.. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్ లో ఉంది. మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే నేను ఆ కేసు నుంచి బయటపడగలను. మార్గదర్శి చిట్స్ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్ లోకి వెళ్లి.. అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్ళింది. ఈనాడు పేపర్ ను అడ్డం పెట్టుకుని రామోజీరావు ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు. హెచ్ఎఫ్ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉంది. .. సెప్టెంబర్ 11 కి వాయిదా ఉంది. మార్గదర్శి కేసులో విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఇటు రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించలేదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ కావడంతో కేసుకు కాస్త బలం వచ్చింది. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు రామోజీరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నారు. కాబట్టి ఎలా స్పందిస్తారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే గౌరవం నిలబడుతుంది. కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప అన్యాయం జరగదు. రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. సీఎం హోదాలో చంద్రబాబు విచారణకు సహకరించాలి. వెంటనే రెండు ప్రభుత్వాలు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి’’ అని ఉండవల్లి కోరారు.ఏపీ ఎన్నికల ఫలితాలపైనా.. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఐదు మండలాలు తిరిగి వెనక్కి ఇచ్చేయమని తెలంగాణ కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైయస్ జగన్ ఎలా అఫిడవిట్ ఫైల్ చేశారో.. మీరు కూడా అదే చేయమని చంద్రబాబును కోరుతున్నాను. స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రకటించిన 11 రాష్ట్రాల్లో తెలంగాణ ను ఎందుకు చేర్చారో తెలియటం లేదు. మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 12.5% తేడా ఉందన్న ప్రకటించారు.. దీనిపై ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయిన ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలి. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలి. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో .. స్పష్టం తెలియాలి అని ఉండవల్లి డిమాండ్ చేశారు. -
కశ్మీర్ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ ప్లాన్
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ స్కెచ్ గీసింది. ఈ క్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను మళ్లీ తెర మీదకు తెచ్చింది. ఆయన్ని జమ్ము కశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జీగా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. 2014 ఎన్నికల్లో జమ్ము కశ్మీర్లో బీజేపీని అధికారంలోకి(సంకీర్ణం) తీసుకురావడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. రామ్ మాధవ్ దాదాపు ఆరేడు సంవత్సరాల పాటు బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అక్కడి రాజకీయాలపై అనుభం ఉన్న రామ్‌మాధవ్‌ను బీజేపీ మళ్లీ రంగంలోకి దించింది. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రంకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల ఇన్‌చార్జీగా రామ్‌మాధవ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఇన్‌చార్జీగా రామ్‌మాధవ్ కీయాశీలక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్‌లో దుమారం..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాలలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌లో అలజడిని సృష్టిస్తున్నాయి. గద్వాల జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మధ్య వర్గ పోరు ఆ పార్టీని అతలాకుతలం చేస్తోంది. ఇటీవల ప్రాజెక్ట్‌ల సందర్శనలో సరిత వర్గీయులు మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై ‘హస్తం’లో దుమారం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లగా.. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే ఇలా చేయడం ఏమిటంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాల క్రమంలో బండ్లపై ఆయన వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది.తొలి నుంచీ వైరం.. పై‘చేయి’ కోసం..బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సరిత, బండ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం తారస్థాయికి చేరింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న సరిత గులాబీ టికెట్ ఆశించగా నిరాశ ఎదురైంది. దీంతో కాంగ్రెస్‌లో చేరిన ఆమె గద్వాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి బండ్ల చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పరిణామ క్రమంలో కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఇరువురి మధ్య మళ్లీ పోరు తారస్థాయికి చేరింది. ఆయన చేరికను చివరి వరకు అడ్డుకోగా.. అధిష్టానం నచ్చజెప్పడంతో ఆమె వెనక్కి తగ్గారు. అయినా పార్టీలో బండ్ల చేరిక కార్యక్రమానికి ఆమె దూరంగానే ఉన్నారు. జెడ్పీ చైర్పర్సన్ పదవీ కాలం ముగిసినా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో తన ఆధిపత్యం ప్రదర్శించేలా సరిత, ఆమె వర్గీయులు ముందుకు సాగుతుండడంతో పార్టీలో చేరిన ఎమ్మెల్యే బండ్ల సైతం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.భేటీలోనూ ఘాటు సంభాషణ..?జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి ఇటీవల గద్వాల నియోజకవర్గానికి వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా ఆయన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఇరువురు కలిసి ప్రాజెక్ట్‌లను సందర్శించేందుకు వెళ్తున్న క్రమంలో సరిత ఇంటికి వెళ్లకుండా ఎలా వెళ్తారని ఆమె వర్గీయులు మంత్రి వాహనాన్ని అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మంత్రి చేసేదేమీ లేక సరిత ఇంటికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. ఏ సందర్భంలో రావడం జరిగిందో సరితకు మంత్రి వివరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేరిక నేపథ్యంపై పాత దోస్తాన్‌తో పార్టీలోకి తీసుకొచ్చారనే అంశం చర్చకు రాగా.. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరిగిందని మంత్రి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య సంభాషణ ఘాటుగానే సాగినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
తొలిరోజే చెత్తను ఎత్తేస్తాం.. గుర్తు పెట్టుకో ‘చీప్ మినిస్టర్’: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘నా మాటలు గుర్తు పెట్టుకో ‘చీప్ మినిస్టర్’.. అధికారంలోకి వచ్చిన తొలిరోజే బీఆర్ అంబేడ్కర్ సచివా లయం పరిసరాల్లో చెత్తను తొలగిస్తాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు విషయమై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘నీలాంటి ఢిల్లీ గులామ్‌లు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అర్థం చేసుకోలేరు. చిన్న పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన సీఎం నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తుంది. ఆయన మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్ పేర్కొన్నారు.చిరువ్యాపారులపై వేధింపులా?‘నిజామాబాద్‌లో పోలీసుల వేధింపులు భరించలేక ఓ స్వీట్ షాపు యజమాని తన దుకాణం ముందు బ్యానర్ ఏర్పాటు చేశాడు. ఓ వైపు నిజామాబాద్‌లో పోలీసులు చిరు వ్యాపారులను వేధిస్తుంటే మరోవైపు వరంగల్‌లో ఓ ఏసీపీ రద్దీగా ఉండే రోడ్డుపై మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. కేట్ కట్ చేసి బాణసంచా పేల్చడంతో గాయపడిన నలుగురు అమాయక పౌరులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు..’ అని కేటీఆర్ తెలిపారు. ‘మహబూబాబాద్‌లో ఓ 17 ఏళ్ల బాలిక స్థానిక గూండా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో మూడురోజుల పాటు కొన ఊపిరితో కొట్లాడిన ఆ బాలిక తన సోదరులకు రాఖీ కట్టి కన్నుమూసింది. ఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు లేవు..’ అని కేటీఆర్ మండిపడ్డారు. సంపూర్ణ రుణమాఫీ కోసం రేపు బీఆర్ఎస్ ధర్నాఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో జరిగే ధర్నాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘రుణమాఫీ జరగకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ చెప్తుండగా, మంత్రులు మాత్రం రుణమాఫీ పూర్తికాలేదనిం, ఇంకా కార్యక్రమం కొనసాగుతోందని చెప్తున్నారు. సీఎం, మంత్రుల భిన్న ప్రకటనలతో రైతులు ఆయోమయం, ఆవేదనకు గురవుతున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అందరికీ వర్తింపజేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చింది.కానీ కనీసం 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదు. దీంతో లక్షలాది మంది రైతులు రోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి దాపురించింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేసేవరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు..’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ ఫిర్యాదుపంజగుట్ట: మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమనేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం రాత్రి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్‌లు పంజగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్‌కు ఫిర్యాదు పత్రం అందజేశారు. రేవంత్‌రెడ్డి అభ్యంతరకరమైన భాష, దూషించే పదజాలం, హింసను ప్రేరేపించేలా చేసిన వ్యాఖ్యలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాలు, న్యాయనిపుణుల సలహా ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని ఇన్స్పెక్టర్ చెప్పారు. -
చెయ్యి వేస్తే చెప్పుతెగుడే! : రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్‌గాంధీ తన ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ఆయన సతీమణి సోనియాగాందీతోనే 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కల సాకారమయింది. రాజీవ్ విగ్రహాన్ని సచివాలయం ముందు పెడతామని మేం చెపితే ఒక సన్నాసి అధికారంలోకి రాగానే తొలగిస్తాం అంటున్నాడు. నీ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రాణమిచ్చిన రాజీవ్‌గాంధీ విగ్రహం తీసేస్తావా? నీకు మళ్లీ అధికారమనేది కలలో మాట. రాజీవ్‌గాంధీ విగ్రహం తీస్తా అని మాట్లాడుతావా? చింతమడకకు పోతవు బిడ్డా.. రాజీవ్ విగ్రహం దగ్గరకు పోతే వీపు చింతపండు అయితది. రాజీవ్‌గాంధీ విగ్రహం తీయడానికి నువ్వు ఎప్పుడొస్తవో తారీఖు చెప్పు. మా జగ్గన్నకు చెప్తా.. ఆయన వచ్చి అక్కడ ఉంటడు. అప్పుడు తెలుస్తది బిడ్డా నీకు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమయితదో? ఎవడైనా చేతనైతే రాజీవ్‌గాంధీ విగ్రహం మీద చెయ్యి పెట్టండి బిడ్డా.. చెప్పు తెగకపోతే చూస్తా నేను..’ అని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని, వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని, ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందు పెడితే ఇప్పటి పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారని ప్రశ్నించారు. పొద్దున్నుంచి రాత్రి వరకు తాగి ఫామ్‌హౌస్‌లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం సచివాలయం ముందు ఉండాలా? దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహం ఉండాలా? అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలని అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 80వ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి రేవంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎంపీ వి.హనుమంతరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు పరుష పదజాలంతో కౌంటర్ ఇచ్చారు. వాళ్లయ్య పొయ్యేదెప్పుడు? వీడు పెట్టేదెప్పుడు? ‘దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, దేశం కోసం ప్రాణాలిచ్చి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబానికి చెందిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు అమరవీరుల స్తూపం పక్కన ఏర్పాటు చేయడమే సముచితం. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయని సన్నాసులకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. అధికారం పోయినా వారికి బలుపు తగ్గలేదు. ఆ బలుపు అణగదీసే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. రాజీవ్‌గాంధీ విగ్రహం తీసేస్తానన్న సన్నాసి బాధ ఏంటో కనుక్కుంటే.. అక్కడ వాళ్ల అయ్య విగ్రహం పెడదామని అనుకున్నాడని తెలిసింది. వాళ్లయ్య పొయ్యేదెప్పుడు? వీడు పెట్టేదెప్పుడు?..’ అంటూ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్‌గాందీ. ‘నీకు ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తుకొచ్చిందా? ఇన్నిరోజులు గాడిదలేమైనా కాసినవా? సచివాలయం బయట కాదు.. 2024 డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపలే ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేం తీసుకుంటాం. అధికారం కోల్పోయి విచక్షణా రహితంగా, అసహనంతో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ నుంచి సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తుంది. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగ విగ్రహం పెడితే తెలంగాణ వాళ్లందరూ దొంగలుగా తయారవుతారు. సచివాలయం ముందు దొంగలు, తాగుబోతులకు స్థానం లేదు. దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్‌గాంధీ. దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిందీ, మహిళలకు రాజకీయ సాధికారత కల్పించి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిందీ రాజీవ్గాందీయే. త్వరలోనే పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఆయన విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేస్తాం..’ అని రేవంత్ చెప్పారు. మాజీ ఐటీ మంత్రికి ఆ మాత్రం తెలియదా?: భట్టి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఐటీ రంగానికి పునాది వేసింది రాజీవ్‌గాం«దీయేనని అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ విస్తరణకు ఎవరు కృషి చేశారో.. విదేశాల్లో చదువుకున్నామని చెప్పుకునే వారికి, ఐటీ మినిస్టర్‌గా పనిచేశానని చెప్పుకునే వ్యక్తికి తెలియదా? అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణే‹Ù, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం: సీఎం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిలతో కలిసి.. సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. భవన ప్రధాన ద్వారం ముందు విగ్రహం ఏర్పాటు, స్థలం, డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించామని తెలిపారు. ఇందులో భాగంగానే సచివాలయ ఆవరణను పరిశీలించామన్నారు. -
కాంగ్రెస్ X బీఆర్ఎస్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్, బీఆర్ఎస్ల పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణతో సిద్దిపేటలో మంగళవారం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ చేపట్టింది. మరోవైపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంపూర్ణ రైతు రుణమాఫీ సాధనకు సమావేశం నిర్వహించారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొనగా, 500 మంది పోలీసులను మోహరింపజేశారు. కాంగ్రెస్ భారీ ర్యాలీముందుగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హైదరాబాద్ నుంచి కార్ల ర్యాలీతో సిద్దిపేటకు చేరుకున్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా పొన్నాల జంక్షన్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ పాత బస్టాండ్ వరకు సాగింది. హరీశ్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. పొన్నాల వై జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు పోలీసులు ర్యాలీకి అనుమతినిచ్చారు. బీఆర్ఎస్ సమావేశ నేపథ్యంలో హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయం ఎదుట నుంచి కాకుండా బైపాస్ (సుడా రోడ్) నుంచి ఎన్సాన్పల్లి జంక్షన్ మీదుగా విక్టరీ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీని పంపించారు. ఎమ్మెల్యే రోహిత్ కారు క్యాంప్ ఆఫీస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా వెంటనే మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు వచ్చి సుడా రోడ్డుకు మళ్లించారు.ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకోగా స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ రైతు రుణమాఫీ 200 శాతం చేశామని, హరీశ్ రాజీనామా చేయాల్సిందేనన్నారు. బీఆర్ఎస్ సమావేశంసిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంలో సంపూర్ణ రైతు రుణమాఫీ సాధన కార్యాచరణ సమా వేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు దేవిప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతోపాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశపతి మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పంచాయితీ కాదని, రైతులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయితీ అని అన్నారు. -
దమ్ముంటే రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయ్: కేటీఆర్‌కు జగ్గారెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే మేము ఖాళీగా ఉన్నామా అంటూ కేటీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ చీఫ్ లిక్కర్ తాగినట్టుగా ప్రవర్తిసున్నారంటూ దుయ్యబట్టారు.‘‘తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపల పెడతామని రేవంత్ అన్నారు. రాజీవ్ విగ్రహం ముట్టుకుంటే చెప్పుతో కొడతానన్న సీఎం వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.పొలిటికల్ కోచింగ్ సెంటర్లో కేటీఆర్ ట్రైనింగ్ తీసుకుంటే మంచిది. కేటీఆర్‌కు ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలియడం లేదు. కేసీఆర్.. కేటీఆర్‌కు కోచింగ్ ఇప్పిస్తే మంచిది. పదేళ్ల కాలంలో జర్నలిస్టుల సమస్యల కోసం, ప్లాట్ల కోసం ఏనాడైనా అల్లం నారాయణ కోట్లాడిండా?’’ అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. -
సీఎం కుర్చీపై పొంగులేటి కన్ను: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కర్ణాటకలో డీకేశివకుమార్‌లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తున్నాడని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘పొంగులేటి ఇక్కడ డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీలో కదిపే పావులు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకేదో పదవి ఆశిస్తున్నాడనిపిస్తోంది.పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను సీఎం పదవిపై పడింది. సీఎంను కాదని కొడంగల్ అబివృద్ధి కాంట్రాక్టు పొంగులేటికి వచ్చింది. భట్టి ఉపముఖ్యమంత్రిగా సెకండ్ ప్లేస్‌లో లేరు. అమెరికా పర్యటనలో రేవంత్ తీసుకొచ్చిన వేల కోట్లు ఎప్పుడు వస్తాయి? ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? సీఎం కుటుంబ సభ్యుల్లో ఎవరెంత పెట్టుబడి పెడుతున్నారు. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వాలి. మంత్రిగా ఉన్న వ్యక్తి కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు రావడం చరిత్రలో లేదు. ఎస్కేలేషన్, ప్రైస్ హైక్ మీద మాకు అనుమానం ఉంది. తన వెంట కొంత మంది ఎంఎల్ఏలు ఉన్నారని భయపడి పొంగులేటి కి కాంట్రాక్టు ఇచ్చారా? సీఎం సమాధానం చెప్పాలి. కొంత మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని పొంగులేటి సీఎంను బ్లాక్మెయిల్ చేస్తున్నారు’అని మహేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. -
రుణమాఫీపై బీఆర్ఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22వ తేదీన మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.రాష్ట్రంలో 40 శాతం మంది రైతన్నలకు కూడా రుణమాఫీ అందలేదని.. సీఎం రుణమాఫీ పూర్తయిందని మాటలు చెప్తుంటే.. మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అనేక ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయలని.. అప్పటిదాకా ప్రభుత్వంపైన పోరాటం ఆగదని కేటీఆర్ హెచ్చరించారు. -
రుణమాఫీ చేయలేకే.. విగ్రహాల లొల్లి: బండి సంజయ్
సాక్షి,కరీంనగర్ జిల్లా: రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీ స్కీమ్‌ల హామీలపై చర్చను మళ్లించడానికే కాంగ్రెస్,బీఆర్ఎస్ విగ్రహాల లొల్లి ముందుకు తీసుకు వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ ఆరోపించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాల్ ప్రతి సవాల్ ప్రజల దృష్టిని మళ్ళించడానికే. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కేటిఆర్ కూల్చుతామంటే ఎలా కూల్చుతారో చూస్తామని కాంగ్రెస్ అనడం ఆ రెండు పార్టీలు కూడబలుక్కుని మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.అసలు విగ్రహాలు సమస్యనా?...రైతులు రుణమాఫీ కాక, రైతుబంధు అందక సమస్యలతో సతమతం అవుతున్నారు. దానిపై చర్చించకుండా విగ్రహాలపై మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ బోగస్. ఆరు గ్యారంటీ స్కీమ్‌ల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలి’అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
హరీశ్‌రావు.. నాపై పోటీ చేయి: మైనంపల్లి సవాల్
సాక్షి,సిద్దిపేటజిల్లా: సిద్దిపేట పట్టణంలో మంగళవారం(ఆగస్టు20) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ర్యాలీలతో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పట్టణంలో మంగళవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ ర్యాలీలకు పిలుపునివ్వడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటూ తరలి వెళుతున్నారు. దీంతో వీరిరువురి మధ్య ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది.‘మేం ధ్వజం ఎత్తాలనుకుంటోంది బీఆర్ఎస్పైన.. హరీష్ రావుపైనో ప్రజలపైనో కాదు. ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారు. మేం ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకున్నాం.వారు రేపు కూడా రైతు రుణమాఫీ ర్యాలీ చేసుకోవచ్చు. కానీ, మా ర్యాలీ అడ్డుకునేందుకే పోటాపోటీ ర్యాలీ పెట్టి ఉద్రిక్తతలు పుట్టిస్తున్నారు. వాళ్ల అంతు చూసేదాకా వదలబోం. రుణమాఫీ చేసినందున హరీశ్‌రావు మళ్లీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఇద్దరం మళ్లీ పోటీ చేద్దాం. హరీశ్ మళ్లీ గెలిస్తే నేను రాజకీయాల్లో నుంచి వెళ్లిపోతా’అని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు సవాల్ విసిరారు. అయితే రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ర్యాలీకి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చెబుతున్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. తాము కూడా ర్యాలీ చేసి తీరుతామని బీఆర్ఎస్ శ్రేణులు తెగేసి చెబుతున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. -
రేవంత్.. నా మాటలను గుర్తు పెట్టుకో: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన రోజునే తొలగిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చీప్ మినిస్టర్ రేవంత్ నా మాటలను గుర్తు పెట్టుకో అని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘మీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేం. బడి పిల్లల ముందు నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ నీచమైన ఆలోచన విధానాన్ని చూపుతుంది. మీరు మానసిక అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’అని కేటీఆర్ అన్నారు.Mark my words Cheap Minister RevanthWe will clear out the trash from the surroundings of Dr. B. R. Ambedkar secretariat the very same day we are back in officeCan’t expect a Delhi Ghulam like you to ever understand self-respect & pride of Telangana Using filthy language in…— KTR (@KTRBRS) August 20, 2024ఇదిలా ఉండగా.. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం సోమాజిగూడలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే.. కొంతమంది తొలగిస్తామంటున్నారు. ఎవరికైనా చేతనైతే విగ్రహాన్ని ముట్టుకోండి.. వాళ్లను కొట్టి తీరతామంటూ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన. ఆ బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగిస్తామని అన్నారాయన. రాజీవ్ విగ్రహం స్థానంలో కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు. -
రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఐటీ అభివృద్ధికి పునాది వేసిందే కాంగ్రెస్ అని, కానీ.. చరిత్ర తెలియని వారు తాము ఏదో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలో కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే.. కొంతమంది తొలగిస్తామంటున్నారు. ఎవరికైనా చేతనైతే విగ్రహాన్ని ముట్టుకోండి.. వాళ్లను కొట్టి తీరతామంటూ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన. ఆ బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగిస్తామని అన్నారాయన. రాజీవ్ విగ్రహం స్థానంలో కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు. .. ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొన్నారు. అలాంటి వాళ్లకా విగ్రహాలు పెట్టేది? అని రేవంత్ ప్రశ్నించారు. అధికారం పోయినా బలుపు తగ్గలేదని, ఆ బలుపును తగ్గించే బాధ్యతను కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారని బీఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారాయన. కలలో కూడా నీకు అధికారం రాదు అని కేటీఆర్‌పై మండిపడ్డారు. తొందరలోనే రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని, పండగ వాతావరణంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు. సచివాలయం బయట కాదు.. పది సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం గుర్తు రాలేదా? అంటూ బీఆర్ఎస్ను సీఎం రేవంత్ ప్రశ్నించారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతాం.. అదీ సచివాలయం బయట కాదని, లోపల ఏర్పాటు చేస్తామని అన్నారాయన. బీఆర్ఎస్ నాయకులు ఇష్టమున్నట్టు మాట్లాడితే సామాజిక బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తికొంత మంది అమెరికాలో చదువుకుని వచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, ఇండియా ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించింది రాజీవ్ గాంధీ. దేశంలో విప్లవాత్మకమైన చైతన్యానికి కారణం రాజీవ్ గాంధీ. టెక్నాలజీ మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ. మహిళలకు ప్రాధాన్యం ఉండాలని మహిళా సాధికారతకు అడుగులు వేశారు. దేశ సమగ్రత కోసం రాజీవ్ ప్రాణత్యాగం చేశారు. ఆ పేరుతో స్పోర్ట్స్ యూనివర్సిటీమొన్నీమధ్య జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో చిన్న దేశం సౌత్ కొరియా కంటే ఇండియా ప్రదర్శన పేలవంగా ఉంది. అందుకే ఆటగాళ్లను ప్రొత్సహించే దిశగా ప్రయత్నాలు చేస్తాం. 1921 నుండి 1931 వరకు గాంధీ నడిపిన పత్రిక పేరు యంగ్ ఇండియా. అందుకే.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ త్వరలోనే నెలకొల్పుతాం అని సీఎం రేవంత్ అన్నారు. -
అధికారంలోకి వచ్చాక ‘రాజీవ్’ పేరు తొలగిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన ప్రదేశంలో మాజీప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచి్చన తర్వాత ఆ విగ్రహాన్ని మరోచోటకు తరలిస్తామన్నారు. నందినగర్ నివాసంలో కేటీఆర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేర్ల మార్పుపై ఏనాడూ ఆలోచించలేదు. ఆరోగ్యశ్రీ పథకం, ట్రిపుల్ ఐటీ, ఉప్పల్ స్టేడియం, కరీంనగర్– మంచిర్యాల రాష్ట్ర రహదారి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితరాలకు రాజీవ్‌గాంధీ పేరు ఉన్నా మా ప్రభుత్వం ఏనాడూ మార్చే ప్రయత్నం చేయలేదు. రాహుల్‌గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటే గాం«దీభవన్లోనో, రేవంత్‌రెడ్డి ఇంట్లోనో రాజీవ్ విగ్రహం పెట్టుకోవాలి. రాష్ట్ర సాధన ఉద్యమమే ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగింది. కానీ వందలాదిమంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్ మాత్రం మరోమారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణతల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ విగ్రహాన్ని పెడుతోంది. తెలంగాణతల్లికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాన్ని తెలంగాణ సమాజం మరిచిపోదు. మళ్లీ నాలుగేళ్లలో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి కాంగ్రెస్ పార్టీ కోరుకున్న చోటుకు పంపిస్తాం. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ మహనీయుడి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడతాం. రాజీవ్‌గాంధీ పేరిట ఉన్న సంస్థల పేర్లను కూడా మార్చే దిశగా ఆలోచిస్తామని ఢిల్లీకి గులాములుగా ఉన్న కాంగ్రెస్ నేతలకు చెబుతున్నా’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి ‘తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సచివాలయం ఎదురుగా ప్రతిíÙ్ఠంచాలనే ఉద్దేశంతో ఒక ఐలాండ్ కూడా నిర్మించాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెడుతోంది. జై తెలంగాణ అనని సీఎం రేవంత్ కనీసం అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ కూడా వేయలేదు. దివంగత మాజీ సీఎం అంజయ్య పేరిట ఏర్పాటు చేసిన పార్కును లుంబినీగా మార్చి, అదే పార్కు ఎదుట ఆయన్ను అవమానించిన రాజీవ్‌గాంధీ విగ్రహం పెడుతున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. పదేళ్ళ పాలన ఓ యజ్ఞంలా సాగించాం – కేటీఆర్‌తో శ్రీలంక వాణిజ్యమంత్రి భేటీ రాష్ట్రంలో పదేళ్ల పాటు పాలనను ఓ యజ్ఞంలా సాగించి అసాధారణ ఫలితాలు సాధించామని కేటీఆర్ అన్నారు. శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సతాశివన్ వియలందేరన్ కేటీఆర్‌తో నందినగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సమయంలో హైదరాబాద్‌ను అవకాశాల అక్షయపాత్రగా మార్చిన తీరు స్ఫూర్తిదాయకమని సతాశివన్ అన్నారు. హైదరాబాద్ వంటి ఆర్థిక ఇంజిన్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందన్నారు. పదేళ్లకాలంలో తెలంగాణ సాధించిన ప్రగతిని తాను శ్రీలంక పార్లమెంట్లో ప్రస్తావించిన విషయాన్ని సతాశివన్ కేటీఆర్‌కు వెల్లడించారు. ఈ భేటీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నేతలు జాజాల సురేందర్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. రాఖీ రోజు నా సోదరి వెంట లేదు – ‘ఎక్స్’లో కేటీఆర్ భావోద్వేగం ‘ఈ రోజు నాకు రక్షా బంధనం చేయలేకపోవచ్చు. కానీ నీ కష్టసుఖాల్లో వెంట ఉంటా’అని కేటీఆర్ తన సోదరి కవితను ఉద్దేశించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. గతంలో తన సోదరి రాఖీ కట్టిన ఫొటోలను సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘155 రోజులుగా కవిత ఎంతో వేదన అనుభవిస్తోంది. సుప్రీంకోర్టులో ఆమెకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’అని పేర్కొన్నారు. కాగా రాఖీ పండగ సందర్భంగా తెలంగాణభవన్‌లో జరిగిన వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ పదేళ్లపాలనలో తెలంగాణలో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనల వివరాలు ఇస్తామని మంత్రి సీతక్క చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. ‘ఎనిమిది నెలల్లో కొల్లాపూర్, షాద్‌నగర్ సహా అనేక చోట్ల మహిళల పట్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతోందో తెలుసు. కోల్‌కతాలో యువ వైద్యురాలిపై అఘాయిత్యం చేసి చంపేస్తే, నిరసన తెలుపుతున్న డాక్టర్లు తెలంగాణ తరహాలో న్యాయం చేయండి అంటున్నారు. దటీజ్ తెలంగాణ.. దటీజ్ కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మహిళలకు కనీసం రక్షణ లేకుండా పోయింది’అని కేటీఆర్ అన్నారు. -
బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నిజంగా రుణమాఫీ చేస్తే.. రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం వడుదల చేయాలి. రైతులకు క్లియరెన్స్ సర్టిఫిటికెట్ ఇవ్వాలి. చనిపోయిన రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. సోనియాగాంధీ బర్త్ డే రోజున కూడా కూడా మోసం చేశారు. ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది కాంగ్రెస్. రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారు?. రైతుల పక్షాన పోరాడుతాం. విలీనాలు వద్దు.. దండం పెడుతా. ..గతంలో రేవంత్ రెడ్డి బీజేపీ అని బీజేపీలోకి పోతారని ప్రచారం చేశారు. 30 వేల ఉద్యోగాలు ఏ దేశంలో ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పాలె. నోటిఫికేషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ను చేర్చుకోవాల్సిన అవసరరం బీజేపీకి లేదు. కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ఉంది. బీఆర్ఎస్ను కలుపుకుంటే మా ప్రభుత్వం ఏమైనా వస్తదా?. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పక్కాగా కలుస్తాయి. కేసీఆర్ కుటుంబాన్ని లోపల ఎందుకు వేయలేదు?. కేసీఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, భూ స్కామ్ అన్నీ అటకెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇక చేరికలు మాత్రమే ఉన్నాయ్. ప్రజలు కోరితే తప్ప అధికారులు, నాయకులూ స్పందించే పరిస్థితి లేదు. సాగు, తాగు నీటి వంటివాటిపై రివ్యూ లేదు’అని అన్నారు. -
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్
హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ స్వింఘ్వీ నామినేషన్ వేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్‌మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు.అసెంబ్లీ దగ్గర రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘అక్క, చెల్లెమ్మలకు రాఖి పండుగ శుభాకాంక్షలు. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పథకాలు తీసుకువచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందించాం. కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు రుణాలు ఇవ్వలేదు.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు రుణాలు ఇచ్చింది. మహిళల రక్షణ విషయంలోను మా ప్రభుత్వం హై ప్రయారిటీ ఇస్తుంది. అభిషేక్ సింఘ్వీ మను స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చారు. మన రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వీ మను వెళ్ళడం వలన మన రాష్ట్రానికి అన్నివిధాల న్యాయం జరుగుతుంది. అభిషేక్ సింఘ్వీ మను రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నాను’అని అన్నారు.ఆదివారం సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా సీఎల్పీ తీర్మాణం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుడిని కావడం గర్వంగా ఉందని సింఘ్వీ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో రాజ్యసభతో పాటు కోర్టుల్లో నా వాదన వినిపిస్తానని తెలిపారు.